ప్రింటింగ్ తప్పు.. వీసా హోల్డర్స్ గుండెల్లో గుబేలు
ప్రింటింగ్ తప్పు.. వీసా హోల్డర్స్ గుండెల్లో గుబేలు
Published Mon, Apr 10 2017 11:30 AM | Last Updated on Wed, Sep 26 2018 6:40 PM
అసలకే ట్రంప్ ఇచ్చే షాక్లతో గుండెలు గుబేలుమంటున్న వీసా హోల్డర్స్ కు, అక్కడి అధికారులు మరో ఝలక్ ఇచ్చారు. వీసా జారీలో తప్పుడు ప్రింటింగ్ వేయడంతో దేశీయ టెక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక్కసారిగాలో గుబులు ప్రారంభమైంది. వీసా ప్రాసెసింగ్ సెంటర్స్ ఆధీనంలో పనిచేసే అమెరికా వీసా ప్రింటింగ్ ప్రెస్, పొరపాటున హెచ్1బీ కు బదులుగా 1బీ1 అని ప్రింట్ చేసింది. చాలామంది వీసాహోల్డర్స్ పిటిషన్లలో హెచ్1బీ బదులుగా 1బీ1ను ఆమోదిస్తున్నట్టు పేర్కొంది. దీంతో అమెరికా ప్రయాణించాలనుకునే వారిలో ఆందోళన ప్రారంభమైంది. హెచ్1బీకి అప్లయి చేస్తే 1బీ1 రావడమేమిటని తలలు పట్టుకున్నారు. ఇటీవలే సస్పెండ్ అయిన ప్రీమియం ప్రాసెసింగ్ ప్రొగ్రామ్ ను రెన్యూవల్ చేపించుకోవడానికి అప్లయి చేసిన విదేశీ పాస్ పోర్టు హోల్డర్స్ ఈ తప్పుడు ప్రింటింగ్ ను గుర్తించారు. వారితో పాటు మిగతా అభ్యర్థులు గుర్తించి, యూఎస్సీఐఎస్ ని సంప్రదించడం ప్రయత్నించారు.
కానీ వారు తమ గోడును వినిపించుకోలేదని హెచ్1బీ వీసా హోల్డర్స్ పేర్కొంటున్నారు. వీసా జారీలో తప్పుడు ప్రింటింగ్ వీసా ఆఫీసర్ క్షమించరాని నేరమని, పిటిషనర్ కాని వారి తరుఫున లాయర్ కాని ఫోన్ చేసిన ఎలాంటి స్పందన ఉండట్లేదని మరో వీసా హోల్డర్ ఆవేదన వ్యక్తంచేశారు. 1బీ1 వల్ల అమెరికా వెలుపల ప్రయాణించాలంటే చాలా కష్టమని పేర్కొన్నారు. ఈ తప్పుడు స్టాంపింగ్ తో స్వదేశానికి ప్రయాణించాంటే వీలుపడదని చెప్పారు. ఈ ఏడాది 3న ప్రారంభించిన ఆరు నెలల ప్రీమియం ప్రాసెసింగ్ ప్రొగ్రామ్ ను ట్రంప్ కార్యాలయం సస్పెండ్ చేసింది. హెచ్1బీ వీసాలను దాదాపు 60 శాతం మంది అప్లయి్ చేశారు. మొత్తం లక్షా 20వేల మంది హెచ్1వీసా హోల్డర్స్ అమెరికాలోఉన్నారు. వారిలో ఎక్కువ మంది టెక్ వర్గానికి చెందినవారే.
Advertisement
Advertisement