16 మంది విద్యార్థినులకు గాయాలు
నల్లగొండ జిల్లా డిండిలో ఘటన
డిండి(నల్లగొండ): నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురులకు పాఠశాల(బాలికలు)లో ఎలుకలు హడలెత్తిస్తున్నాయి. ఇటీవల 16 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడంతో వారు ఆస్పత్రి పాలయ్యారు. ఈ విషయం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకుల పాఠశాలలో 635 మంది విద్యార్థినులు చదువుతున్నారు.
పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరగడం, గదుల గోడలకు ఏర్పడిన రంధ్రాల్లో ఎలుకలు, పాములు తిరుగుతున్నాయి. విద్యార్థినులు నిద్రిస్తున్న సమయంలో ఈ నెల 2న ఆరుగురు, 3న మరో ఆరుగురు, 5న నలుగురు విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. దీంతో వారు స్థానిక పీహెచ్‌సీలో యాంటీ రేబిస్ టీకాను వేయించుకున్నారు.
ఈ నెల 2వ తేదీన మండల వైద్యాధికారి ఎస్.శైలి గురుకుల ఆవరణను పరిశీలించి వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఎంపీడీఓ, ఎంఈఓకు లేఖ రాశారు. ప్రిన్సిపాల్ పద్మ విద్యార్థినుల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని శనివారం విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ధర్నా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment