
దుబ్బాక నియోజకవర్గం
దుబ్బాక నియోజకవర్గంలో నాల్గవసారి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాదించినప్పటికి ఆయన అనారోగ్యంతో 2020లో కన్నుముశారు. ఆ కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో బిజేపి అభ్యర్ధి రఘునందన్‌రావు టీఆర్‌ఎస్ అభ్యర్ధి, దివంగతుడు అయిన రామలింగారెడ్డి సతీమణి సుజాతను 1079 ఓట్ల తేడాతో ఓడిరచి సంచలనం సృష్టించాడు. ఎమ్. రఘునందన్‌రావుకు 63352 ఓట్లు రాగా, సుజాతకు 62273 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ ఐ అభ్యర్థి, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డికి 22196 మాత్రమే ఓట్లు వచ్చి డిపాజిట్ కొల్పోయాడు. 2018లో రామలింగారెడ్డి 66421 ఓట్ల మెజార్టీ తెచ్చుకోగా ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 1079 ఓట్ల తేడాతో బిజేపి చేతిలో ఓటమి చెందడం విశేషం. ఎం.రఘునందన్‌రావు రెండుసార్లు అసెబ్లీకి పోటిచేసి ఓటమిచెంది మూడోవ సారి ఉప ఎన్నికల్లో నెగ్గారు. మాజీ జర్నలిస్టు అయిన దివంగత రామలింగారెడ్డి 2004, 2008 ఉప ఎన్నిక, 2014, 2018 ఎన్నికలలో గెలిచారు. మొదట దొమ్మాటగా ఉన్న ఈ నియోజకవర్గం, 2009 నుంచి దుబ్బాక కేంద్రంగా నియోజకవర్గం అయింది.
2018లో సోలిపేట రామలింగారెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది నాగేశ్వరరెడ్డిపై 66421 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఈయన తెలంగాణ ఉద్యమంలో మొదట నుంచి క్రియాశీలక పాత్ర పోషించిన వారిలో ఒకరుగా ఉన్నారు. సోలిపేటకు 89112 ఓట్లు రాగా, నాగేశ్వరరెడ్డికి 26691 ఓట్లు వచ్చాయి. 2018లో ఇక్కడ నుంచి పోటీచేసిన బిజెపి నేత ఎమ్. రఘునందన్ రావుకు 22 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. రెండువేల నాలుగులో మొదటిసారి టిఆర్‌ఎస్ పక్షాన గెలిచిన రామలింగారెడ్డి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం లో భాగంగా తన పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో పోటీచేసి గెలిచారు.
తదుపరి 2009సాధారణ ఎన్నికలో మాజీ మంత్రి ముత్యంరెడ్డి చేతిలో ఓడిపోయారు. ముత్యం రెడ్డి అంతకుముందు టిడిపిలో ఉండేవారు. ఆయన కాంగ్రెస్ ఐలోకి వచ్చి గెలుపొందడం విశేషం. కాని 2014లో మాత్రం నెగ్గ లేకపోయారు. ఆ తర్వాత కాలంలో ముత్యంరెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ముత్యంరెడ్డి నాలుగుసార్లు గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా కూడా ఉన్నారు. 1972లో దొమ్మాటలో గెలిచిన సోలిపేట రామచంద్రారెడ్డి ఒకసారి రాజ్యసభ సభ్యునిగా కూడా ఉన్నారు.
దుబ్బాక నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..