వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాల కోసం విదేశీయులకు అందించే హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. భారత ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసే ఈ వర్క్ వీసా నిబంధనలను ఇటీవల ట్రంప్ యంత్రాంగం కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే అమెరికా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్1బీ దరఖాస్తులను ఈ నెల 2 నుంచి స్వీకరించనున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) వెల్లడించింది. వీసాల జారీలో పొరపాట్లు జరగకుండా కఠిన చర్యలను చేపట్టినట్టు పేర్కొంది.
వివిధ సోషల్ మీడియా వెబ్‌సైట్లు, గ్రూపుల్లో ఇమిగ్రేషన్ అటార్నీలు స్పందిస్తూ.. ఈసారి తిరస్కరణకు గురయ్యే దరఖాస్తుల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం. హెచ్1బీ అనేది నాన్–ఇమిగ్రెంట్ వీసా. అమెరికా కంపెనీలు ఈ వీసా ఉన్న విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన కంపెనీలు ఎక్కువగా ఈ వీసా కలిగి ఉండే భారత్, చైనా లాంటి దేశాలకు చెందిన వారికి ఎక్కువగా ఉద్యోగాలు ఇస్తుంటాయి. ఈసారి ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే అన్నిటినీ తిరస్కరించే అవకాశం ఉందని యూఎస్‌సీఐఎస్ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment