‘హెచ్-1బీ వీసా’.. ఆన్‌లైన్‌ ఫైలింగ్‌పై కీలక అప్‌డేట్‌! | US Announces Fresh Selection Criteria For H-1B Visa, New Rules From October - Sakshi
Sakshi News home page

H-1B Visa New Rules And Updates: ‘హెచ్-1బీ వీసా’.. ఆన్‌లైన్‌ ఫైలింగ్‌పై కీలక అప్‌డేట్‌!

Published Wed, Jan 31 2024 9:37 AM | Last Updated on Wed, Jan 31 2024 2:13 PM

Us Announces Fresh Selection Criteria For H-1b Visa, New Rules From October - Sakshi

అగ్రరాజ్యం అమెరికా వీసాల పునరుద్దరణ, జారీ వంటి అంశాలపై వరుస ప్రకటనలు చేస్తోంది. కొద్ది రోజుల స్వల్ప వ్యవధిలో భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన పౌరులకు ఎన్ని వీసాలు జారీ చేసిందో తెలిపింది. ఆ తర్వాత హెచ్‌-1 బీ వీసా రెన్యువల్‌ కోసం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.  

అయితే తాజాగా, ఈ ఏడాది 2025 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1 బీ వీసా దరఖాస్తుల్లో కొన్ని మార్పులు చేసింది. కొన్ని కొత్త నిబంధనలను అమలు చేయనుంది. అవేంటనేది ఒక్కసారి పరిశీలిస్తే  

2025 ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ రిజిస్ట్రేషన్ వ్యవధి 2024 మార్చి 6 నుంచి ప్రారంభమై మార్చి 21 వరకు ఉంటుంది. దీనిని వీసా ఇన్షియల్‌ రిజిస్ట్రేషన్ పిరియడ్‌ అంటారు.  ఈ స్వల్ప వ్యవధిలో సంస్థలు హెచ్ -1 బీ వీసా స్పాన్సర్ చేయాలనుకునే తమ ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లను సమర్పించాలి.  

ప్రతి ఏటా కేవలం 65 వేల హెచ్‌-1బీ వీసాలను మాత్రమే యూఎస్‌ సిటిజెన్‌షిప్‌, ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) జారీ చేస్తుంది. అలాగే అమెరికాలో ఉన్నత విద్యనభ్యంసించిన 20 వేల మంది విదేశీ విద్యార్ధులకు ఈ వీసాలను అందజేస్తుంది.

ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం 2025లో సైతం నిబంధనలకు లోబడి 65 వేల హెచ్‌-1బీ వీసాలను జారీ చేస్తామని తెలిపింది. యూఎస్‌సీఐఎస్‌ విభాగం హెచ్‌-1 బీ వీసాల ధరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 1న (ఆర్ధిక సంవత్సరం) నుంచి చేపట్టనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30న ముగుస్తుంది. 

అక్టోబర్‌ నుంచి హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలోపేతం చేస్తూ, మోసాలను తగ్గించేలా వీసా జారీలపై కొత్త నిబంధనలను అమలు చేయనుంది.  

ఇక ఈ వీసాల కోసం ధరఖాస్తు సమయంలో అభ్యర్ధులు తప్పుడు ధృవీకరణ పత్రాలు లేదంటే లేదా చెల్లని డాక్యుమెంట్లను జత చేస్తే హెచ్‌-1బీ ధరఖాస్తులను తిరస్కరించడం లేదా రద్దు చేయడం జరుగుతుందని యూఎస్‌సీఐఎస్‌ అధికారులు సూచిస్తున్నారు. 

ఈ ఏడాది ప్రత్యేకం హెచ్-1 బీ వీసా అప్లికేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ అందులో మోసాలకు చెక్‌పెట్టేలా ఆర్గనైజేషనల్ అకౌంట్స్ విధానాన్ని ప్రారంభించనుంది. ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థలోని ఉద్యోగులకు హెచ్-1 బీ వీసా అప్లికేషన్‌ను రూపొందించే ప్రక్రియలో ఆయా వ్యాపార సంస్థలు, న్యాయ సలహాదారులు ఈ అకౌంట్స్ ద్వారా సమన్వయం చేసుకునే వీలు లభిస్తుంది. ఈ అకౌంట్ ద్వారా, నాన్ ఇమిగ్రంట్ వర్కర్ కోసం సమర్పించే ఫామ్ ఐ 129 (I-129), ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీస్‌కు అవకాశం కల్పించే ఫామ్ ఐ 907 (I-907) లను సులభంగా అప్లై చేయవచ్చు.

ఈ విధానం ద్వారా మరింత మెరుగైన సేవలు అందుతాయని, ఇది హెచ్ 1 బీ వీసా ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో ఒక ముందడుగు గా భావిస్తున్నామని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎం జాడౌ తెలిపారు. 

 ఐ -129, హెచ్ -1 బి పిటిషన్ల ఆన్ లైన్ ఫైలింగ్‌ను ప్రారంభించిన తర్వాత, మొత్తం హెచ్ -1 బీ అప్లికేషన్ విధానం పూర్తిగా ఎలక్ట్రానిక్ అవుతుందన్నారు. రిజిస్ట్రేషన్ నుంచి, అప్లికేషన్ పై తీసుకున్న తుది నిర్ణయాన్ని విదేశాంగ శాఖకు తెలియజేసే వరకు అంతా ఆన్ లైన్ అవుతుందని యూఎస్‌సీఐఎస్‌ డైరెక్టర్ ఎం జాడౌ తెలిపారు.

చదవండి👉 హెచ్-1బీ వీసా’.. జోబైడెన్‌ ప్రభుత్వం కీలక ప్రకటన!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement