Buzz: Akhil Akkineni Next Fantasy Actioner Titled As Dheera - Sakshi
Sakshi News home page

Akhil Akkineni: ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదే!

Published Wed, May 10 2023 9:44 AM | Last Updated on Wed, May 10 2023 10:18 AM

Buzz: Akhil Akkineni Next Movie Titled As Dheera - Sakshi

 కేరీర్‌లో సాలిడ్‌ హిట్‌ కోసం ట్రై చేస్తున్న అఖిల్‌ అక్కినేనికి ప్రతిసారి నిరాశే మిలుగుతుంది. భారీ అంచాలు పెట్టుకున్న ‘ఏజెంట్‌’ ఇటీవల విడుదలై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటాలనుకున్నాడు అఖిల్‌. కానీ ఆయన ప్రయత్నం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అఖిల్‌ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌ మూవీగా ఏజెంట్‌ నిలిచింది.

(చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి)

అయితే సినిమా ఫలితాన్ని పట్టించుకోకుండా.. తన తర్వాత చిత్రంపై ఫోకస్‌ పెట్టాడు ఈ అక్కినేని హీరో.  ‘సాహో’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసిన అనిల్‌ కుమార్‌ ఇటీవల అఖిల్‌కు ఓ కథ వినిపించారట. అది తనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట. ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లోని ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ నిర్మించనుందని టాక్‌.

(చదవండి: చైతూ నా దగ్గర ఆ ప్రామిస్‌ తీసుకున్నాడు: వెంకట్‌ ప్రభు )

అంతేకాదు ఈ చిత్రానికి ‘ధీర’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందట. మరి ఈ చిత్రంతోనైనా అఖిల్‌ సాలిడ్‌ హిట్‌ కొడతాడో లేదో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement