సోనియా భుజానికి శస్త్రచికిత్స | Sonia Gandhi undergoes shoulder surgery, will be out of ICU | Sakshi
Sakshi News home page

సోనియా భుజానికి శస్త్రచికిత్స

Published Thu, Aug 4 2016 8:30 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

సోనియా భుజానికి శస్త్రచికిత్స - Sakshi

సోనియా భుజానికి శస్త్రచికిత్స

న్యూఢిల్లీ : అస్వస్థతకు గురైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వేగంగా కోలుకుంటున్నారు. ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి ఆమెను ఐసీయూ నుంచి బయటకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. మరో రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సోనియా భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఆమె ఎడ‌మ భుజంలో ఎముక విరిగిన‌ట్లు వైద్యులు గుర్తించారు. ఆమెకు సర్జరీ చేయ‌డానికి ముంబై నుంచి డాక్టర్ సంజ‌య్ దేశాయ్ ప్రత్యేకంగా ఢిల్లీకి వ‌చ్చారు.
 
ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జైన త‌ర్వాత ఆమె కొన్ని రోజులు ఫిజియో థెర‌పీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు సూచించారు. మంగ‌ళ‌వారం వార‌ణాసిలో ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొన్న సోనియా అస్వస్థత కారణంగా ర్యాలీని మధ్యలోనే రద్దు చేసుకుని ఢిల్లీ వెళ్లారు. డీహైడ్రేష‌న్‌, జ్వరం, అధిక రక్తపోటు, త‌లతిర‌గ‌డం లాంటి సమస్యల బాధపడుతున్న ఆమెకు తొలుత ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స చేయించగా, అక్కడి నుంచి ఎస్ఆర్‌జీహెచ్‌కి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement