Dubbak Assembly Constituency
-
దుబ్బాక: ఓటర్ల తీర్పెటు? బీఆర్ఎస్లో హైటెన్షన్
దుబ్బాక నియోజకవర్గంలో నాల్గవసారి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాదించినప్పటికి ఆయన అనారోగ్యంతో 2020లో కన్నుముశారు. ఆ కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావు టీఆర్ఎస్ అభ్యర్ధి, దివంగతుడు అయిన రామలింగారెడ్డి సతీమణి సుజాతను కేవలం 1,079 ఓట్ల తేడాతో ఓడించి సంచలన విజయం అందుకున్నారు. ఎమ్. రఘునందన్‌రావుకు 63352 ఓట్లు రాగా, సుజాతకు 62273 ఓట్లు వచ్చాయి. దుబ్బాక నియోజకవర్గం నుండి పోటీలో ఉండొచ్చు అని భావిస్తున్న అభ్యర్థులు: బీజేపీ పార్టీ: మాధవనేని రఘునందన్ రావు (ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే) బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రభాకర్ రెడ్డి (ప్రస్తుత మెదక్ ఎంపీ) కాంగ్రెస్ పార్టీ: చెరుకు శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ముత్యం రెడ్డి కుమారుడు కత్తి కార్తీక డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి ఎన్నికలలో ప్రభావితం చేసే అంశాలు: దుబ్బాక నియోజకవర్గం లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. కావున వచ్చే ఎన్నికల్లో మహిళ ఓట్లే కీలకం కానున్నాయి.. నిత్యవసర వస్తువుల ధరలు, సిలిండర్ ధరలు, బస్సు చార్జీలు, కరెంటు బిల్లులు విపరీతంగా పెరగడంతో ఇల్లు గడపడం కుటుంబ ఖర్చులు కొనసాగించడం కష్టంగా ఉందని మహిళలు భావిస్తున్నారు. మహిళలకు డ్వాక్రా రుణాలు, అర్హులందరికీ రెండు పడకల గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వదలచిన మూడు లక్షలు ఇల్లు నిర్మాణానికి సరిపోవని మహిళలు భావిస్తున్నారు. నూతన మండలాలైన భూంపల్లి,రాయపొల్ మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆయా వర్గాలకు కులస్తులకు ఇస్తున్న ఆర్థిక సహాయం పథకాలు అన్ని వర్గాలకు వర్తింపజేయాలని అన్ని కులస్తులకు వర్తింపజేయాలని కోరుతున్నారు. విద్యాలయాలు, ఆసుపత్రులు నూతన భవనాలు నిర్మించి వాటిలో సిబ్బందిని పెంచాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు సామాన్యులకు విద్యా వైద్యం అందాలని కోరుతున్నారు. ధరణి లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని లేదా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాల కల్పన చేయాలని ఈ ప్రాంత నిరుద్యోగులు కోరుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం లోని ఆయా మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు నెలకొల్పాలని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు -
దుబ్బాక నియోజకవర్గం పాలకవర్గం ఎవరిది..?
దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గంలో నాల్గవసారి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాదించినప్పటికి ఆయన అనారోగ్యంతో 2020లో కన్నుముశారు. ఆ కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో బిజేపి అభ్యర్ధి రఘునందన్‌రావు టీఆర్ఎస్ అభ్యర్ధి, దివంగతుడు అయిన రామలింగారెడ్డి సతీమణి సుజాతను 1079 ఓట్ల తేడాతో ఓడిరచి సంచలనం సృష్టించాడు. ఎమ్. రఘునందన్‌రావుకు 63352 ఓట్లు రాగా, సుజాతకు 62273 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఐ అభ్యర్థి, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డికి 22196 మాత్రమే ఓట్లు వచ్చి డిపాజిట్ కొల్పోయాడు. 2018లో రామలింగారెడ్డి 66421 ఓట్ల మెజార్టీ తెచ్చుకోగా ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ 1079 ఓట్ల తేడాతో బిజేపి చేతిలో ఓటమి చెందడం విశేషం. ఎం.రఘునందన్‌రావు రెండుసార్లు అసెబ్లీకి పోటిచేసి ఓటమిచెంది మూడోవ సారి ఉప ఎన్నికల్లో నెగ్గారు. మాజీ జర్నలిస్టు అయిన దివంగత రామలింగారెడ్డి 2004, 2008 ఉప ఎన్నిక, 2014, 2018 ఎన్నికలలో గెలిచారు. మొదట దొమ్మాటగా ఉన్న ఈ నియోజకవర్గం, 2009 నుంచి దుబ్బాక కేంద్రంగా నియోజకవర్గం అయింది. 2018లో సోలిపేట రామలింగారెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది నాగేశ్వరరెడ్డిపై 66421 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఈయన తెలంగాణ ఉద్యమంలో మొదట నుంచి క్రియాశీలక పాత్ర పోషించిన వారిలో ఒకరుగా ఉన్నారు. సోలిపేటకు 89112 ఓట్లు రాగా, నాగేశ్వరరెడ్డికి 26691 ఓట్లు వచ్చాయి. 2018లో ఇక్కడ నుంచి పోటీచేసిన బిజెపి నేత ఎమ్. రఘునందన్ రావుకు 22 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. రెండువేల నాలుగులో మొదటిసారి టిఆర్ఎస్ పక్షాన గెలిచిన రామలింగారెడ్డి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం లో భాగంగా తన పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో పోటీచేసి గెలిచారు. తదుపరి 2009సాధారణ ఎన్నికలో మాజీ మంత్రి ముత్యంరెడ్డి చేతిలో ఓడిపోయారు. ముత్యం రెడ్డి అంతకుముందు టిడిపిలో ఉండేవారు. ఆయన కాంగ్రెస్ ఐలోకి వచ్చి గెలుపొందడం విశేషం. కాని 2014లో మాత్రం నెగ్గ లేకపోయారు. ఆ తర్వాత కాలంలో ముత్యంరెడ్డి టిఆర్ఎస్లో చేరిపోయారు. ముత్యంరెడ్డి నాలుగుసార్లు గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. 1972లో దొమ్మాటలో గెలిచిన సోలిపేట రామచంద్రారెడ్డి ఒకసారి రాజ్యసభ సభ్యునిగా కూడా ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..