patancheruvu
-
పుత్రశోకంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.. హరీష్‌రావు ఓదార్పు
సాక్షి, హైదరాబాద్: పటాన్చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన పెద్ద కొడుకు విష్ణువర్థన్ గుండెపోటుతో మృతి చెందాడు. అనారోగ్యంతో మూడు రోజుల నుంచి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విష్ణు.. గత అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూసినట్లు సమాచారం. పుత్రశోకంతో కుంగిపోయిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఆస్పత్రికి వెళ్లి తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. మహిపాల్ రెడ్డి, కుటుంబ సభ్యులను మంత్రి హరీశ్ రావు ఓదార్చారు. మరోవైపు ఎమ్మెల్యే తనయుడి మృతితో స్థానికంగా కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. -
15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 117 బ్లాకులు..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం భారీ స్థాయిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రాజెక్టు ‘కేసీఆర్ నగర్ 2బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్ టౌన్షిప్’ను గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం మండలం కొల్లూరులో రెండో దశ కింద ఈ టౌన్‌షిప్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన ఆరుగురు లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ఇళ్ల పట్టాలను అందించనున్నారు. కార్పొరేట్ స్థాయి హంగులతో.. కొల్లూరులో సుమారు 144.50 ఎకరాల్లో రూ.1,474.75 కోట్ల వ్యయంతో కార్పొరేట్ అపార్ట్మెంట్లకు తీసిపోని విధంగా, సకల హంగులు, మౌలిక సదుపాయాలతో టౌన్‌షిప్‌ను నిర్మించారు. ఇక్కడ మొత్తంగా 117 బ్లాకుల్లో 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయి. ఈ టౌన్షిప్లో మొత్తంగా 6 నుంచి 36 మీటర్ల వెడల్పు గల 13.50 కిలోమీటర్ల పొడవైన రోడ్లను నిర్మించారు. మొత్తంగా 2.1 కోట్ల లీటర్ల సామర్థ్యమున్న నీటి నిల్వ (అండర్ గ్రౌండ్ కలిపి) ట్యాంకులను ఏర్పాటు చేశారు. అండర్ గ్రౌండ్ ద్వారానే విద్యుత్ సరఫరా కేబుళ్లు వేశారు. లిఫ్టులకు, వాటర్ సప్లై, ఎస్టీపీలకు విద్యుత్ సరఫరా కోసం 30 కేవీఏ నుంచి 400 కేవీఏ వరకు 133 జనరేటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మురుగు నీటిని బయటకు పంపించకుండా రీసైక్లింగ్ చేసే ఎస్టీపీలను, శుద్ధి చేసిన నీటిని సుందరీకరణ పనులకు వాడేలా పైప్‌లైన్ నిర్మించారు. 10.55 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, 10.05 కిలోమీటర్ల తాగునీటి పైప్‌లైన్, 10.60 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ పైప్‌లైన్, 137 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వీధి దీపాల కోసం 528 స్తంభాలు ఏర్పాటు చేశారు. 54,000 చదరపు అడుగుల విస్తీర్ణమున్న 3 షాపింగ్ కాంప్లెక్స్‌లలో 118 షాపులు, ప్రతి బ్లాక్‌కు రెండు చొప్పున 234 లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. సామాజిక వసతులూ ఎన్నో.. ► టౌన్షిప్ వాసులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్కు, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్, ఆట స్థలం, ఓపెన్ జిమ్, ఇండోర్ స్పోర్ట్ కాంప్లెక్స్, ఓపెన్ స్పోర్ట్స్ ఏరియా, మల్టీపర్పస్ గ్రౌండ్, ఆంఫి థియేటర్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, బతుకమ్మ ఘాట్లనూ ఏర్పాటుచేశారు. ► కాలనీ వాసుల కోసం ఆధునిక కూరగాయల, మాంసాహార మార్కెట్, విద్యార్ధుల కోసం ప్లేస్కూల్, అంగన్వాడీ సెంటర్, బస్తీ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక, ఉన్నత పాఠశాల, బస్ టెర్మినల్, బస్‌స్టాప్, పోలీస్‌స్టేషన్, ఫైర్‌స్టేషన్, మిల్క్ బూత్‌లు, పెట్రోల్ బంకు, పోస్టాఫీసు, ఏటీఎం, బ్యాంకు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యార్డు వంటివి ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. శంకర్‌పల్లిలో ప్రైవేటు రైల్వే ఫ్యాక్టరీని ప్రారంభించనున్న కేసీఆర్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ’ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. వంద ఎకరాల్లో, సుమారు వెయ్యి కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ 2017–18లో శంకుస్థాపన చేయగా.. ఇటీవలే పనులు పూర్తయి ఉత్పత్తి ప్రారంభమైంది. దీనిని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఏటా 500 రైల్వేకోచ్‌లు, 50లోకోమోటివ్ల ఉత్పత్తి లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. వాటిని వివిధ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. రైల్వే పరికరాల ఉత్పత్తిలోని ప్రైవేటు సంస్థల్లో పెద్దదైన మేధా సంస్థ.. భారతీయ రైల్వేకు కూడా వివిధ ఉత్పత్తులను మేధా సంస్థ సరఫరా చేస్తోంది. ఫాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికిపైగా ఉపాధి పొందనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కంపెనీ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, అధికారులు పరిశీలించారు. పటాన్చెరులో బహిరంగ సభ కొల్లూరులో డబుల్ బెడ్రూం టౌన్‌షిప్‌ను ప్రారంభించిన అనంతరం పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. అనంతరం పటాన్చెరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సభకు ఏర్పాట్లు చేశారు. వీటిని మంత్రి హరీశ్‌రావు బుధవారం పరిశీలించారు. 30 వేల మందితో ఈ సభను నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు మండలం భానుర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. వివాహిత తన చిన్నారితో పాటు వరసకు మరిది అయిన వ్యక్తితో కలిసి ముగ్గురు అనుమానాస్పదంగా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వీడిన మిస్టరీ.. బావే హంతకుడు.. అత్త ఆస్తి కోసం.. -
పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి కూతురుతో కలిసి
సాక్షి, పటాన్చెరు టౌన్: పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి కూతురుతో వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సాయిలు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్చెరు పట్టణంలోని మంజీర పంప్ హౌస్‌లో చంద్రకుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 11 తేదీ ఉదయం చంద్రకుమార్ భార్య ఊర్మిళ, రెండున్నర సంవత్సరాల కూతురు జాహ్నవితో కలసి హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో ఉంటున్న పుట్టింటికి వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. అదే రోజు మధ్యాహ్నం చంద్రకుమార్ భార్యకు ఫోన్‌చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ మెస్సేజ్ రావడంతో అత్తగారింటికి ఫోన్‌చేయగా ఇంకా రాలేదని చెప్పారు. భార్య, కూతురు కోసం తెలిసిన వారిని, బంధువులను విచారించినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో చంద్రకుమార్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
ఆడపిల్ల పుట్టిందని.. కొడుకంటే ఇష్టం లేదని.. చంపేశారు..
సాక్షి,కాగజ్‌నగర్: కన్న ప్రేమ కనికరం చూపలేకపోయింది. కన్నతండ్రే కాల యముడయ్యాడు. ఆడపిల్లగా పుట్టినందుకు 40 రోజుల పసికందును బండరాయితో కొట్టి చంపేశాడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్ మండలం మారేపల్లి పంచాయతీ లైన్‌గూడ గ్రామానికి చెందిన మెస్రం బాపురావు–మానస దంపతులు వ్యవసాయ పనులు చేస్తుంటారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. మూడో సంతానంలోనూ ఆడపిల్ల పుట్టింది. భారంగా భావించిన బాపురావు తాగిన మైకంలో సోమవారం అర్ధరాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 40 రోజుల పసికందును తల్లి పొత్తిళ్ల నుంచి తీసుకెళ్లి రోడ్డుపై పడేసి, బండతో మోది చంపేశాడు. భార్య వారిస్తున్నా వినకుండా ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంకా లోకం కూడా చూడని చిన్నారిని కిరాతకంగా హత్య చేశాడు. పక్కలోని బిడ్డను తీసుకెళ్లి తన కళ్లముందే చంపడంతో తల్లి కంటికి పుట్టెడుగా శోకిస్తోంది. కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు. నిందితుడిని అదుపులోనికి తీసుకున్నట్లు కాగజ్‌నగర్ రూరల్ సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. చదవండి: నయా ట్రెండ్: నోరూరిస్తున్న బిర్యానీ.. తింటే వదల‘మండీ’ ఆరేళ్ల బాలుడిని చితకబాది హతమార్చిన మారుతండ్రి పటాన్చెరు టౌన్: ఆరు సంవత్సరాల బాలుడిని మారు తండ్రి చితకబాదడంతో మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామానికి చెందిన నర్సింహులుకు 11 సంవత్సరాల క్రితం అరుణతో వివాహం జరిగింది. వీరికి జాన్‌పాల్, జస్వంత్, అరుణ్ (6) ముగ్గురు కుమారులు. కాగా నర్సింహులు మద్యానికి బానిసై సంవత్సరం క్రితం మృతి చెందాడు. అరుణ గద్వాలలో పనిచేస్తున్న సమయంలో వినయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నెలరోజుల క్రితం వినయ్, అరుణ మెదక్ చర్చిలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఇస్నాపూర్‌కు వచ్చి పద్మారావునగర్ కాలనీలో నివాసముంటున్నారు. చదవండి: బాలికపై టీఆర్ఎస్ సర్పంచ్ అత్యాచారం.. బాధితురాలికి బండి పరామర్శ అయితే వివాహం జరిగినప్పటి నుంచి వినయ్‌కు అరుణ్ అంటే ఇష్టం ఉండేది కాదు. చిన్నచిన్న విషయాలకు బాలుడిని కొట్టేవాడు. మంగళవారం కూడా అరుణ డ్యూటీకి వెళ్లిన సమయంలో ఇంట్లోనే ఉన్న అరుణ్‌ని వినయ్ తీవ్రంగా కొట్టాడు. స్పృహ తప్పి పడిపోయిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు అరుణ్ మృతిచెందినట్లు తెలిపారు. దీంతో బాలుడిని ఇంట్లో పడుకోబెట్టి వినయ్ పారిపోయాడు. డ్యూటీనుంచి తిరిగొచ్చిన తల్లికి కుమారుడు మృతిచెంది కనిపించాడు. అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పని మనిషే హత్య చేసింది..
సాక్షి, జిన్నారం(పటాన్చెరు) : కళ్లల్లో కారంచల్లి ఓ వృద్ధురాలి గొంతు నులిమి హత్య చేసిన కేసును బొల్లారం పోలీసులు ఛేదించారు. పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో హత్యకు గల కారణాలను వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. బొల్లారం గ్రామంలో ఒంటరిగా నివాసం ఉంటున్న ఉస్కేబావి అంతమ్మ ఇంట్లో స్వరూప అనే మహిళ పని చేస్తుంది. అంతమ్మ ఇంట్లో ఎప్పుడూ డబ్బు, బంగారు నగలను గమనిస్తున్న స్వరూప వాటిని అపహరించాలని పన్నాగం పన్నింది. ఆదివారం రాత్రి అంతమ్మతో పాటు ఇంట్లోనే స్వరూప నిద్రించింది. అంతమ్మ నిద్రలోకి చేరుకున్న తర్వాత స్వరూప నిద్ర లేచి అంతమ్మ కళ్లల్లో కారం చల్లి గొంతు నులిమి హత్య చేసింది. ఇంట్లో ఉన్న 18 తులాల బంగారంతో పాటు రూ. 6లక్షల నగదును ఎత్తుకెళ్లింది. అంతమ్మ హత్యకు గురి కావటంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటి పరిసర ప్రాంతంలో అర్ధరాత్రి ఓ మహిళ సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. అంతమ్మ ఇంట్లో పనిచేస్తున్న స్వరూపను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. తానే హత్య చేసి నగదు, డబ్బును ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకుంది. నగదుతో పాటు బంగారంను స్వాధీనం చేసుకొని స్వరూపను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. 24 గంటల్లో హత్య కేసును ఛేదించేలా దర్యాప్తు జరిపిన సీఐ ప్రశాంత్‌తో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు వివరించారు. -
భర్త అడ్డుతొలగిస్తే సంతోషంగా ఉండొచ్చని..
సాక్షి, పటాన్చెరు టౌన్ : వివాహేతర సంబంధంతో వరసకు బావతో కలసి భర్తను భార్య హత్య చేయించిన ఘటన మంగళవారం అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. క్రైం సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. చత్తీస్ఘడ్ రాష్ట్రం... దురుగు జిల్లా..మరోదా గ్రామానికి చెందిన అనిల్ కుమార్ దారు (35) బతుకుదెరువు కోసం మూడు నెలల క్రితం స్నేహితుడు హరినారాయణ (అలియాస్) సంజీవుతో కలసి అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌కు వచ్చాడు. సమీపంలోని మెడికల్ డివైజ్ పార్క్ సమీపంలో సెంటరింగ్ పని చేసుకుంటూ, అక్కడే నివాసం ఉంటున్నాడు. పది రోజుల క్రితం వరసకు సడ్డకుడు నర్వోత్తంతో కలిసి మృతుడి భార్య భువనేశ్వరి అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ వచ్చింది. భువనేశ్వరి, నర్వోత్తంల మధ్య వివాహేతర సంబంధం ఉంది. భర్త అనిల్ కుమార్‌ను హతమారిస్తే ఇద్దరం సంతోషంగా ఉండవచ్చని మృతుడి భార్య బావ నర్వోత్తంతో చెప్పింది. దీంతో అతను అనిల్ కుమార్‌ను ఆదివారం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ సమీపంలో ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లి రాయితో తలపై బాది హత్య చేశాడు. ఒక్కసారిగా అనిల్‌కుమార్ కనిపించకుండా పోవడంతో తోటి కార్మికులు, స్నేహితుడు సంజీవు .. నర్వోత్తంని అడిగారు. ఎవరో వచ్చి బైక్‌పై తీసుకెళ్లారని అబద్ధం చెప్పాడు. అనంతరం కాసేపు వెతికినా అనిల్‌కుమార్ దొరక్కపోవడంతో మరోసారి నర్వోత్తంను గట్టిగా నిలదీశారు. అనిల్‌కుమార్ భార్యకు తనకు వివాహేతర సంబంధం ఉందని ఆమె చెబితేనే హత్య చేశానని చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ భీంరెడ్డి, పటాన్చెరు క్రైం సీఐ శ్రీనివాసులు, అమీన్పూర్ ఎస్ఐలు మురళి, కిష్టారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతుడి భార్య భువనేశ్వరిని, నర్వోత్తంను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి స్నేహితుడు సంజీవు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి సంతానం కలగలేదని మేనల్లుడి దారుణ హత్య? -
డబ్బు వివాదం: కుటుంబంతో కలిసి భర్త హత్య
సాక్షి, జిన్నారం(పటాన్చెరు): డబ్బుల విషయంలో వివాదంతో అయినవారే అంతమొందించిన సంఘటన బొల్లారం మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి ముళ్లపొదల్లో పడేసి కాల్చేసిన కేసును పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించడం విశేషం. వివరాలను డీఎస్పీ భీంరెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని బాలాజీనగర్‌లో నివసిస్తున్న విజయ్‌సింగ్ (42), మల్లీశ్వరి దంపతులు. 16 ఏళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. వీరికి 14ఏళ్ల కుమార్తె ఉంది. విజయ్‌సింగ్ తన కుమార్తె పేరుపై రూ.లక్షను బ్యాంక్‌లో ఫిక్స్డ్ చేశాడు. నామినీగా మల్లీశ్వరిని ఉంచాడు. నెల రోజుల క్రితం భర్తకు తెలియకుండా మల్లీశ్వరి బ్యాంక్‌లో ఉన్న రూ.లక్షను తెచ్చి తన తమ్ముడైన మంద కృష్ణకు అప్పుగా ఇచ్చింది. కొద్దిరోజుల తర్వాత విషయం విజయ్‌సింగ్‌కు తెలిసింది. తనకు తెలియకుండా డబ్బులు ఎందుకు ఇచ్చావని నిలదీయడంతో భార్యాభర్తల మధ్య వివాదం మొదలైంది. అప్పుగా తీసుకున్న డబ్బును త్వరగా తిరిగిచ్చేయాలని మంద కృష్ణపై విజయ్‌సింగ్ ఒత్తిడి పెంచాడు. డబ్బు తిరిగిచ్చే పరిస్థితి లేకపోవటంతో మందకృష్ణ అక్క మల్లీశ్వరితో కలిసి విజయ్‌సింగ్‌ను హత్య చేయాలని పన్నాగం పన్నాడు. తనను కూడా ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నాడని మల్లీశ్వరి, చెల్లెలు తలారి పద్మ, తల్లి మంద లక్ష్మితో కలిసి పథకం వేశారు. ఆదివారం రాత్రి విజయ్‌సింగ్‌కు ఎక్కువగా మద్యం తాగించారు. మత్తులోకి వెళ్లిన తర్వాత నలుగురూ కలిసి గొంతు నులిమి హత్య చేశారు. రాత్రి 12 గంటల తర్వాత హృతదేహాన్ని సైకిల్‌పై తీసుకెళ్లి ఓఆర్ఆర్ సర్వీస్‌రోడ్డు సమీపంలోని ఓ ముళ్ల పొదలో పడేసి తగులబెట్టారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి విచారణ సాగించగా వారు నేరం అంగీకరించారు. ఈ మేరకు నలుగురినీ రిమాండ్‌కు తరలించారు. హత్య ఉదంతం వెలుగు చేసిన కొద్ది గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ భీంరెడ్డి అభినందించారు. విలేరుల సమావేశంలో సీఐ ప్రశాంత్, ఎస్ఐలు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్
సాక్షి, పటాన్చెరు: అనారోగ్యంతో ఉన్న ఆవుకు ఆపరేషన్ చేసిన పశువైద్యులు దాని పొట్టలో నుంచి 80 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. వివరాల్లోకి వెళితే.. అనారోగ్యంతో ఉన్న 2 ఆవులను జీహెచ్ఎంసీ సిబ్బంది 20 రోజుల క్రితం అమీన్పూర్ గోశాలకు తరలించారు. వాటిలో ఒక ఆవు మూడ్రోజుల క్రితం మృతి చెందగా.. మరో ఆవు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో అమీన్పూర్ పశువైద్యాధికారి విశ్వచైతన్య ఆ ఆవుకు శస్త్ర చికిత్స చేసి దాని పొట్టలో పేరుకుపోయిన 80 కిలోల ప్లాస్టిక్, కాటన్ బట్టలు బయటకు తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు. -
ఉప్పొంగిన పేగుబంధం
సాక్షి, పటాన్చెరు టౌన్: ఏడాది కిందట తప్పిపోయిన ఓ బాలుడు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సాయిలు కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కిషన్‌దాస్, పూజ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ మాదాపూర్‌కు వచ్చి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో 2019లో వినాయక చవితి రోజున బాలుడు రాజ్‌కుమార్ దాస్ తప్పిపోయాడు. ఏడుస్తూ కూర్చొన్న ఆ బాలుడిని గమనించిన పాతబట్టలు అమ్ముతున్న హరణ్.. తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు. పటాన్చెరు పట్టణంలోని సాయిరాంనగర్ కాలనీలో ఉండే హరణ్ మామ యాకోబ్‌కు పిల్లలు లేని కారణంగా వారికి అప్పజెప్పాడు. ఆ బాలుడికి కిరణ్ అని పేరు పెట్టి పోషిస్తున్నారు. అయితే.. స్థానికుల ఫిర్యాదు మేరకు.. జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు జూన్ 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హరణ్, యాకోబ్, సరోజపై పోలీసులు కేసు నమోదు చేసి బాలుడిని సంగారెడ్డి శిశువిహార్‌కు పంపించారు. దర్యాఫ్తులో భాగంగా బాలుడి తల్లిదండ్రులది పశ్చిమ బెంగాల్ అని గుర్తించిన పోలీసులు.. తండ్రి కిషన్‌దాస్, తల్లి పూజకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి సదరు బాలుడు వారి కొడుకే అని నిర్ధారించారు. సోమవారం సంగారెడ్డిలోని బాలరక్ష భవన్ వద్ద తల్లికి అప్పగించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు, బాలల సంక్షేమ సమితి అధ్యక్షురాలు శివకుమారికి, జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు
సాక్షి, జిన్నారం(పటాన్చెరు): ఎట్టకేలకు కొన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 192 మంది ఉపాధ్యాయుల నియామకం పూర్తయింది. నియామక పత్రాలను జిల్లా ఉన్నతాధికారులు ఉపాధ్యాయులకు అందించారు. దీంతో నూతనంగా ఎన్నికైన ఉపాధ్యాయులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడంతోపాటు వారికి అన్ని రకాల విద్యాబుద్ధులు చెబుతామని నూతన ఉపాధ్యాయులు అంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 1,285 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా వీరిలో 876మంది ఎస్జీటీలు ఉన్నారు. ఎస్టీజీ పోస్టులకు సంబంధించిన ప్రక్రియ కోర్టులో ఉన్నందున వారి నియామకాలను ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టడం లేదు. దీంతో ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, లాంగ్వేజ్ పండిట్ల పోస్టులను మాత్రమే భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్, వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి 263 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 263 పోస్టుల్లో 55 పోస్టులు వివిధ కారణాలతో నిలిపేశారు. ప్రస్తుతం 208 పోస్టులను జిల్లా వ్యాప్తంగా అధికారులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ నెల 12న సంగారెడ్డిలోని జెడ్పీ హాలులో డీఈఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలించారు. 192 మంది ఉపాధ్యాయులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఆదివారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 192మంది ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలను అందించారు. జేసీ నిఖిల, డీఈఓ విజయలక్ష్మిల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, మనూర్, మునిపల్లి, ఝరాసంఘం, రేగోడ్, టేక్మాల్, కంగ్టి, న్యాల్కల్, హత్నూర, చిలప్‌చెడ్, కోహిర్, రాయికోడ్, సదాశివపేట, కౌడిపల్లి, అల్లాదుర్గం, వెల్దుర్తి, వట్పల్లి తదితర మండలాల్లో ఎక్కువ పోస్టుల ఖాళీలను అధికారులు చూపించారు. ఈ ప్రాంతాల్లో గత పదేళ్ల నుంచి సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో వీటిని భర్తీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఏదిఏమైనా నూతన ఉపాధ్యాయులు నేటి నుంచి ప్రభుత్వ బడుల్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్ల నుంచి వారు కన్న కలలు సాకారం అవుతుండడంతో నూతన ఉపాధ్యాయుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చాలా సంతోషంగా ఉంది నేను టీఆర్టీలో ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. నాన్న, మామలు ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడంతో నేను కూడా ఉపాధ్యాయురాలిని కావాలనే లక్ష్యంతో చదివాను. నేటి నుంచి నా కల నెరవేరబోతోంది. ఇది చాలా సంతోషం కలిగిస్తోంది. చదువు విషయంలో నా కుటుంబ సభ్యులు చాలా సహకరించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు నా వంతు కృషి చేస్తా. – స్వప్న, జిన్నారం, లాంగ్వేజి పండిట్, తెలుగు లక్ష్యం నెరవేరింది ఉపాధ్యాయురాలిని కావాలనే నా లక్ష్యం నెరవేరింది. టీఆర్టీలో సెలక్ట్ కావ డంతో చాలా సంతోషంగా ఉంది. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి వారిని ప్రయోజకులుగా చేసేలా ముందుకెళ్తా. కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరి సహకారంతోనే నా కల నెరవేరింది. – శశికళ, సంగారెడ్డి -
కాబోయే భర్త ఇంట్లో ఉంటూ.. యువతి అదృశ్యం
మెదక్: కాబోయే భర్త ఇంట్లో నివసిస్తున్న యువతి గత ఆరు రోజులుగా కనిపించకుండాపోయింది. జిల్లాలోని కల్హేర్ మండలం కడ్పల్ గ్రామానికి చెందిన నర్సింహులు కుమార్తె సునిత పటాన్‌చెరువులో ఉంటూ.. మదీనగూడలో ఓ నర్సింగ్ కళాశాలలో చదువుకుంటోంది. జేపీకాలనీకి చెందిన ఓ యువకునితో ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. దాంతో ఆమె జేపీకాలనీలో కాబోయే భర్త కుటుంబికులతో కలిసి ఉంటోంది. కానీ ఆరు రోజులుగా ఆమె కనిపించకపోవడంతో ఆమె తండ్రి వచ్చి పటాన్చెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పటాన్‌చెరువులో షర్మిళ జనభేరీ
-
టెట్ ప్రశాంతం
సంగారెడ్డి మున్సిపాలిటీ న్యూస్‌లైన్: టెట్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. సంగారెడ్డి, పటాన్చెరు, ఆర్సీపురం పరీక్ష కేంద్రాలలో 14,042 మంది అభ్యర్థులకు 12,633 మంది హాజరయ్యారు. 1,409 మంది హాజరు కాలేదు. ఉదయం జరిగిన పేపర్-1 కు 3,277కు 3,015 మంది, పేపర్-2కు 10,764 మందికి 9,618 మంది హాజరయ్యారు. పరీక్షలను జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌తో పాటు చీఫ్ పరీక్ష సూపరింటెండెంట్లు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. కాగా పరీక్షల కోసం దూర ప్రాంత విద్యార్థులు శనివారం రాత్రే పరీక్ష కేంద్రాలుగల పట్టణాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
పటాన్చెరు టౌన్, న్యూస్‌లైన్ : విద్యుదాఘాతంతో మండల పరిధిలోని అల్ కబీర్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న ఓ కార్మికుడు దుర్మరణం చెందాడు. అయితే యాజమాన్యం నిర్లక్ష్యంతోనే కార్మికుడు మృతిచెందాడంటూ పరిశ్రమకు చెందిన ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పరిశ్రమ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఐ శంకర్‌రెడ్డి కథనం మేరకు.. సంగారెడ్డి మండలం ఎద్దుమైలారం (ఓడీఎఫ్) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాలనీలో నివాసం ఉండే యూనస్ (25) 15 రోజుల క్రితమే పరిశ్రమలో వెల్డర్‌గా ఉద్యోగంలో చేరాడు. అయితే మంగళవారం ఉదయం జనరల్ షిఫ్ట్‌కు వచ్చి విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా అబిటాస్ సెక్షన్లో వెల్డింగ్ పనులు చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే యాజమాన్యం మాత్రం యూన స్ మృతి చెందలేదని కొన ఊపిరితో ఉన్నాడని రామచంద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో మృతుడిని తిరిగి పరిశ్రమ వద్దకు తె చ్చారు. విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు పరిశ్రమ వద్దకు చేరుకుని యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే యూనస్ మృతి చెందాడని ఆందోళనకు దిగారు. అంతటితో ఆగక పరిశ్రమకు చెందిన కార్యాలయం కిటికీ అద్దాలు పగుల గొట్టారు. ఫర్నీచర్ , కంప్యూటర్లు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న సీఐ శంకర్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు హుఠాహుటిన పరిశ్రమ వద్దకు చేరుకుని పరిస్థితిని అ దుపు చేశారు. ఇదిలా ఉండగా మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పరిశ్రమ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. అయితే రూ. 7 లక్షల నష్టపరిహారం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీంతో ఆందోళనకారులు వెనుతిరిగారు.