బాలుడికి ఇడ్లీ తినిపిస్తున్న విద్యార్థినులు
సాక్షి, బాన్సువాడ టౌన్: పట్టణంలోని మోడల్ స్కూల్ విద్యార్థినులు కొందరు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. యాచిస్తున్న బాలుడిని దగ్గరకు తీసుకుని చదుకోవాలని సూచించారు. పట్టణంలోని రాజారాం దుబ్బా కాలనీకి చెందిన ఆరేళ్ల ఘన్‌వీర్ గురువారం ఉదయం యాచిస్తు న్నాడు. అదే సమయంలో మోడ ల్ స్కూల్‌కు చెందిన వర్షిక, శ్రేష్ట, నిఖిత, శృతిక, అక్షర, మమత పాఠశాలకు వెళ్లేందుకు బస్టాప్‌లో నిలుచున్నారు. బాలుడ్ని చూసిన విద్యార్థినులు అతడ్ని ఆపి వివరాలు ఆరా తీశారు. పక్కనే ఇడ్లీ సెంటర్ నుంచి ఇడ్లీలు తీసుకొచ్చి అతడికి తినిపించారు.
‘తమ్ముడు.. ఎందుకు అడుక్కుంటున్నావురా.. ఇలా అడుక్కోమని ఎవరు చెప్పారురా.. మా లాగా బడికి వెళ్లి మంచిగా చదువుకోరా.. బడికి వెళ్తావా.. మేం చేర్పిస్తామని’ చెప్పారు. దీంతో ఆ బాలుడు ఏడుపు మొదలు పెట్టడంతో విద్యార్థునులు తెలిసిన వారి సాయంతో చైల్డ్ లేబర్ ఆఫీసర్‌కు ఫోన్ చేశారు. సదరు అధికారి ఎంతకీ రాకపోవడంతో పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రు లకు నచ్చ జెప్పి బాలుడిని బడి లో చేర్పించే ఏర్పాటు చేస్తామని పోలీసులు చెప్పడంతో విద్యార్థి నులు స్కూల్‌కు వెళ్లారు. వారికి వచ్చిన ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తే బాల కార్మికులు లేని రాష్ట్రంగా తయారు కావడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment