Bhamini
-
ఆ పాపాలు ఎవరివంటే..?
భామిని: వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వా రా పిల్లలు, బాలింతలకు పంపిణీ చేయాల్సిన ఐసీడీఎస్ పాలు ఆక్రమ రవాణా కేసులో ఇద్దరిని అరె స్టు చేశామని, మరో ముగ్గురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు. అరెస్టయిన వారిలో వ్యాన్ యజమాని, డ్రైవర్ ఉన్నట్టు పేర్కొన్నారు. భామిని మండలం బత్తిలి పోలీస్ స్టేషన్లో ఎస్సై కె.వి.సురేష్‌తో కలిసి పాలు ఆక్రమ రవాణా కేసు వివరాలను ఆది వారం వెల్లడించారు. బత్తిలి పోలీస్‌లు చెక్‌పోస్టు వ ద్ద శనివారం పట్టుకున్న 1919 లీటర్ల పాల అక్రమ రవాణాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు పాల ప్యాకెట్లను సరఫరా చేసే సబ్‌డీలర్లే కార్యకర్తల వద్ద కొనుగోలు చేసి అ క్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని భద్రగిరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధి నుంచి పాల ప్యా కెట్లు తరలివచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. వీటిని మిఠాయి, టీ షాపులకు విక్రయిస్తున్నారన్నా రు. ప్యాకెట్లపై ఉన్న నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేయగా.. వీరఘట్టం ప్రాజెక్టుకు చెందిన ప్యాకెట్లు కూడా ఉన్నట్టు వివరించారు. వీటి అమ్మకాలపై డి విజన్‌లోని కొన్ని మండలాల్లో తనిఖీలు నిర్వహించి పలు దుకాణాల్లో ఇవే రకం పాలు ప్యాకెట్లు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. సీజ్ చేసిన ప్యాకెట్లను ఐసీడీఎస్ పీడీకి అప్పగించామన్నారు. -
టీడీపీ కార్యకర్తలపై అట్రాసిటీ కేసు
సాక్షి, భామిని(శ్రీకాకుళం) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన బియ్యం పంపిణీలో టీడీపీ నాయకులు ఆటంకాలు సృష్టించి, గ్రామ వలంటీర్‌తో వివాదానికి దిగిన ఘటన ఆదివారం భామిని మండలంలోని తాలాడ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషయంలో అట్రాసిటీ కేసు నమోదైంది. సోమవారం పాలకొండ డీఎస్పీ రామ్‌రాజు కొత్తూరు సీఐ ఎల్.సన్యాసినాయుడు, బత్తిలి ఎస్ఐ అజార్ అహ్మద్ ఆధ్వర్యంలో అట్రాసిటీ కేసుపై దర్యాప్తు చేపట్టారు. బియ్యం నాణ్యంగా లేవని వివాదం రేపిన టీడీపీ కార్యకర్తలు వలరౌతు అచ్చుతరావు, వలరౌతు శివలపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బియ్యం పంపిణీ విషయంలో గ్రామ వలంటీర్‌పై దుర్భాషలాడి వివాదానికి దిగారని, అడ్డుకున్న తనను కులం పేరుతో దూషించారని గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సుంకు అప్పలనర్సి ఫిర్యాదు అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాదం రేగిన సంఘటనపై డీఎస్పీ గ్రామ వలంటీర్ నుంచి వివరాలు సేకరించారు. వీఆర్ఓ హరిహరరావు, కార్యదర్శి ప్రమీలారాణి, మాజీ సర్పంచ్ బంటు శ్రీనివాస్ గ్రామస్తులున్నారు. అనంతరం బత్తిలి పోలీస్ స్టేషన్‌కు గ్రామానికి చెందిన ముగ్గురు వలంటీర్లను పిలిపించి పూర్తి వివరాలు నమోదు చేశారు.వలంటీర్‌పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి టెక్కలి: పాతనౌపడ గ్రామ వలంటీర్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టెక్కలి ఆర్డీఓ ఐ.కిషోర్‌కు స్పందన కార్యక్రమంలో సోమవారం ఆ గ్రామానికి చెందిన వ్యక్తలు ఫిర్యాదు చేశారు. వలంటీర్‌పై దాడి చేయడంతోపాటు సమాచార హక్కు చట్టం పేరుతో అధికారులపై బెదిరింపులకు పాల్పడిన మర్ధల సురేష్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన లోకేశ్వర్‌రావు, యోగి, ఉమాశంకర్ తదితరులు ఆర్డీవోను కోరారు. -
సం‘జీవన్’ కావాలి!
సరస్వతీ పుత్రుడికి కొండంత కష్టమొచ్చింది. హాయిగా చదువుకుంటున్న సమయంలో కిడ్నీ మహమ్మారి తరుముకొచ్చింది. రెండు కిడ్నీలను కబళించేసింది. అసలే పేదిరకం.. ఆపై వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయాల్సి రావడంతో విద్యార్థి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కుమారుడ్ని బతికించేందుకు లక్షలాది రూపాయలు అప్పులు చేశారు. ఇక తమ బిడ్డను దాతలే ఆదుకోవాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. సాక్షి, భామిని(శ్రీకాకుళం) : పోడు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న ఆ కుటుంబంపై విధి పగబట్టింది. కిడ్నీ వ్యాధి రూపంలో వారిలో సంతోషం దూరం చేసింది. భామిని మండలం కడంబసింగి కాలనీకి చెందిన ఆదివాసీ దంపతులు ఆరికి డిలో, ఆరికి ఇనత్రోలు పెద్ద కుమారుడు జీవన్. ఇటీవలే ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం బైపీసీలో 9.6 జీపీఏ సాధించి శభాష్ అనిపించుకున్నాడు. సీతంపేట మండలం మల్లి మల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల/కళాశాలలో రెండో ఏడాది తరగతులకు సిద్ధమవుతున్న తరుణంలో పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. ఆరోగ్యం సహకరించక, బలహీనతతో నడవలేని పరిస్థితిలో ఉన్న జీవన్‌ను జూన్‌లో రాగోలు జెమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. విద్యార్థి రెండు కిడ్నీలు పాడయ్యాయని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఎలాగైనా తమ కుమారుడ్ని బతికించుకోవాలనే తాపత్రయంతో లక్ష రూపాయలు వరకు అప్పులు చేసి వైద్యం చేయించారు. డయాలసిస్ ప్రక్రియలో భాగంగా పైప్(స్టంట్)ను రూ.20 వేలు ఖర్చుతో అమర్చారు. అయినా ఫలితం లేకపోయింది. జూలై 15న విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రూ.30 వేలు ఖర్చు చేసి వైద్య పరీక్షలు చేయించారు. అపోలో నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్టు డాక్టర్ ఎస్.అనిల్ కుమార్ పాత్రో కూడా విద్యార్థి రెండు కిడ్నీలు పాడైన విషయాన్ని ధ్రువీకరించారు. అప్పటి నుంచి ప్రతివారం డయాలసిస్‌కు చేయించేందుకు రూ.1500 వెచ్చిస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పుడు అప్పులు తేలేక ఐటీడీఏ ద్వారా పాలకొండ ఏరియా ఆస్పత్రిలో ప్రతి బుధ, శనివారాల్లో రెండు సార్లు డయాలసిస్ చేయిస్తున్నామని చెబుతున్నారు. భామినిలో ఇటీవల నిర్వహించిన కమ్యూనిటీ పోలీస్ క్యాంప్‌లో జిల్లా ఎస్పీ ఏ.ఎన్.అమ్మిరెడ్డిని విద్యార్థి ఆరికి జీవన్ తన తండ్రితో కలిశాడు. ఆదుకోవాలని మొరపెట్టుకొన్నారు. చదువుకోవాలని ఉంది.. తనకు ఉన్నత చదువులు చదవాలని ఆశగా ఉందని కిడ్నీ బాధితుడు ఆరికి జీవన్ చెబుతున్నాడు. తన వ్యాధి నయం కావాలంటే కిడ్నీమార్పిడి ఒక్కటే మార్గమని కన్నీటి పర్యంతమవుతున్నాడు. దాతలు సాయం చేయదలిస్తే తన తండ్రి ఆరికి డిలో (ఫోన్: 9493510191)ను సంప్రదించాలని జగన్ వేడుకుంటున్నాడు. ఆన్లైన్ ద్వారా సాయం అందించాలనుకునే వారు ఆంధ్రాబ్యాంక్, కొత్తూరు బ్రాంచ్, అకౌంట్ నంబర్–174710100109645 ద్వారా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. -
ఉలిక్కిపడిన మన్యం
సాక్షి, భామిని–సీతంపేట: ఏజెన్సీ ఉలిక్కిపడింది. ప్రశాంతంగా ఉన్న సరిహద్దులో మావోయిస్టు డంప్ లభించడం అలజడి రేపింది. ఈ నెల 28 నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఓబీలోని దోనుబాయి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు డంప్ లభ్యమైంది. కూంబింగ్‌కు వెళ్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకునే ఈ డంప్ ఇక్కడ పెట్టారని పోలీసు అధికారులు ప్రకటించడం గమనార్హం. సీతంపేటలో వాలీబాల్ టోర్నమెంట్‌కు హాజరయ్యేందుకు ఎస్పీ అమ్మిరెడ్డి వచ్చిన తరుణంలో కూంబింగ్‌కు వెళ్లిన సాయుధ బలగాలకు డంప్ దొరకడంతో మావోల ఉనికిపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. గతంలోనూ ఇదే ఏజెన్సీలోని తివ్వాకొండ పరిసరాల్లో మావోల డంప్‌లు దొరికాయి. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే మాటిమాటికీ డంప్‌లు దొరుకుతున్నా యి. తివ్వాకొండలను మావోయిస్టులు తమ సేఫ్టీ జోన్‌గా భావిస్తారు. పోలీసులకూ ఈ సమాచారం ఉంది. ఈ విషయాన్ని బలపరుస్తూ ఈ కొండ చుట్టూనే డంప్‌లు పలుమార్లు లభ్యమయ్యాయి. డంప్ లభ్యం సీతంపేట మండలం దోనుబాయి సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉంచిన డంప్‌ను పోలీసులు గుర్తించినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. దోనుబాయి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా డంప్ లభించినట్లు వివరించారు. వాటిలో ఆరు ల్యాండ్మైన్లు ఉన్నట్లు గుర్తించామని, సాంకేతిక నిపుణుల సాయంతో నిర్వీర్యం చేసి బయటకు తీశామని తెలిపారు. ల్యాండ్‌మైన్స్‌తో పాటు ఆరు డిటోనేటర్లు కూడా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఓ నాటు తుపాకీ, టార్చిలైట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లభ్యమైన నాటు తుపాకీ పనిచేసే స్థితిలో ఉండడాన్ని చూస్తే ఏడెనిమిదేళ్ల కిందట ఈ డంప్‌ను భూమిలో పాతిపెట్టి ఉండవచ్చని ఎస్పీ అభిప్రాయపడ్డారు. వీటిని గుర్తించిన సిబ్బందికి రివార్డులు ఇస్తామన్నారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీలు కృష్ణవర్మ, శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రివార్డుల ప్రకటనతో.. కొన్నేళ్లుగా ఏఓబీలో ప్రశాంత వాతావరణం నెలకొంది. హింసాత్మక ఘటనలు జరగలేదు. అయితే ఇటీవల ఆంధ్రా ఒడిశా సరిహద్దులోనే పోలీసు ఇన్ఫార్మర్లనే నెపంతో గిరిజనులను హతమార్చిన ఘటనలు వెలుగు చూశాయి. అంతలోనే పోలీసులు కూంబింగ్ నిర్వహించడం, వారికి డంప్ దొరకడంతో ఇక్కడ మావోయిస్టుల కదలికలపై అనుమానాలు బలపడుతున్నాయి. దీనికి తోడు ఇటీవల భామినిలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని నేరుగా నిషేధిత మావోయిస్టుల వివరాలను ప్రకటించారు. వారిని పట్టిస్తే రివార్డులు కూడా అందిస్తామని చెప్పారు. మావోల కదలికలపై అంతర్గతంగా ఇంటెలిజెన్స్ ఇచ్చిన హెచ్చరికలతోనే పోలీసులు వ్యూహాత్మకంగా ఈ అడుగులు వేశారనే వాదన వినిపిస్తోంది. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ తరుణంలో ప్రతీకార చర్యలకు దిగడం కూడా మావోలకు ఆనవాయితీ. ఈ తరుణంలోనే పోలీసులకు డంప్ దొరికింది. దీంతో అక్కడక్కడా ఉన్న మావో సానుభూతిపరులపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. -
అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ
భామిని: ఎస్టీ వివాహితను మోసగించాడన్న ఫిర్యాదుపై పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి దర్యాప్తు చేశారు. భామిని మండలం చిన్నదిమిలి కాలనీలో డీఎస్పీ స్వరూపారాణి, కొత్తూరు సీఐ జె.శ్రీనివాసరావు శుక్రవారం విచారణ చేపట్టారు. వివాహిత ఎడ్ల పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నదిమిలి కాలనీకి చెందిన యువకుడు టి.మనోజ్‌కుమార్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని డీఎస్పీ ఆదేశించారు. బత్తిలి ఎస్సై ఎం.ముకుందరావు, వీఆర్ఓ కె.బాలరాజు, వార్డు సభ్యులు ఎ.యశోద, గ్రామస్తులు ఉన్నారు. -
‘దేశం’లో కల్లోలం
భామిని: పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న భామిని మండల టీడీపీ కార్యకర్తలపై నిర్లక్ష్యం తగదని పలువురు టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశా రు. మంత్రి నిర్లక్ష్యం వల్ల మండలంలో పార్టీ నీరుగారిపోతోందని అన్నారు. ప్రతి చిన్న విషయానికి వర్గాలుగా మాట్లాడుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషకు ఫిర్యాదు చేశారు. శనివారం భామిని మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా దేశం పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష ఆధ్వర్యంలో నిర్వహించిన కరువు నివారణ, శాశ్వత పరిష్కారాల కోసం నిర్వహిం చిన సమావేశంలో పార్టీ నాయకుడు జగదీశ్వరరావుతో పాటు కార్యకర్తలు పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. నిధులు దారి మళ్లించి మండలాన్ని అ భివృద్ధికి దూరం చేస్తున్నారని అన్నా రు. కార్యక్రమంలో రాష్ర్ట ప్రభు త్వ పరిశీలకునిగా పాల్గొన్న గోవిందరెడ్డి సమక్షంలో వారు ఆరోపణలు గు ప్పించారు. దీంతో ఆయన పార్టీ విషయాలు వేరే సమావేశాల్లో మాట్లాడుకుందామని చెప్పి శాంతింపజేశారు. అయితే చిన్ననీటి పథకాలు, మినీ రి జర్వాయర్ల సూచనలు ఇచ్చినా పట్టిం చుకోలేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం రాక మునుపే నీరు -చెట్టు పనులు చేయాలని కోరారు. భామినిలో శాశ్వత కరువు నివారణకు మినీ రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. ఉపాధి పనుల నిలిపివేతపై బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యువతి అనుమానాస్పద మృతి
► గ్యాంగ్ రేప్.. ఆపై హత్యగా అనుమానాలు ► భామినిలో సంచలనం ► పోలీసు దర్యాప్తు ప్రారంభం ఘనసర కాలనీ (భామిని): ప్రశాంతంగా ఉండే గ్రామంలో యువతి లైంగిక దాడి.. ఆపై హత్యకు గురైందనే వార్తతో భామిని మండలవాసులు ఉలిక్కి పడ్డారు. హతురాలు గ్రహణం మొర్రి బాధితులు కావడం గమనార్హం కాగా.. ఈ సంఘట స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. భామి ని మండలం ఘనసర కాలనీకి చెందిన 20 ఏళ్ల యువతి సోమవారం కాలనీ సమీపంలోని పీఏసీఎస్ భవనం వెనుక వెదురు పొదల మధ్య అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆదివారం రాత్రి కాలనీ నుంచి బహిర్భూమికి వెళ్ళిన సుమతి ఎప్పటికీ రాకపోవడంతోస్థానికులు సమీపంలోని వరద కాలువ చుట్టూ గాలించారు. తెల్లవారే సరికి ఇంటికి సమీపంలోని వెదురు పొదల వద్ద మృతదేహాన్ని చూసి నిర్ఘాంతపోయారు. ఆ యువతి కాలనీ శివారులో పూరింట్లో ఉంటూ కుట్టుపని చేసుకుంటూ, వ్యాధి గ్రస్తురాలైన తల్లిని పోషించుకుంటూ కాలం వెలుబుచ్చుతోంది. గ్రహణం మొర్రి గల ఆమె అత్యాచారం, ఆపై హత్య(?)కు గురికావడం గ్రామస్తులకు ఓ పట్టాన మింగుడు పడడం లేదు. ఐదేళ్ల క్రితం తండ్రి మృత్యువాత పడగా, తల్లి కేన్సర్ వ్యాధితో మంచం పట్టింది. కూతురు మృత్యువాత పడిన విషయం తెలిసి ఆ తల్లి ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఆదివారం రాత్రి ఎవరో పిలిస్తే తన కూతురు బయటకు వెళ్ళిందని ఆమె రోదిస్తూ చెబుతోంది. సోమవారం మధ్యాహ్నం సమయంలో బహిర్భూమికి వెళ్లిన మహిళలు యువతి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం పడిన తీరు, ఒంటిపై దుస్తులు లేకుండా ఉండడాన్ని గుర్తించిన మహిళలు వెంటనే బట్టలు కప్పి గ్రామస్తులకు సమాచారం అందించారు. వీఆర్ఓ వి.చిన్నారావు సమాచారం మేరకు కొత్తూరు సిఐ కె.అశోక్ కుమార్, బత్తిలి ఎస్సై జి.శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని చేరుకొని అనుమానాస్పద మృతిగా గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. రాత్రికి జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీం సంఘటన స్థలంలో తనిఖీ చేపట్టింది. గ్యాంగ్ రేప్‌గా ప్రచారం ఘనసర కాలనీకి చెందిన మృతికి సామూహిక లైంగిక దాడి, ఆపై హత్యగా ఇక్కడ ప్రచారం జరుగుతోంది. మృత దేహం మెడలో గట్టిగా చుట్టిన చున్నీ ఉంది. ముఖం నిండా గాయాలు, రెండు చేతులు చాచినట్లు పడి ఉండడం, ఒంటిపై దుస్తులు తొలగించి ఉండడాన్ని బట్టి ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు దురాఘాతానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. హత్య కేసుగా నమోదు ఘనసర కాలనీ(భామిని): యువతి (20) అనుమానాస్పద మృతిని హత్య కేసుగా నమోదు చేసిన ట్లు శ్రీకాకుళం డీఎస్పీ రాంవర్మ స్పష్టంచేశారు. సోమవారం రాత్రి భామిని మండలం ఘనసర కాలనీ సమీపంలో సంఘటన స్థలాన్ని కొత్తూరు సీఐ అశోక్ కుమార్, బత్తిలి ఎస్సైతో కలిసి పరిశీలించారు. చుట్టుపక్కల ఇళ్లవారితో రహస్యంగా మాట్లాడి వివరాలు సేకరించారు. మృతురాలి తల్లిని పరామర్శించి, వివరాలు సేకరించారు. -
రక్తం చిందిన రోడ్లు
జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. భామిని మండలం బొడ్డగూడ వద్ద ట్రాక్టర్ బోల్తా ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందగా, ద్విచక్రవాహనంపై అతివేగంగా వెళ్తూ పలాస ఆంజనేయ స్వామి ఆలయం వద్ద తులసికోటకు ఢీకొని ఓ యువకుడు తనువు చాలించాడు. భవన నిర్మాణ పని ముగించుకుని ఇంటికి వస్తున్న ఓ మహిళను లారీ రూపంలో మృత్యువు కబళించింది. బొడ్డగూడ(భామిని). న్యూస్‌లైన్: పెళ్లి పందిరికి అవసరమైన కర్రలు తెచ్చేందుకు కొండకు వెళ్లిన మండలంలోని బురజోల గ్రామానికి చెందిన గిరిజనుడు దుర్మరణం చెందగా, మరో 8 మంది గాయపడ్డారు. భామిని మండలం బొడ్డగూడ ఘాటీ రోడ్డులో ట్రాక్టర్ బ్రేకులు పట్టకపోవడంతో బోల్తా పడింది. దీంతో కర్రలలోడుతో ఉన్న తొట్టెకింద ఉండిపోయిన బురజోలకు చెందిన గిరిజనుడు మిలగాం కృష్ణమూర్తి(50) అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ మిలగాం సుదర్శన్, ముచ్చర్ల కృష్ణమూర్తి, కోడూరు నూకయ్య, కలిశెట్టి మధుసూదన్, బిడ్డిక చంటి, అల్లు లోకేష్, కలిశెట్టి కేశవరావు, పత్తిక నూకయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108లో కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కోడూరు నూకయ్య, ముచ్చర్ల కృష్ణమూర్తిలను శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. పత్తిక నూకయ్య, కేశవరావును పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బత్తిలి ఎస్ఐ సీహెచ్ రామారావు కృష్ణమూర్తి మృతదేహానికి శవపంచనామా జరిపి పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాద స్థలానికి భామిని, బురుజోల, అనంతగిరి తదితర గ్రామాలనుంచి మృతుడు, క్షతగాత్రుల బంధువులు చేరుకుని బోరున విలపించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. బురజోల మాజీ సర్పంచ్ ప్రకాశరావు, పత్తిక సింహాచలం, సర్పంచ్ ప్రతినిధి సాకేటి రామారావు, బోగాపురపు అప్పలనాయుడులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో పోలీసులకు సహకరించారు. కొత్తూరులో ఆటో బోల్తా... కొత్తూరు: మండలంలోని కురిగాం మలుపు వద్ద ఆటో బోల్తా పడడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి సమీపంలోని పాటపాడులో నీలగిరి తోటలు కొట్టేందుకు మదనాపురానికి చెందిన కూలీలు వెళ్లారు. అక్కడ పనిలేకపోవడంతో తిరిగి వస్తుండగా కురిగాం మలుపు వద్ద ఆటో ఆదుపు తప్పి బోల్తాపడడంతో గురాన వెంకటరావు, కలవల గోపాలు, కూరాకుల చిన్నయ్య, బిడ్డిక నాగరాజులు గాయపడ్డారు. వీరిని 108 సహాయంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ తలే రామారావు కేసునమోదు చేశారు. క్షతగాత్రులను కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రులతోనిండిన కొత్తూరు ఆస్పత్రి.... కొత్తూరు, భామిని మండలాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారితో కొత్తూరు ప్రభుత్వాస్పత్రి నిండిపోయింది. క్షతగాత్రుల బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో మిన్నంటాయి. -
హెలెన్ పడగ
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. బుధవారం అర్ధరాత్రి 8 మండలాల్లో వర్షాలు పడగా గురువారం ఉదయం నుంచి 38 మండలాల్లోనూ వర్షాలు కురిశాయి. గురువారం ఉదయానికి 8 మండలాల్లో 3.3 సెంటీమీటర్ల వర్షం పడగా సాయంత్రానికి జిల్లాలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు నమోదైంది. పొలాకి, టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, శ్రీకాకుళం, భామిని, గార మండలాల్లో వర్షం ఎక్కువగా కురిసింది. శుక్రవారం కూడా వర్షాలు కొనసాగనుండటంతో వరి, అరటి, బొప్పాయి, మునగ, ఇతర పంట లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అంచనా. మత్స్యకారులకు మళ్లీ కష్టాలు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించటంతో మత్స్యకారులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. గతంలో పై-లీన్ తుపాను తీవ్రతకు వలలు, పడవలు దెబ్బతినటంతో వారు పూర్తిగా నష్టపోయారు. అప్పటి నష్టానికి పరిహారం ఇప్పటికీ అందలేదు. ఇంతలోనే హెలెన్ తుపాను ముంచుకురావటంతో ఉపాధి లేక విల విల్లాడుతున్నారు.