
సాక్షి, హైదరాబాద్: పటాన్‌చెరువు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన పెద్ద కొడుకు విష్ణువర్థన్ గుండెపోటుతో మృతి చెందాడు. అనారోగ్యంతో మూడు రోజుల నుంచి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విష్ణు.. గత అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూసినట్లు సమాచారం.
పుత్రశోకంతో కుంగిపోయిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఆస్పత్రికి వెళ్లి తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. మహిపాల్ రెడ్డి, కుటుంబ సభ్యులను మంత్రి హరీశ్ రావు ఓదార్చారు. మరోవైపు ఎమ్మెల్యే తనయుడి మృతితో స్థానికంగా కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment