
US-Canada H-1B visa holders: అమెరికా హెచ్-1 బి వీసాదారులకు కెనడా శుభవార్త వెల్లడించింది. హెచ్-1 బీ వీసాదారులు ఇకపై కెనడాలో కూడా పనిచేయవచ్చని తాజాగా ప్రకటించింది. అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులను ఆకర్షించేందుకు యూఎస్ హెచ్-1 వీసా హోల్డర్లకు ఓపెన్ వర్క్ పర్మిట్లను ఇవ్వడం ప్రారంభించింది. దీని ద్వారా అమెరికాలో ఉన్న 75 శాతం భారత హెచ్-1బీ వీసాదారులకు ప్రయోజనం చేకూరనుంది. (హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన అదానీ)
ఈ కొత్త పథకం ద్వారా కెనడా ప్రభుత్వం10వేల మంది దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ వీసా హోల్డర్లు కెనడాలో మూడు సంవత్సరాల పాటు పని చేయడానికి అనుమతిస్తుంది. ఈ వీసా హోల్డర్ల కుటుంబ సభ్యుల చదువుకోవచ్చు లేదా దేశంలో పని చేసుకోవచ్చు. ఇందుకు తాత్కాలిక నివాస వీసా, వర్క్ లేదా స్టడీ పర్మిట్ లభిస్తుందని పేర్కొంది. ఇప్పటిదాకా యూఎస్‌లో పని చేసే హెచ్-1 బీ హోల్డర్లు స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసాను ఉపయోగించేవారు.
కాగా 2023 వసంవత్సరం జులై 16వతేదీ నాటికి హెచ్1 బి వీసా హోల్డర్‌లు, వారితో పాటు కుటుంబ సభ్యులు కెనడాకు రావడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కెనడా ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టెక్ కంపెనీలు ఇండియా, చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం పదివేల ఉద్యోగులను నియమించు కుంటాయి. (అత్యధిక ట్యాక్స్ కట్టే బీటౌన్ భామ ఎవరో తెలుసా? నెటవర్త్ తెలిస్తే షాకవుతారు)
Comments
Please login to add a commentAdd a comment