సంగారెడ్డి మున్సిపాలిటీ న్యూస్‌లైన్:
టెట్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. సంగారెడ్డి, పటాన్‌చెరు, ఆర్సీపురం పరీక్ష కేంద్రాలలో 14,042 మంది అభ్యర్థులకు 12,633 మంది హాజరయ్యారు. 1,409 మంది హాజరు కాలేదు. ఉదయం జరిగిన పేపర్-1 కు 3,277కు 3,015 మంది, పేపర్-2కు 10,764 మందికి 9,618 మంది హాజరయ్యారు.
పరీక్షలను జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌తో పాటు చీఫ్ పరీక్ష సూపరింటెండెంట్‌లు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. కాగా పరీక్షల కోసం దూర ప్రాంత విద్యార్థులు శనివారం రాత్రే పరీక్ష కేంద్రాలుగల పట్టణాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
టెట్ ప్రశాంతం
Published Mon, Mar 17 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM
Advertisement
Advertisement