
వాషింగ్టన్: 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్–1బీ వీసా దరఖాస్తులు నిర్దేశిత పరిమితి అయిన 65 వేలను దాటిపోయాయని అమెరికా వీసా సేవల సంస్థ యూఎస్‌సీఐఎస్ ప్రకటించింది. తదుపరి దశలో లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేసి వీసాలు జారీ చేయనున్నారు. అమెరికాలో కొత్త ఆర్థిక సంవత్సరం 2018, అక్టోబర్ 1న ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 2న హెచ్–1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపిక కాలేకపోయిన దరఖాస్తుదారులకు ఫైలింగ్ రుసుమును తిరిగి చెల్లిస్తామని తెలిపింది. మాస్టర్స్(అడ్వాన్స్‌డ్ డిగ్రీ) విభాగంలోనూ పరిమితి 20 వేలకు సరిపడ హెచ్–1బీ దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది.