మెదక్: కాబోయే భర్త ఇంట్లో నివసిస్తున్న యువతి గత ఆరు రోజులుగా కనిపించకుండాపోయింది. జిల్లాలోని కల్హేర్ మండలం కడ్పల్ గ్రామానికి చెందిన నర్సింహులు కుమార్తె సునిత పటాన్‌చెరువులో ఉంటూ.. మదీనగూడలో ఓ నర్సింగ్ కళాశాలలో చదువుకుంటోంది. జేపీకాలనీకి చెందిన ఓ యువకునితో ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. దాంతో ఆమె జేపీకాలనీలో కాబోయే భర్త కుటుంబికులతో కలిసి ఉంటోంది. కానీ ఆరు రోజులుగా ఆమె కనిపించకపోవడంతో ఆమె తండ్రి వచ్చి పటాన్‌చెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు.