Woman Missing With 2 Years Old Daughter Goea At Patancheruvu - Sakshi
Sakshi News home page

Missing Case: పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి కూతురుతో కలిసి

Published Thu, Apr 14 2022 1:06 PM | Last Updated on Thu, Apr 14 2022 3:11 PM

Woman With 2 Years Old Daughter Goea Missing At Patancheruvu - Sakshi

ఊర్మిళ, జాహ్నవి

సాక్షి, పటాన్‌చెరు టౌన్‌: పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి కూతురుతో వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సాయిలు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్‌చెరు పట్టణంలోని మంజీర పంప్‌ హౌస్‌లో చంద్రకుమార్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 11 తేదీ ఉదయం చంద్రకుమార్‌ భార్య ఊర్మిళ, రెండున్నర సంవత్సరాల కూతురు జాహ్నవితో కలసి హైదరాబాద్‌ అఫ్జల్‌గంజ్‌లో ఉంటున్న పుట్టింటికి వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది.

అదే రోజు మధ్యాహ్నం చంద్రకుమార్‌ భార్యకు ఫోన్‌చేయగా ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ మెస్సేజ్‌ రావడంతో అత్తగారింటికి ఫోన్‌చేయగా ఇంకా రాలేదని చెప్పారు. భార్య, కూతురు కోసం తెలిసిన వారిని, బంధువులను విచారించినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో చంద్రకుమార్‌ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement