Lata Mangeshkar Hospitalised After Contracting Covid, In Icu: ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్(92)కు కోవిడ్ సోకింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని లతా మంగేష్కర్ మేనకోడలు రచనా ద్రువీకరించారు.'స్వల్ప లక్షణాలున్నాయి. కానీ వయసు రీత్యా ముందు జాగ్రత్త కోసం మాత్రమే ఐసీయూలో ఉంచారు. దయచేసి మా గోప్యతను గౌరవించండి' అని పేర్కొన్నారు.
కాగా గతంలో 2019లో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. 1929,సెప్టెంబర్28న జన్మించిన లతా మంగేష్కర్ భారత అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కె, పద్మ భూషణ్, పద్మవిభూషణ్, సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇండియన్ నైటింగల్‌గా పేరు సంపాదించిన ఆమె ఇప్పటివరకు 50వేలకు పైగా పాటలు పాడారు.
"She is doing fine; has been kept in ICU only for precautionary reasons considering her age. Please respect our privacy and keep Didi in your prayers," singer Lata Mangeshkar's niece Rachna to ANI
— ANI (@ANI) January 11, 2022
Comments
Please login to add a commentAdd a comment