
పటాన్ చెరు నియోజకవర్గం
పటాన్ చెరు నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా రెండోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి కాట శ్రీనివాస గౌడ్‌పై 37799 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. మహీపాల్ రెడ్డికి 116326 ఓట్లు రాగా, శ్రీనివాస గౌడ్‌కు 78572 ఓట్లు వచ్చాయి. రెడ్డి వర్గానికి చెందిన నేత భూపాల్ రెడ్డి. 2009లో నుంచి ఈ నియోజకవర్గం ఏర్పడిరది.
మొదట బిసి వర్గానికి చెందిన నేత గెలిచినా ఆ తర్వాత రెండుసార్లు రెడ్డి నేతే గెలిచారు. కాగా ఇక్కడ బిజెపి తరపున పోటీచేసిన కరుణాకరరెడ్డికి 7400 పైగా ఓట్లు వచ్చాయి. 2014లో పటాన్ చెరు అప్పటి సిటింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఇక్కడ తిరిగి కాంగ్రెస్ తరపున పోటీచేసి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. నిజానికి ఈయన టిఆర్‌ఎస్‌లో చేరడానికి సన్నద్దమై, కెసిఆర్‌ను కూడా కలిసి, చివరి క్షణంలో ఆగిపోయారు. రాహుల్ గాంధీ పోన్ చేసి టిక్కెట్ హామీ ఇవ్వడంతో కాంగ్రెస్‌లోనే కొనసాగారు. కాని ఎన్నికలో మాత్రం 37226 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉండిపోయారు. తదుపరి రాజకీయంగా వెనుకబడి పోయారు.
పటాన్ చెరు నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..