Registration process
-
Tamil Nadu politics: రాజకీయాల్లోకి ‘దళపతి’ విజయ్
సాక్షి, చెన్నై: తమిళ రాజకీయ ముఖచిత్రంపై మరో అగ్రతార మెరిసింది. క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్లు తమిళ అభిమానుల ‘దళపతి’, ప్రముఖ నటుడు విజయ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదలచేశారు. ‘‘తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నాం. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేశాం. 2026లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేయడమే మా లక్ష్యం. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వబోం. అవినీతి, అధ్వాన్న పరిపాలన, విభజన రాజకీయాలతో పాలిటిక్స్‌ను భ్రషు్టపట్టించారు. నిస్వార్థంగా, పారదర్శకంగా, మార్గదర్శకంగా, అద్భుతమైన పరిపాలనకు బాటలు పరిచే రాజకీయ ఉద్యమం కోసం తమిళ ప్రజలు ఎదురుచూస్తున్నారు. కుల, మత విభేదాలకు అతీతంగా పాలించే అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ’’ అని విజయ్ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు విజయ్, సీనియర్ నేతలు గత నెల 25వ తేదీన పార్టీ సర్వసభ్య మండలి, కార్యనిర్వాహణ మండలి సమావేశంలో పాల్గొని పార్టీ నియమావళి, నిబంధనలకు ఆమోద ముద్ర వేశారని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్నాళ్లనుంచో సేవ చేద్దామనుకుంటున్నా ‘‘రాజకీయాల్లో మార్పులు తేగల సత్తా ప్రజా ఉద్యమానికే ఉంది. అది మాత్రమే తమిళనాడు పౌరుల హక్కులను కాపాడగలదు. కన్న తల్లిదండ్రులతోపాటు నాకు పేరు ప్రతిష్టలు తెచి్చన రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నా. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి, విజయం సాధించి ప్రజలు కలలుగన్న రాజకీయ మార్పుకు బాటలు వేయడమే మా లక్ష్యం. ఈసీ నుంచి అనుమతులు వచ్చాక పార్టీ కార్యక్రమాలు మొదలుపెడతాం. లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాక పార్టీ కార్యకర్తలను సంఘటితం చేసి పార్టీ విధానాలు, పార్టీ జెండా, పార్టీ గుర్తు, ఇతర కార్యాచరణకు తుదిరూపునిస్తాం’’ అని విజయ్ స్పష్టంచేశారు. ‘‘ రాజకీయాలంటే సినిమా ప్రపంచం నుంచి నాకు ఒక విరామం కాదు. తపనతో రాజకీయాల్లోకి వస్తున్నా. రాజనీతి అంటే ప్రజలకు గొప్పగా సేవ చేయడం. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేసి రాజకీయాలకు అంకితమవుతా’’ అని అన్నారు. -
దశల వారీగా ఈ–ఎఫ్ఐఆర్ల రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: దేశంలో ఈ–ఎఫ్ఐఆర్ల (ఎల్రక్టానిక్ ప్రాథమిక సమాచార నివేదిక) రిజి్రస్టేషన్ ప్రక్రియను దశల వారీగా అమల్లోకి తీసుకురావాలని లా కమిషన్ సూచించింది. ఈ మేరకు తన నివేదికను ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. తొలుత మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే నేరాల్లో ఈ–ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని వెల్లడించింది. ఈ–ఎఫ్ఐఆర్ల రిజిస్ట్రేషన్ కోసం దేశవ్యాప్తంగా కేంద్రీకృత జాతీయ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించింది. -
మార్చి నుంచి హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్లు
వాషింగ్టన్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021 అక్టోబర్ 1–2022 సెప్టెంబర్ 30) హెచ్–1బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ఏడాది మార్చి 1న ప్రారంభం కానుందని అమెరికా సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. లాటరీ ద్వారానే హెచ్–1బీ వీసాలు అందజేస్తామని వెల్లడించింది. కంప్యూటర్ ఆధారిత లాటరీ ఫలితాలను మార్చి 31న వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. హెచ్–1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వీసాల జారీ విషయంలో ప్రస్తుతం ఉన్న సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ వీసాలు పొందినవారు అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. -
‘అనుమతి’ లేకుంటే అంతే..
సాక్షి, హైదరాబాద్: అనుమతులు లేని లే అవుట్లలోని స్థలాలు, భవనాలు, ఇతర నిర్మాణాల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వులతో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ఉత్తర్వుల ప్రభావం పెద్దగా కనిపించకపోయినా మిగిలిన చోట్ల మాత్రం రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రెండో రోజు వరుసగా వ్యవసాయ భూములు, హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులున్న భూములు, భవనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు పరిమితమయ్యాయి. తాజా ఉత్తర్వులతో అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. డాక్యుమెంట్ రైటర్ల స్థాయిలోనే... రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారికి డాక్యుమెంట్ రైటర్ల నుంచే ఎల్ఆర్ఎస్ ఉందా? మున్సిపల్, పంచాయతీల అనుమతులున్నాయా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే డాక్యుమెంట్ రైటర్లతో సమావేశమైన సబ్ రిజిస్ట్రార్లు అనుమతులు లేని వాటికి డాక్యుమెంట్లు సిద్ధం చేసి తమ వద్దకు పంపవద్దని ఆదేశాలిచ్చారు. దీంతో అనుమతులకు సంబంధించిన పత్రాలు చూపెడితేనే రాష్ట్ర వ్యాప్తంగా రైటర్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నారు. దీంతో అనుమతులు లేని డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ డాక్యుమెంట్ రైటర్ల స్థాయిలోనే వరుసగా రెండో రోజు నిలిచిపోయింది. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్న ప్రజలు వెనుతిరిగి పోతున్నారు. కొందరు తమ వద్దకు వచ్చి గతంలో మీరే రిజిస్ట్రేషన్ చేశారు కదా.. ఇప్పుడెందుకు చేయరంటూ ప్రశ్నిస్తున్నారని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారు. అనుమతి లేకపోతే గతంలో ఎలా రిజిస్ట్రేషన్ చేశారని అడుగుతున్న ప్రశ్నలకు సబ్ రిజిస్ట్రార్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. సీఎం గుస్సా?... తాజాగా జారీ చేసిన ఉత్తర్వులపై రిజిస్ట్రేషన్ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో కూడా ఇలాంటి ఉత్తర్వులు ఉన్నా పెద్దగా పట్టించుకోలేదని, ఇప్పుడు మాత్రం సీఎం కేసీఆర్ ఆగ్రహం కారణంగా స్పష్టమైన ఉత్తర్వులు వచ్చాయని తెలుస్తోంది. పాలనలో పారదర్శకత కోసం కొత్త చట్టాలు తెస్తున్నామని, అయినా నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఎలా జరుగుతున్నాయని ఇటీవల జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఉన్నతాధికారులను సీఎం గట్టిగా ప్రశ్నించారని, ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు వచ్చాయనే చర్చ రిజిస్ట్రేషన్ శాఖ వర్గాల్లో జరుగుతోంది. -
‘హెచ్–1బీ’కి ఇక ఇ–రిజిస్ట్రేషన్
వాషింగ్టన్: భారత్ టెక్కీల డాలర్ కలలను నెరవేర్చే, అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేయడానికి వీలు కల్పించే హెచ్–1బీ వీసా దరఖాస్తు విధానాన్ని మార్చినట్లు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. 2021ఏడాది హెచ్1బీ దరఖాస్తులను ఇకపై ఎలక్ట్రానిక్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. కంపెనీలు తాము తీసుకోబోయే ఉద్యోగుల వివరాలను సమగ్రంగా అందజేయాలని కోరింది. రిజిస్ట్రేషన్ కోసం 10 డాలర్లను ఫీజుగా చెల్లించాలి. ఏటా 85 వేల హెచ్–1బీ వీసాలను ఈ వీసా దరఖాస్తులు పూర్తయ్యాక లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన 85 వేల వీసాలు మంజూరు చేస్తారు. ‘ఎలక్ట్రానిక్ ప్రక్రియ వల్ల పేపర్ వర్క్ తగ్గుతుంది. ఐటీ కంపెనీల, ఉద్యోగుల సమాచారం ఇవ్వడం సులభతరం అవుతుంది’అని ఇమిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. 2020–21 సంవత్సరానికి వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్, ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. -
ఎన్బీఎఫ్సీ రిజిస్ట్రేషన్ ఇక ఎంతో సులువు!
ముంబై: నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) నమోదు ప్రక్రియను సులభతరం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎన్బీఎఫ్సీ లెసైన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే 45 డాక్యుమెంట్లతో కూడిన భారీ చిట్టాను సమర్పించాల్సి వచ్చేది. దీన్ని ఎనిమిది డాక్యుమెంట్లకు కుదించినట్టు ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఏదేనీ అదనపు సమాచారం, పత్రాన్ని కోరినట్టయితే సంస్థలు 30 రోజుల్లోపు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే, ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి రెండు వేర్వేరు దరఖాస్తులు ఉంటాయని స్పష్టం చేసింది. టైప్-1 విధానంలో నిధులు సమీకరణకు అవకాశం లేని (ఎన్బీఎఫ్సీ-ఎన్డీ) సంస్థల దరఖాస్తు పరిశీలనను వేగంగా పూర్తిచేయనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ సంస్థలు ప్రజల నుంచి నిధులు సేకరించడానికి అవకాశం ఉండదు. ఒకవేళ భవిష్యత్తులో ఈ విధమైన లావాదేవీలు కూడా నిర్వహించుకోవాలని భావిస్తే అందుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. -
ఇక అన్ని జిల్లాల్లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్లు
గుంటూరు (తెనాలిఅర్బన్): రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజలకు మరింత సులభతరమైందని, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అందుబాటులోకి వచ్చిందని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ బి.సూర్యనారాయణ చెప్పారు. తెనాలిలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు పలు ప్రాంతాలకు చెందిన సబ్ రిజ్రిస్టార్లతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడైనా రిజిస్ట్రేషన్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా నిర్ధేశించిన ఆదాయ లక్ష్యంపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొద్ది కాలంగా స్టాంపు పేపర్ల కొరత ఉందన్నారు. అయితే రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్‌తో మాట్లాడి ఈ సమస్యను అధికమించామన్నారు. స్టాంపు పేపర్లు పుష్కలంగా సరఫరా అయ్యాయని, వాటిని అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాలకు అందజేస్తామన్నారు. దాదాపు ఆరు నెలల వరకూ స్టాంపు పేపర్లకోసం వెతుక్కోవాల్సిన పని ఉండదన్నారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. గతంలో కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైనా, ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉందన్నారు. ఈ ప్రక్రియలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది ప్రజలకు పూర్తి సహకారం అందించేందుకు సిద్దమన్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాన్ని మార్చి నెలాఖరుకు పూర్తిచేస్తామన్నారు. -
26 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిపివేత
మహబూబ్‌నగర్ అర్బన్: జిల్లాలోని సబ్ రిఇస్ట్రార్ కార్యాలయాల్లో భూములు, ఇతర విభాగాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 23వతేదీ నుంచి 26 వరకు నిలిపి వేస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సీసీఏ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు, చేర్పులు చేయడానికి సంకల్పించినందున ఈ నాలుగు రోజుల పాటు రిజిస్ట్రేషన్ల కార్య కలాపాలను నిలుపుదల చేస్తున్నామన్నారు. జిల్లా ప్రజలకు ఈ మార్పును గమనించాలని కోరారు. -
కౌన్సెలింగ్‌పై ఉత్కంఠ!
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమైక్య సెగ తగులుతోంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియకు దూరమని ఉద్యోగులు ప్రకటించడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై ఎట్టకేలకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించినా క్షేత్రస్థాయిలో అనువైన పరిస్థితులు కానరావడం లేదు. ఈ ఏడాది మే 10న నిర్వహించిన ఇంజినీరింగ్ అర్హత పరీక్షకు జిల్లాలో 17, 582 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను మే నెలాఖరులో ప్రకటించారు. పరీక్షకు హాజై రెన విద్యార్థులంతా దాదాపుగా ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి అర్హత సాధించారు. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల, నర్సీపట్నం ప్రభుత్వ కళాశాలల్లో ఏర్పాట్లు చేశారు. కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా మంగళవారం నుంచి విశాఖలో పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ (పాలా) ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. ఆరు రోజులుగా కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు దీక్షలో పాల్గొంటున్నారు. వీరితో పాటు జిల్లాని అనకాపల్లి, భీమిలి, నర్సీపట్నం, పాడేరు ప్రభుత్వ కళాశాలల సిబ్బంది మద్దతు తెలుపుతున్నారు. పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్‌లోని ఉద్యోగులంతా సమైక్యాంధ్రకు మద్దతుగా విధులను బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. మాకుమ్మడి సెలవులు పెట్టారు. ఈ నెల 19 నుంచి హెల్ప్ సెంటర్లలో విధులకు హాజరు కాబోమని తేల్చిచెప్పారు. దీనికితోడు విధులను బహిష్కరిస్తున్నట్టు పాలా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంధ్రశేఖర్ మరోమారు ప్రకటించారు. కన్వీనర్ నుంచి ఎటువంటి ఉత్తర్వులు తమకు అందలేదని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బి.దేముడు చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో... ప్రధానంగా కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు కుల, నివాస, ఆదాయ ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలి. వీటి ఆధారంగానే విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తారు. ప్రస్తుతం రెవెన్యూ ఉద్యోగులంతా సమ్మెలో ఉండటం వల్ల వీటిని పొందే అవకాశం లేదు. దీంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె వల్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కౌన్సెలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు బస్సుల ఇబ్బంది తలెత్తనుంది. సమైక్యాంధ్ర సమ్మె వల్ల రోడ్లపై ఆందోళనలతో వాహనాలు తిరిగే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తే అధికశాతం మంది విద్యార్థులు హాజరు కాకపోవడమే కాకుండా, ధ్రువపత్రాలు లేక మరికొంతమంది అనర్హులుగా పరిగణించబడతారు. దీంతో కౌన్సెలింగ్ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది.