బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే లోపు ఇంటి తాళాలు పగులకొట్టి 13 తులాలు బంగారం, 30 తులాలు వెండి దోచుకెళ్లిన సంఘటన మంగళవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగిచర్ల ఎంఎల్‌ఆర్ కాలనీలో ఉండే యాస శ్రీకాంత్‌రెడ్డి కుటుంబం కలసి గత శనివారం నల్లగొండ జిల్లా తుర్కపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు.
ఆయన తమ్ముడు మహిపాల్‌రెడ్డి సోమవారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చారు. తలుపు తీసుకుని ఇంట్లోకి వెళ్లగా బట్టలు, వస్తువులు అన్ని చిందర వందరగా ఉన్నాయి. వెనక వైపు వెళ్లి చూడగా తలుపు గడి గడ్డపారతో విరగకొట్టి ఉంది. బీరువాలోని 13 తులాల బంగారు నగలు, 30 తులాలు వెండి కనిపించలేదు. ఈ విషయాన్ని ఆయన అన్న శ్రీకాంత్‌రెడ్డికి చెప్పాడు. మంగళవారం మధ్యాహ్నం శ్రీకాంత్‌రెడ్డి మేడిపల్లి పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. క్లూస్‌టీంతో సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.