లగేజ్లో ఎలుకలు..బల్లులు.. పాములు | TN man brings snakes, white rats, lizards from Malaysia | Sakshi
Sakshi News home page

లగేజ్లో ఎలుకలు..బల్లులు.. పాములు

Published Fri, Oct 16 2015 4:02 PM | Last Updated on Mon, Oct 22 2018 2:22 PM

లగేజ్లో ఎలుకలు..బల్లులు.. పాములు - Sakshi

లగేజ్లో ఎలుకలు..బల్లులు.. పాములు

విదేశాలకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో సాధారణంగా అక్కడ ఉండే ప్రత్యేక, అమూల్యమైన వస్తువులను వెంటతెచ్చుకుంటారు. కానీ గురువారం చెన్నై విమానాశ్రయంలో రోజువారి తనిఖీలలో భాగంగా విదేశాల నుండి వచ్చిన ఓ వ్యక్తి లగేజ్ను చెక్ చేసిన  కస్టమ్స్ అధికారులు షాక్ అయ్యారు. దానికి కారణం.... మలేసియా నుండి 'మలేసియన్ ఎయిర్ లైన్స్'  విమానంలో చెన్నైకి వచ్చిన హబీబ్ అనే ప్రయాణికుడు  తనతో పాటుగా ఎలుకలు, బల్లులు, పాములను వెంట తెచ్చుకున్నాడు.
 

తనిఖీలలో లభించిన తెల్ల ఎలుకలు, బల్లులు, పాములను కస్టమ్స్ అధికారుల వెంటనే అటవీశాఖ అధికారులకు అప్పగించారు. తమిళనాడులోని రామనాధపురం జిల్లాకు చెందిన హబీబ్.... తన ఇంట్లో పెంచుకోవడానికి ఈ సరిసృపాలను వెంట తెచ్చుకున్నట్లు ఆ  జంతు ప్రేమికుడు  విచారణలో చెప్పటంతో అధికారులు తెల్లబోయారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement