నగరంలోని ప్రభుత్వాస్పత్రిలో ఐసీయూలో చికిత్ప పొందుతున్న చిన్నారి ఎలుకలు కొరికి మృతచెందడంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ వేణుగోపాల్, పీడియాట్రిక్ సర్జన్ భాస్కర్ రావులను బదిలీ చేస్తున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. దీంతో పాటు స్టాఫ్ నర్సు విజయనిర్మల, హెడ్ నర్సు విజయలక్ష్మిలను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.