ఎలన్ మస్క్ తొలగించిన ట్విటర్ ఉద్యోగులకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవని తెలుస్తోంది. వీలైనంత త్వరగా మరో సంస్థలో ఉద్యోగం పొందితే సురక్షితంగా ఉండొచ్చని, లేదంటే దేశ వదిలి వెళ్లాల్సి ఉంటుందని అమెరికన్ చట్టాలు చెబుతున్నాయి.
మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఉద్యోగం కోల్పోవడంతో పాటు..చట్టాల ప్రకారం అమెరికాలో నివసించేందుకు అనర్హులుగా పరిణగణలోకి తీసుకునే అవకాశం ఉంది. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ (యూఎస్‌సీఐఎస్) డేటా ప్రకారం.. అమెరికన్ వర్క్ వీసాలైన హెచ్-1బీ, ఎల్-1లతో ఉద్యోగులు ట్విటర్‌లో పనిచేస్తున్నారు.
ఎలన్ మస్క్ తొలగించిన ఉద్యోగుల్లో పైన పేర్కొన్న వీసా లబ్ధిదారులైతే మరిన్ని ఇబ్బందులు పడనున్నారు. వాటి నుంచి సురక్షితంగా ఉండేందుకు సదరు ఉద్యోగులు 60 రోజుల్లో మరో కొత్త జాబ్, లేదంటే అమెరికన్ సంస్థల నుంచి స్పాన్సర్ షిప్ పొందాల్సి ఉంది. ఆ రెండు అంశాల్లో విఫలమైతే..తమ దేశంలో నివసించేందుకు అమెరికా ప్రభుత్వం ఒప్పుకోదు. కాగా, ట్విటర్ మొత్తం ఉద్యోగుల్లో 8శాతం (625 నుంచి 670) మంది హెచ్-1బీ వీసా హోల్డర్స్ ఉన్నారు.
హెచ్-1బీ వీసా హోల్డర్లు
హెచ్-1బీ వీసాదారులకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ, ఎల్-1, ఓ-1 వీసాలపై పనిచేసే కార్మికులకు ఇది చాలా కష్టం. అరుదైన పరిస్థితుల్లో తప్ప, వారు ఉద్యోగం కోల్పోయిన వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని లాక్వెస్ట్ మేనేజింగ్ పార్టనర్ పూర్వీ ఛోతాని తెలిపారు. సాధారణంగా ఒక హెచ్-1బి ఉద్యోగిని తొలగిస్తే.. మరో సంస్థలో ఉద్యోగం పొందందేకు సుమారు 60రోజుల గ్రేస్ పిరియడ్ ఉంటుంది. ఖచ్చితమైన గ్రేస్ పీరియడ్ సదరు కార్డు హోల్డర్లను ఎంపిక చేసుకునే సంస్థపై ఆధారపడి ఉంటుంది.
ఇక మస్క్ తొలగించిన ఉద్యోగులు హెచ్-1 బీ వీసా వచ్చే ఏడాది సెప్టెంబర్ 30,2023 వరకు సమయం ఉంది. 60 రోజుల్లో మరో జాబ్ పొందడం పెద్ద కష్టమేమి కాదని ఛోతాని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే గత ఆరేళ్లలో హెచ్-1బీ క్యాప్ లాటరీలో ఎంపికైన హెచ్-1బీ వర్కర్లు వచ్చే లాటరీ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. 60 రోజుల గ్రేస్ పీరియడ్ లో మరో స్పాన్సర్‌ను పొందలేకపోతే వారు తమ సొంత దేశం నుంచి అమెరికాలో జాబ్ కోసం ప్రయత్నించవచ్చు.
ఎల్-1 వీసా హోల్డర్ల
ఎన్-1ఏ వీసా అటే అమెరికా ప్రభుత్వం జారీ చేసిన నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవలు విదేశీ డైరెక్టర్లు లేదా మేనేజర్‌లను యూఎస్‌లో ఉన్న వారి కంపెనీలకు ట్రాన్స్‌ఫర్ చేయడం కోసం ఈ తరహా వీసాను జారీ చేస‍్తుంది. ఈ తరహా వీసాపై ఉద్యోగం చేసేవారు..జాబు కోల్పోతే వెంటనే దేశం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. మరి ట్విటర్ తొలగించిన ఎల్-1ఏ వీసా ఉద్యోగులకు భవిష్యత్ ఎలా ఉంటుందనేది ప్రశ్నార్ధకంగా మారింది.
చదవండి👉 ‘ట్విటర్‌లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment