మార్చి నుంచి హెచ్‌1బీ వీసా రిజిస్ట్రేషన్లు | H-1B visa registration for 2022 to begin on Mar 1 | Sakshi
Sakshi News home page

మార్చి నుంచి హెచ్‌1బీ వీసా రిజిస్ట్రేషన్లు

Published Sun, Feb 7 2021 4:45 AM | Last Updated on Sun, Feb 7 2021 5:41 AM

H-1B visa registration for 2022 to begin on Mar 1 - Sakshi

వాషింగ్టన్‌: వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021 అక్టోబర్‌ 1–2022 సెప్టెంబర్‌ 30) హెచ్‌–1బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఈ ఏడాది మార్చి 1న ప్రారంభం కానుందని అమెరికా సిటిజెన్‌షిప్, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) ప్రకటించింది. లాటరీ ద్వారానే హెచ్‌–1బీ వీసాలు అందజేస్తామని వెల్లడించింది. కంప్యూటర్‌ ఆధారిత లాటరీ ఫలితాలను మార్చి 31న వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. హెచ్‌–1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వీసాల జారీ విషయంలో ప్రస్తుతం ఉన్న సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్‌ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. హెచ్‌–1బీ వీసాలు పొందినవారు అక్టోబర్‌ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement