
విచారణ చేస్తున్న డీఎస్పీ స్వరూపారాణి, సీఐ శ్రీనివాసరావు
భామిని: ఎస్టీ వివాహితను మోసగించాడన్న ఫిర్యాదుపై పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి దర్యాప్తు చేశారు. భామిని మండలం చిన్నదిమిలి కాలనీలో డీఎస్పీ స్వరూపారాణి, కొత్తూరు సీఐ జె.శ్రీనివాసరావు శుక్రవారం విచారణ చేపట్టారు. వివాహిత ఎడ్ల పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నదిమిలి కాలనీకి చెందిన యువకుడు టి.మనోజ్‌కుమార్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని డీఎస్పీ ఆదేశించారు. బత్తిలి ఎస్సై ఎం.ముకుందరావు, వీఆర్‌ఓ కె.బాలరాజు, వార్డు సభ్యులు ఎ.యశోద, గ్రామస్తులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment