సాక్షి, హైదరాబాద్: పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలపై ఈడీ కీలక ప్రకటన చేసింది. మైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని.. అక్రమ మార్గంలో డబ్బు మొత్తం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ తెలిపింది. రూ.300 కోట్లలో మైనింగ్ అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది.
‘‘ప్రభుత్వానికి రూ.39 కోట్లు నష్టం చేకూర్చారు. బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీలను గుర్తించాం. కొన్ని బ్యాంక్ లాకర్స్‌ను ఇంకా తెరవాల్సిఉంది. బినామీ పేర్లతో లావాదేవీలను గుర్తించాం. మనీలాండరింగ్, హవాలా నేపథ్యంలో సోదాలు నిర్వహించాం. సంతోష్ స్యాండ్, సంతోష్‌గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలు జరిగాయి. సోదాలు సందర్భంగా రూ.19 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నాం. మధుసూదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డికి పలువురు బినామీలుగా ఉన్నారు’’ అని ఈడీ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment