
వాషింగ్టన్ : హెచ్1బీ వీసాలకోసం ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్. హెచ్-1 బీ వీసాలకు సంబంధించిన దరఖాస్తులను 2020 ఏప్రిల్ 1నుంచి స్వీకరించనున్నట్లు అమెరికా జాతీయ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను హెచ్1 బీ (నాన్-ఇమ్మిగ్రెంట్) వీసాలు జారీకి అవసరమైన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్)శుక్రవారం వెల్లడించింది.
భారతదేశం, చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం వేల మంది ఐటీ ఉద్యోగులకు హెచ్1 బీ వీసాలకోసం ఆయా కంపెనీలు దరఖాస్తు చేసుకుంటాయి. ఇందుకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోనున్నాయి. హెచ్1బీ కోసం దరఖాస్తు చేసుకునే ఐటీ కంపెనీలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని ప్రాసెసింగ్ ఫీజు కింద 10 అమెరికన్ డాలర్లను చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ 1, 2020 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ కొత్త ప్రక్రియ ద్వారా పరిమితికి లోబడి హెచ్1బీ వీసాలను దక్కించుకోవచ్చు. కేవలం తమ కంపెనీకి సంబంధించిన ప్రాథమిక సమాచారంతోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. మార్చి 1 నుండి 20 వ తేదీ వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లకు అనుమతి వుంటుందని యుఎస్‌సిఐఎస్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment