ప్లీజ్‌.. ఎవరైనా సాయం చేయండి.. మంచు లక్ష్మి విజ్ఞప్తి! | Tollywood Actress Manchu Lakshmi Request For Visa Help In Embassy, Post Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Manchu Lakshmi: నెలరోజులు దాటింది.. ప్లీజ్‌ హెల్ప్.. మంచు లక్ష్మి విజ్ఞప్తి!

Published Thu, Jul 4 2024 9:59 PM | Last Updated on Fri, Jul 5 2024 11:18 AM

Tollywood Actress Manchu Lakshmi Request For Visa Help In Embassy

టాలీవుడ్ నటి,నిర్మాత మంచులక్ష్మి తాజాగా చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. తన కుమార్తె కోసం అమెరికా వెళ్లేందుకు సాయం చేయాలని కోరింది. తన కూతురికి పాఠశాల సెలవులు త్వరలోనే ముగియనున్నాయని ఇన్‌స్టా వేదికగా తెలిపింది. నా యూఎస్ వీసా జారీ అయి నెల రోజులకు పైగానే అయిందని వివరించింది. ఎంబసీ కార్యాలయం సైట్‌ సాంకేతిక లోపం రావడంతో..  వీసా తనకు చేరడంలో ఆలస్యమైందని పేర్కొంది. దీనికి ఎవరైనా సాయం చేయగలరా? అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అభ్యర్థించింది. 

ఇన్‌స్టాలో మంచులక్ష్మి రాస్తూ..'నా అమెరికా వీసా ఒక నెల క్రితమే ఆమోదించారు. కానీ అది నాకు ఇప్పటికీ అందలేదు. నా కుమార్తె పాఠశాల సెలవులు ముగిశాయి. నేను ఎక్కాల్సిన విమానం విమానం జూలై 12న ఉంది. ఎంబసీ వెబ్‌సైట్ డౌన్ కావడంతో.. వారిని సంప్రదించడానికి నాకు మార్గం లేకుండా పోయింది. ఇప్పటికే రెండు నెలలు దాటింది. దయచేసి ఎవరైనా స్పందించి సహాయం చేయగలరా?' అంటూ పోస్ట్ చేసింది.  భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు రాయబారి ఎరిక్‌ గార్సెట్టి సామాజిక మాధ్యమాల ఖాతాలనూ ట్యాగ్‌ చేస్తూ తన పరిస్థితి వివరించారు. సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement