గత కొద్ది రోజులుగా అమెరికాలో ఉద్యోగాలు పోగోట్టుకున్న వారికి ఎలాంటి ఊరట లేదని యూఎస్‌సీఐఎస్(USCIS), మరియు అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ( US Department of Homeland Security) తేల్చిచెప్పింది. హెచ్1బీ(H1B) వీసా మీద అమెరికాకు వచ్చి ఉద్యోగం చేస్తున్న వాళ్లు ఎవరైనా లేఆఫ్ కింద ఉద్యోగం పోతే కేవలం 60 రోజులు మాత్రమే వారు ఆ దేశంలో ఉండవచ్చు. ఒక వేళ 60 రోజుల్లో మరో ఉద్యోగం రాకపోతే.. తక్షణం అమెరికా వీడాల్సి ఉంటుంది. ఒక వేళ అమెరికా వదలి వెళ్లకపోతే వాళ్లు చట్ట విరుద్ధంగా ఉన్నారన్నముద్ర పడుతుంది.
ఈ మేరకు యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ (US House of Representatives) కు సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తరపున ఆ సంస్థ డైరెక్టర్ జడ్డో ఒక లేఖ రాశారు. 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను యూఎస్‌సీఐఎస్ అమెరికా ప్రభుత్వం పెంచవచ్చన్న ఊహాగానాలకు ఇప్పుడు తెరపడినట్టయింది.
Comments
Please login to add a commentAdd a comment