నల్గొండ జిల్లా జైపూర్ మండలం పెరాటిగూడ గ్రామ శివారులో సోమవారం ఉదయం మహిపాల్‌రెడ్డి(40) అనే రైతులు గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. శివారులో మహిపాల్‌రెడ్డి శవం పడిఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వేట కొడవళ్లతో నరికి చంపినట్లు మృతుని మెడపై ఆనవాళ్లు ఉన్నాయి. పాతకక్షల వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.