BMC Filed Case On Actress Gauahar Khan For Violating Corona Guidelines - Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ నటి గౌహర్‌ ఖాన్‌పై కేసు నమోదు

Published Mon, Mar 15 2021 2:07 PM | Last Updated on Mon, Mar 15 2021 7:04 PM

Bollywood Actress Gauahar Khan FIR Filed By BMC Mumbai - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి, మోడల్‌ గౌహర్‌ ఖాన్‌పై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కేసు నమోదు చేసింది. ఆమెకు కరోనా వైరస్‌ సోకిందని, తమ సిబ్బందితో సహరించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించిందని బీఎంపీ అధికారులు తెలిపారు. హోం క్వారంటైన్‌ స్టాంప్‌ వేయడానికి ఆమె ఇంటికి బీఎంసీ సిబ్బంది వెళ్లారని ఆ క్రమంలో తన ఇంటి తలుపులు మూసినట్లు పేర్కొన్నారు. దీంతో బీఎంసీ అధికారులు గౌహర్‌ ఖాన్‌పై ఓషివారా పోలీస్ స్టేషన్‌ ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కోవిడ్‌-19 పాజిటివ్‌కు గురైన గౌహర్‌ ఖాన్‌ ఇంట్లో ఉండకుండా బయట తిరిగిందని ఓ వ్యక్తి ఫిర్యాదు కూడా చేసినట్లు బీఎంసీ అధికారి తెలిపారు. ఆమెను తన ఇంటికి తిరిగి రావాలని కోరిగా, వచ్చి కోవిడ్‌ నిర్థారణ పరీక్ష చేయించుకుందని పేర్కొన్నారు. ఆమెకు నెగటివ్‌ వచ్చిందని, కానీ చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవరించిందని తెలిపారు. తాము ఆమె ఫోన్‌ చేసినా సరిగా స్పందించలేదన్నారు. బీఎంసీ తన ట్విటర్‌ ఖాతాలో ఆమెపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను జత చేసింది.

చదవండి: భర్తను ఎత్తుకున్న నటి.. ఫోటో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement