హెచ్-1బి వీసా దరఖాస్తు దారులకు శుభవార్త..! | H 1B Visa Registration For The Fiscal Year 2023 From March 1 to 18 | Sakshi
Sakshi News home page

హెచ్-1బి వీసా దరఖాస్తు దారులకు శుభవార్త..!

Published Sun, Jan 30 2022 6:14 PM | Last Updated on Sun, Jan 30 2022 6:25 PM

H 1B Visa Registration For The Fiscal Year 2023 From March 1 to 18 - Sakshi

2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బి వీసాల ప్రాథమిక రిజిస్ట్రేషన్లు మార్చి 1 నుంచి మార్చి 18 వరకు కొనసాగనున్నాయి. ఈ మధ్య కాలంలో దరఖాస్తుదారులు, ప్రతినిధులు(పిటిషనర్​ తరఫున వీసాకోసం అప్లయ్​ చేసే వారు) ఆన్​లైన్​ ద్వారా హెచ్​-1బీ వీసాకోసం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని యూఎస్​ సిటిజన్​షిప్​ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్​(యూఎస్​సీఐఎస్​) తాజాగా విడుదల చేసిన ప్రెస్​ రిలీజ్​లో పేర్కొంది.

2023 ఆర్థిక సంవత్సరం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి హెచ్​-1బీ క్యాప్​ కోసం ఓ ప్రత్యేక సంఖ్యను కేటాయించనున్నట్లు యూఎస్​సీఐఎస్​ తెలిపింది. ఈ నంబర్​ను ఉపయోగించి రిజిస్ట్రేషన్​ను ట్రాక్ చేయొచ్చని పేర్కొంది. దరఖాస్తు స్టేటస్​ను మాత్రం ఈ నంబర్​ ద్వారా ట్రాక్​ చేయలేరని స్పష్టం చేసింది.అమెరికాలో పని చేయాలంటే విదేశీయులకు హెచ్​-1బీ విసా తప్పనిసరి. పరిమితకాలంతో ఈ వీసాను అమెరికా ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని టెక్ నిపుణులు హెచ్​-1బీ వీసా కోసం ఎదురు చూస్తుంటారు. వారిలో ఇండియా మొదటి స్థానంలో ఉంటుంది. ఆ తర్వాతి స్థానంలో చైనా ఉంది.

ఈ వీసా కార్యక్రమం ద్వారా యుఎస్ కంపెనీలు భారతీయులను నియమించుకోవచ్చు. అమెరికాలో అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 65,000 హెచ్-1బి వీసాలు జారీ చేయగా, 20,000 వీసాలు యుఎస్ మాస్టర్స్ డిగ్రీ హోల్డర్ల కోసం రిజర్వ్ చేశారు. 2021 ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బి వీసాలను అందుకున్న వారిలో అమెజాన్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు.

హెచ్​-1బీ వీసా కోసం పిటిషనర్లు, వారి తరఫు ప్రతినిధులు మైయూఎస్​సీఐఎస్ ఆన్​లైన్​ అకౌంట్​ను వినియోగించాలని తెలిపింది. రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో అభ్యర్థి 10 డాలర్ల రుసుము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. స్వియ రిజిస్ట్రేషన్ చేసుకునే వారు.. ఫిబ్రవరి 21 నంచి మైయూఎస్​సీఐఎస్ ఆకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చని వివరించింది. మార్చి 31 నాటికి ఎంపిక దరఖాస్తుకు ఎంపికైన వారి వివరాలు.. మైయూఎస్​సీఐఎస్ అకౌంట్​కు అందుతాయని పేర్కొంది. దరఖాస్తు యాదృచ్ఛికంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల హెచ్-1బి వీసా దరఖాస్తుదారులకు నిర్వహించే వ్యక్తిగత ఇంటర్వ్యూను అమెరికా రద్దు చేసింది.

(చదవండి: 5 నిమిషాల్లో పాన్‌కార్టులోని పేరు, పుట్టిన తేదీని మార్చుకోండి ఇలా..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement