నల్లగొండ: అప్పులు తీర్చాలేక ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళా రైతు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం తోపుచర్ల గ్రామానికి చెందిన రాచూరి నాగమ్మ మూడెకరాల్లో పత్తి పంట సాగు చేసింది.
వర్షాభావం లేకపోవడంతో పంట దిగుబడి నిరాశ కలిగిచింది. దీనికి తోడు పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో చేసిన అప్పులు తీర్చే దారిలేక తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో ఆమె ఈ నెల 12న క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమెను మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆమె బుధవారం మధ్యాహ్నం మృతి చెందింది.