దుకాణం నుంచి రూ.4.38 లక్షల మద్యం చోరీ | Rs 4.38 lakhs of liquor theft from liquor shop | Sakshi
Sakshi News home page

దుకాణం నుంచి రూ.4.38 లక్షల మద్యం చోరీ

Published Wed, Mar 18 2015 4:13 PM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM

Rs 4.38 lakhs of liquor theft from liquor shop

తూప్రాన్(మెదక్): మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో రహదారికి పక్కనే ఉన్న వైన్స్‌లో మంగళవారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. రూ. 4.38 లక్షల మద్యం, రూ.7వేల నగదును దుండగులు అపహరించుకెళ్లారు. దుకాణం యజమాని మహిపాల్‌రెడ్డి తెలిపిన వివరాలివీ.. నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న నవదుర్గా వైన్స్ వెనుక నుంచి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు రూ.4.38 లక్షల విలువైన మద్యం బాటిళ్లను అపహరించుకెళ్లారు.

దీంతోపాటు క్యాష్‌బాక్స్‌లో ఉన్న రూ.7వేలు కూడా ఎత్తుకుపోయారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేయటంతోపాటు డీవీఆర్‌ను తీసుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement