అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్-4 వీసా దారులకు ‘ఆటోమేటిక్‌గా వర్క్ ఆథరైజేషన్’ విధానాన్ని అమలు చేయనుంది. తద్వారా కొన్ని లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
హెచ్1- బీ వీసా దారులైన భార్య భర్తలు వారి 21ఏళ్ల లోపు వయస్సున్న పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వీలుగా హెచ్-4 వీసాను జారీ చేస్తుంటారు. ఈ వీసా ఉంటే సరిపోదు ఉద్యోగం చేసేందుకు వీలుగా తప్పని సరిగా ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్, ఐ-765 కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ధరఖాస్తు అనంతరం అధికారులు ఆథరైజేషన్ చేస్తారు. కానీ ఇక్కడే హెచ్-4 వీసా దారులకు ఆథరైజేషన్ సమయం ఎక్కువ కావడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొనే వారు.
ఈ నేపథ్యంలో వారికి లబ్ధి చేకూరేలో జోబైడెన్ ప్రభుత్వం హెచ్-4 వీసా దారులు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ధరఖాస్తు ప్రక్రియను మరింత సులభ తరం చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
తాజాగా, అమెరికన్ సెనెట్‌లో రిపబ్లికన్‌లు, డెమోక్రాట్‌ల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల్లో ‘జాతీయ భద్రతా ఒప్పందానికి’ ఆమోదం తెలిపేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. ప్రస్తుతమున్న నిబంధనలు మార్చి హెచ్-4 వీసాదారులకు ఆటోమేటిక్‌గా వర్క్ ఆథరైజేషన్ కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లు వైట్‌హౌట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితంగా హెచ్-4 వీసా దారులకు లబ్ధి చేకూరుతుందని జోబైడెన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment