'Adharam Madhuram' Song released from Dheera movie - Sakshi
Sakshi News home page

Dheera : అధరం మధురం.. వదనం మధురం.. నయనం మధురం

Published Wed, Feb 15 2023 10:40 AM | Last Updated on Wed, Feb 15 2023 12:31 PM

Adharam Madhuram Song Released From Dheera Movie - Sakshi

కెరీర్ ఆరంభం నుంచే వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న హీరో లక్ష్ చదలవాడ.. రీసెంట్ గా 'వలయం', 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' తో ప్రేక్షకులను అలరించిన ఆయన..ఇప్పుడు అదే జోష్ లో 'ధీర' అనే మరో ప్రాజెక్టులో భాగమవుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ యూత్ ఫుల్ యాక్షన్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. అధరం మధురం.. వదనం మధురం.. నయనం మధురం అంటూ యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే ట్యూన్ తో సాగిపోతున్న ఈ పాట అందరిని ఆకట్టుకుంటుంది. 

ప్రేయసి ఆలోచనలు, జ్ఞాపకాలతో ప్రియుడి ఘాడమైన ప్రేమను వ్యక్తపరుస్తూ బాలాజీ రాసిన లిరిక్స్ బాగున్నాయి. అనురాగ్ కులకర్ణి, ఎమ్‌ఎల్‌ శృతి ఆలపించిన తీరు ఎంతో ఆకర్షిస్తోంది. లిరిక్స్‌కి తగ్గట్టుగా సాయి కార్తీక్ కట్టిన బాణీలు ఈ సాంగ్ లెవల్ పెంచేశాయి.
విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ధీర సినిమాను చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. నేహా పతన్, సోన్యా భన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడీ, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందని, త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ డేట్‌ని అనౌన్స్‌ చేస్తామని మేకర్స్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement