మనకు రామాయణంలో పిడకల వేట తెలుసు. ఇప్పుడు పాక్ పార్లమెంట్ ఎలుకల వేట సాగుతోంది! పార్లమెంటు భవనంలో ఎలుకలు విపరీతంగా పెరిగిపోయాయట. 2008 నుంచి జరిగిన సమావేశాల రికార్డులను పరిశీలించాలని అధికారిక కమిటీ ఒకటి కోరడంతో సమస్య తీవ్రత వెలుగులోకి వచ్చింది. రికార్డులన్నీ కాగితం ముక్కలై కనిపించడంతో ఇదెవరి పనా అని ఆరా తీస్తే ఎలుకల నిర్వాకమని తేలింది.వాటి ఆకారాలు కూడా అలా ఇలా లేవట. ‘‘ఎలుకలు ఎంత పెద్దగా ఎన్నాయంటే, బహుశా పిల్లులు కూడా వాటికి భయపడిపోతాయేమో! మా సిబ్బందికంటే వాటిని చూసీ చూసీ అలవాటైపోయింది.
కానీ తొలిసారి వచ్చేవాళ్లంతా ఈ ఎలుకల విరాట్ స్వరూపాలను చూసి వణికిపోతున్నారంటే అతిశయోక్తి కాదు’’ అని నేషనల్ అసెంబ్లీ అధికార ప్రతినిధి జాఫర్ సుల్తాన్ వాపోయారు. రికార్డులు మొదలుకుని దొరికిన దాన్నల్లా ఈ ఎలుకలు హాం ఫట్ అనిపిస్తున్నాయట. దాంతో వాటి వేటకు పిల్లుల కొనుగోలు తదితరాలకు వార్షిక బడ్జెట్‌లో 12 లక్షలు కేటాయించాల్సి వచి్చంది! ఎలుకలను ట్రాప్ చేయడానికి ప్రత్యేక నెట్ కిటికీలు ఏర్పాటు చేస్తున్నారు.
‘పార్లమెంటులో మనుషుల అలికిడి ఉన్నప్పుడు చడీచప్పుడూ లేకుండా ఎక్కడో నక్కుతాయి. అంతా నిర్మానుష్యం కాగానే పార్లమెంట్ ఆవరణను మారథాన్ ట్రాకుగా మార్చేసుకుంటున్నాయి. ఇంత తెలివైన ఎలుకలను నేనెప్పుడూ చూడలేదు’’ అని జాఫర్ చెప్పుకొ చ్చారు. విపక్ష నాయకుని కార్యాలయం, స్టాండింగ్ కమిటీల భేటీలు జరిగే తొలి అంతస్తులోనే ఎలుకలు విపరీతంగా ఉన్నట్టు గుర్తించారు. చివరికి వీటి కట్టడికి పెస్ట్ కంట్రోల్ కంపెనీల కోసం పేపర్ ప్రకటనలు కూడా ఇవ్వాల్సి వచి్చందట!
Comments
Please login to add a commentAdd a comment