rats attack
-
పాక్ పార్లమెంటులో ఎలుకల వేట!
మనకు రామాయణంలో పిడకల వేట తెలుసు. ఇప్పుడు పాక్ పార్లమెంట్ ఎలుకల వేట సాగుతోంది! పార్లమెంటు భవనంలో ఎలుకలు విపరీతంగా పెరిగిపోయాయట. 2008 నుంచి జరిగిన సమావేశాల రికార్డులను పరిశీలించాలని అధికారిక కమిటీ ఒకటి కోరడంతో సమస్య తీవ్రత వెలుగులోకి వచ్చింది. రికార్డులన్నీ కాగితం ముక్కలై కనిపించడంతో ఇదెవరి పనా అని ఆరా తీస్తే ఎలుకల నిర్వాకమని తేలింది.వాటి ఆకారాలు కూడా అలా ఇలా లేవట. ‘‘ఎలుకలు ఎంత పెద్దగా ఎన్నాయంటే, బహుశా పిల్లులు కూడా వాటికి భయపడిపోతాయేమో! మా సిబ్బందికంటే వాటిని చూసీ చూసీ అలవాటైపోయింది. కానీ తొలిసారి వచ్చేవాళ్లంతా ఈ ఎలుకల విరాట్ స్వరూపాలను చూసి వణికిపోతున్నారంటే అతిశయోక్తి కాదు’’ అని నేషనల్ అసెంబ్లీ అధికార ప్రతినిధి జాఫర్ సుల్తాన్ వాపోయారు. రికార్డులు మొదలుకుని దొరికిన దాన్నల్లా ఈ ఎలుకలు హాం ఫట్ అనిపిస్తున్నాయట. దాంతో వాటి వేటకు పిల్లుల కొనుగోలు తదితరాలకు వార్షిక బడ్జెట్లో 12 లక్షలు కేటాయించాల్సి వచి్చంది! ఎలుకలను ట్రాప్ చేయడానికి ప్రత్యేక నెట్ కిటికీలు ఏర్పాటు చేస్తున్నారు. ‘పార్లమెంటులో మనుషుల అలికిడి ఉన్నప్పుడు చడీచప్పుడూ లేకుండా ఎక్కడో నక్కుతాయి. అంతా నిర్మానుష్యం కాగానే పార్లమెంట్ ఆవరణను మారథాన్ ట్రాకుగా మార్చేసుకుంటున్నాయి. ఇంత తెలివైన ఎలుకలను నేనెప్పుడూ చూడలేదు’’ అని జాఫర్ చెప్పుకొ చ్చారు. విపక్ష నాయకుని కార్యాలయం, స్టాండింగ్ కమిటీల భేటీలు జరిగే తొలి అంతస్తులోనే ఎలుకలు విపరీతంగా ఉన్నట్టు గుర్తించారు. చివరికి వీటి కట్టడికి పెస్ట్ కంట్రోల్ కంపెనీల కోసం పేపర్ ప్రకటనలు కూడా ఇవ్వాల్సి వచి్చందట! -
ధర్మాసుపత్రిలో ఎలుకల గోల
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఎలుకలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆస్పత్రిలో సంచరిస్తూ రోగు లు, వైద్య సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నా యి. ఆస్పత్రి నిర్వహణను అధికారులు, సానిటేషన్ కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని, దీంతో తరచూ ఎలుక కాటు సంఘటనలు చోటు చేసుకుంటున్నా యని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి లో శనివారం చోటుచేసుకున్న ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులపై తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఐసీయూ విభాగంలో ఇద్దరు డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు. ఎలుక కొరుకుడు ఘటనలు.. ► నాలుగేళ్ల క్రితం మార్చురి గదిలో ఉన్న ఓ వ్యక్తి మృతదేహాన్ని ఎలుకలు కొరికేశాయి. నోరు, ముక్కు, చెవులు, చేతివేళ్లు, కాళ్లను ఎలుకలు పీక్కు తిన్నాయి. ఈ అంశంపై అప్పట్లో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ► 2022 ఏప్రిల్ 11వ తేదీన జిల్లా ఆస్పత్రిలోని ట్రా మాకేర్, ఐసీయూ విభాగాలలో చికిత్స పొందుతు న్న రోగులను ఎలుకలు గాయపరిచాయి. ఈ విషయాన్ని కూడా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. తాజా గా ఇదే ఆస్పత్రిలో మళ్లీ శనివారం రాత్రి రోగులను ఎలుకలు కరిచాయి. హౌసింగ్‌బోర్డు కాలనీకి చెంది న షేక్ ముజీబ్‌ను రక్తం వచ్చేలా గాయపరిచాయి. అదే రోజు మరో ఇద్దరు రోగులను సైతం కరిచాయి. సానిటేషన్ నిర్వహణ గాలికి.. జిల్లా కేంద్ర ఆస్పత్రి భవనంలో 28 విభాగాలున్నాయి. దీంతోపాటు మెడికల్ కళాశాల సైతం ఇందులోనే ఏర్పాటు చేశారు. దీంతో భవనం ఇరుకుగా మారింది. వాహనాల పార్కింగ్‌కు స్థలం సరిపోవ డం లేదు. రోగులు, వారి బంధువులు భోజనం చే యడానికి సరైన స్థలం లేదు. దీంతో ఆస్పత్రిలోని మంచాల వద్ద, మెట్లపై, ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేసి, మిగిలిన తినుబండరాలు, వ్యర్థాలను అక్కడే పడేస్తున్నారు. దీంతో ఎలుకలు ఆహారం కో సం బయటకు వచ్చి, ఆస్పత్రి అంతా కలియ తిరు గుతున్నాయి. ఆక్సిజన్ పైపుల గుండా సంచరిస్తూ ఏసీలను పాడు చేస్తున్నాయి. మంచాల వద్దకు వచ్చి రోగులను గాయపరుస్తున్నాయి. ఆస్పత్రి బయట ప్రాంతంలో, కిచెన్ షెడ్లో ఎక్కడ చూసినా ఎలుకల బొరియలే కనిపిస్తాయి. సానిటేషన్ నిర్వహణ సరి గా లేకపోవడంతో ఎలుకల స్వైర విహారానికి అడ్డుకట్ట పడడం లేదు. ఎలుకల కోసం గమ్ ప్యాడ్లు, బోనులను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, వాటి బెడద తప్పించడానికి సరైన చ ర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఎలుకల నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరమ్మతులు చేయిస్తాం భవన నిర్మాణ పనులు జరగడం, రోగులు, వారి బంధువులు ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేసి వ్యర్థాలను పడేస్తుండడంతో ఎలుకలు వస్తున్నాయి. ఎలుకలు రాకుండా చర్యలు తీసుకుంటాం. అవసరమైనచోట మరమ్మతులు చేయించి, ఎలుకలు రాకుండా చూస్తాం. – విజయలక్ష్మి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, కామారెడ్డి పరామర్శించిన బర్రెలక్క బర్రెలక్క అలియాస్ శిరీష ఆదివారం జిల్లా ఆస్పత్రిని సందర్శించి, ఎలుక కరిచిన రోగిని పరామర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయల క్ష్మితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభు త్వం తక్షణమే స్పందించి ఆస్పత్రిలో నెలకొన్న స మస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
రక్తపు మడుగులో బాలుడు.. ఎలుకలే చంపాయా..?
న్యూయార్క్: అమెరికాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆర్నెళ్ల బాలుడు రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. శిశువు మృతదేహం చుట్టూ ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఇళ్లంత చెత్తమయంగా ఉందని పేర్కొన్నారు. బాలుని శరీరంపై ఎలుకలు కొరికిన ఘాట్లు ఉన్నాయని వెల్లడించారు. ఎలుకల దాడిలోనే చిన్నారి మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డేవిడ్, ఏంజెల్ స్కోనాబామ్‌లు ఇండియానాలో ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అదే ఇంటిలో బాలుని అత్త, డెలానియా థుర్మాన్‌లు నివాసం ఉంటున్నారు. ఘటనాస్థలానికి చేరుకునేప్పటికి బాలుడు రక్తపు మడుగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తల, ముఖం మొత్తం ఎలుకలు కొరికిన గాయాలు ఉన్నాయని వెల్లడించారు. శిశువు వేళ్లు సగం మేర కొరికి ఉన్న ఒళ్లు జలదరించే దృశ్యాలను చూసినట్లు చెప్పారు. శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే అప్పటికే మరణించినట్లు పోలీసులు తెలిపారు. తాము వెళ్లే సమయానికి బాధిత ఇళ్లంతా చెత్తతో నిండి ఉందని తెలిపిన పోలీసులు.. ఎక్కడ చూసినా ఎలుకలు సంచరిస్తున్నాయని చెప్పారు. బాధిత శిశువు తండ్రి ఫోన్ చేయగా.. తాము ఆ ఇంటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధిత శిశువు తల్లిదండ్రులతో పాటు అత్తామామలను కూడా అరెస్టు చేశారు. ఎలుకలు పిల్లల్ని కరవడం ఇదే మొదటిసారి కాదని ఇంతకు ముందు కూడా జరిగినట్లు బాధిత కుటుంబానికి చెందిన పిల్లలు చదివే పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. బాధిత కుటుంబానికి చెందిన ఓ పిల్లవాడి కాలును ఎలుక కొరికినప్పుడు తాము ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. బాధిత పిల్లల్ని శిశు సంరక్షణ గృహానికి పంపించారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఇదీ చదవండి: Jaahnavi Kandula: జాహ్నవి మృతికి కారణమైన పోలీసు అధికారిని శిక్షించాలని డిమాండ్ -
చుక్కలు చూపిస్తున్న ఎలుకలు.. ఖతం చేసేందుకు ఏకంగా కోటికి పైగా జీతం!
న్యూయార్క్: అమెరికాలో న్యూయార్క్‌ని నిద్రపోని నగరం అని అంటారు. ఎలుకలు నిజంగానే న్యూయార్క్వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సబ్ వేలు, మెట్రో స్టేషన్లు, రోడ్డు పక్కనున్న చెత్త కుండీలు... ఎక్కడ చూసినా స్వైరవిహారం చేస్తున్నాయి. న్యూయార్క్ జనాభా 88 లక్షలైతే ఎలుకలు ఏకంగా 20 లక్షల వరకు ఉన్నాయట! ఎలుకలను నిర్మూలించే వారికి ‘‘డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్’’ పేరుతో పెద్ద ఉద్యోగాన్ని మేయర్ కార్యాలయం ఆఫర్ చేసింది! ఇందుకు భారీగా 1,20,000 నుంచి 1,70,000 డాలర్లు (రూ.96 లక్షల నుంచి రూ.1.36 కోట్లు) వేతనం చెల్లిస్తారు!! అక్టోబర్ నుంచే న్యూయార్క్ ప్రభుత్వం ఎలుకలపై యుద్ధం మొదలు పెట్టింది. ఇందుకోసం రేయింబవళ్లు వ్యూహాలు పన్నుతూ వాటిని తుదముట్టించే వారికోసం ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తోంది! -
ఆస్పత్రులేనా?ఎలుకల ఘటనతోనైనా మార్పు వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్/అఫ్జల్‌గంజ్/గాంధీఆస్పత్రి: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగిపై ఎలుకల దాడి ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఏకంగా ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తిని తీవ్రంగా గాయపర్చిన వైనం ప్రభుత్వాస్పత్రుల్లో డొల్లతనాన్ని కళ్లకు కట్టింది. రోగుల భద్రతను ప్రశ్నార్థకంలో పడేసింది. అంతా బాగానే ఉందంటున్న వైద్యాధికారుల నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపేలా చేసింది. ఈ నేపథ్యంలో నగరంలోని సర్కారు దవాఖానాలపై వైద్యశాఖ దృష్టి సారించాల్సిన ప్రాముఖ్యతను తెలియజెప్పింది. నగరంలోని ఆస్పత్రుల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉస్మానియాలో వానర విహారం.. నగరంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా ఆస్పత్రిలో చాలా కాలంగా కోతుల సందడి కొనసాగుతోంది. అవుట్ పేషెంట్ రోగులు వేచి చూసే ప్రాంతాల దగ్గర నుంచి అనేక చోట్ల కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఇప్పటి వరకూ ఇవి ఎవరినీ తీవ్రంగా గాయపరిచిన ఘటన జరగనప్పటికీ, వీటి విషయంలో పలువురు రోగులు ఇబ్బందులు పతున్నారు. ఇదే ఆస్పత్రిలోని ఇన్‌పేషెంట్ విభాగంలో పిల్లులు వీర విహారం చేసేవి. రోగుల మంచాల కింద గందరగోళం సృష్టించేవి. ఇటీవల పాత ఇన్‌పేషెంట్ విభాగం మూసేశారు. అయినప్పటికీ అక్కడక్కడా పిల్లులు దర్శనమిస్తూనే ఉంటాయి. ఆస్పత్రి ప్రాంగణంలో కుక్కల హల్చల్ కూడా తక్కువేమీ కాదు. పేట్లబురుజులో బొద్దింకలు.. పాతబస్తీలోని పేట్ల బురుజులో ఉన్న ఆధునిక ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో బొద్దింకలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎంతో కాలంగా ఈ ఆస్పత్రిలో బొద్దింకల బెడద తీవ్రంగా ఉన్నప్పటికీ..ఏ విధమైన నిర్మూలనా చర్యలు చేపట్టలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మూసీనది పక్కగానే ఉండడం వల్ల దోమలు సైతం విపరీతంగా ఉ న్నాయి. దీంతో రోగుల్లో ఆందోళన పెరుగుతోంది. తెలంగాణ వైద్యప్రదాయినీ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో శునకాలు, సెల్లార్‌లోని డైట్‌క్యాంటిన్ పరిసర ప్రాంతాల్లో ఎలుకలు, పందికొక్కులు స్వైర విహారం చేస్తున్నాయి. ఆస్పత్రి ప్రాంగణంతోపాటు వార్డుల్లోనూ శునకాలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి రోగి సహాయకులతోపాటు వచ్చిన శునకాలకు సమృద్ధిగా ఆహారం దొరకడంతో ఆస్పత్రి ప్రధాన భవనం, ఓపీ, అత్యవసర, మార్చురీలతోపాటు గాంధీ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలను ఆవాసాలుగా చేసుకుని పదుల సంఖ్యలో తిష్టవేశాయి. పోలీస్ అవుట్‌పోస్ట్ వద్ద శునకాలు నిత్యం తిష్ట వేయడం గమనార్హం. రోగులు, వైద్యులకు ఆహారాన్ని అందించే సెల్లార్లో కొనసాగుతున్న డైట్‌క్యాంటిన్ పరిసర ప్రాంతాల్లో ఎలుకలు, పందికొక్కులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. పాలు, కూరగాయలు, పప్పులు వంటి ఆహార పదార్థాలపై తిరుగుతుంటాయి. ఆస్పత్రి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో సెల్లార్‌లోని బొరియలు, గుంతల్లో వందలాది ఎలుకలు, పందికొక్కులు నివసిస్తున్నాయి. (చదవండి: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్) -
ఎంజీఎం దవాఖాన పరిస్థితిపై ఎలుక చెప్పిన కథ.. మీరే చదువుర్రి ఓసారి..
‘ఎలుక తోలుదెచ్చి ఏడాది ఉతికినా.. నలుపు నలుపేగాని తెలుపుగాదు’ అని మా మీద ఎందుకు ఏడ్వడం? మేమెలాగూ మారం! మరి మీరు?. ఈ రోజు ఒకరిని కొర్కినం.. రేపు మరొకర్ని’ అంటూ ఎంజీఎం వైద్యులు, దవాఖాన పరిస్థితిపై ఎలుక చెప్పిన కథ! – ఎంజీఎం/వరంగల్ డెస్క్ ‘‘గీ ఎంజీఎంను.. ధర్మాసుపత్రని చెప్తుండ్రు కదా.. మరి ఇక్కడ్కి రావాల్నంటే రోగులు ఎందుకు భయపడుతుండ్రు. మేం ఎలుకలు, మా పెద్దన్న(పందికొక్కు)లు ఉన్నయనా? దవాఖాన ఆర్ఐసీయూలో ఓ రోగిని కొరికినమనా? సరే.. మొదటిసారి కొరికినం. అది మా తప్పే? ఆ తర్వాత ఐదు దినాల్లో అదే రోగిని మూడుచోట్ల కొరికినం. అధికారులు, వైద్యులు మీరంతా ఏం జేసిండ్రు. కట్టు కట్టి వదిలేసిండ్రు. అది మీ తప్పు కాదా? అంతా మాపై నెట్టేసి.. చేతులు దులుపుకుంటుండ్రు! ఒక్కటి చెప్పుండ్రి మేమిక్కడ(ఎంజీఎంలో) టికానా ఏర్పాటు చేసుకునేతందుకు కారణం మీ నిర్లక్ష్యం కాదా?’’ అని ఎలుక తన మనోగతాన్ని బయటపెట్టింది. సంబంధిత వార్త: రోగి కాళ్లు, చేతులు కొరికిన ఎలుకలు మరో ఎలుక మీసాలు రువ్వుతూ గళమెత్తింది! ‘‘ఇట్లా ఒక్కటేమిటి మీ తప్పులు లెక్కలేనన్ని సూసినం. కొన్ని చెప్త ఇనుండ్రి. ఏ రోజైనా ఇక్కడి సిబ్బంది యాళ్లకు విధులకు హాజరైండ్లా? శానిటేషన్ ఎట్లుంది? వార్డుల నిర్వహణ ఎట్లున్నది? రోగులేమో వందల్లో, వేలల్లో ఉంటరు.. వైద్యులేమో అతి తక్కువ మంది ఉంటరు? యాళ్లపొద్దుగాళ్ల ఇంటికాన్నుంచి అచ్చే రోగులకు సక్కటి వైద్యమందిత్తలేరు! ఎలుకలమై ఉండి మాకే బాధనిపిస్తుంది’’ అంటూ మీసం తిప్పుతూ ఆర్ఐసీయూ వార్డుకు వెళ్లిపోయింది. చిట్టెలుక స్వరం మార్చి(బాధతో) ‘‘ఎంజీఎం ఆస్పత్రిలో ఆర్ఎంఓ–1 గా వైద్యాధికారి డాక్టర్ హరీశ్రాజును గవుర్నమెంటు డిప్యూటేషన్‌పై వేరే జిల్లా డీఎంహెచ్‌ఓగా కొనసాగిస్తండ్లు. ఎంజీఎం ఆస్పత్రిలో నిత్యం ముగ్గురు ఆర్‌ఎంఓలు విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. ఒక్క అధికారి డిప్యుటేషన్లో ఉండగా, మరో ఒక్క ఆర్ఎంఓ స్థాయి అధికారి పోస్టు ఖాళీగా ఉండడంతో ఒకే ఒక్క ఆర్ఎంఓ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. గీ ముచ్చట్లన్నీ దవాఖాన్ల సదువుకున్నోళ్లు చెప్తే విన్న’’ అంటూ చిట్టెలుక సరసరా ఆవరణలోని కలుగులోకెళ్లింది. ముక్కు మూసుకుంటూ మరో మూషికం.. ‘‘సుట్టపు సూపోలె ఎంజీఎంకు డాక్టర్లు వస్తరు. పోతరు! మేమే(ఎలుకలం) ఎప్పట్నుంచో ఈన్నే ఉంటన్నం. కొంతమంది డాక్టర్లు, సిబ్బంది సుట్టపు సూపోలే.. ఆస్పత్రికి వస్తున్నరు. రిజిస్టర్ల సంతకాలు పెట్టేతందుకే వస్తున్నరేమో అనే అనుమానం కల్గుతంది. వాళ్లతో పోలిస్తే మేమే నయం. మా పని మేం సక్కగ చేసుకుంటున్నం’’ అంటూ మూషికం దవాఖానలోని జంబుఖానను కొరుకుతూ చెబుతోంది! బరాబర్ అల్కిరి చేస్తం! ‘‘ఎంజీఎం మా అడ్డా. అవ్ బరాబర్ ఇక్కడ్నే ఉంటం. అల్కిరి జేస్తం. ఎవ్వర్నైనా కొరుకుతం. ఏ విభాగంలకైనా దూరుతం. అధికార్లు, వైద్యులు ఏం చేస్తరో చేసుకోండ్రి. మా జోలికొచ్చే ముందు శానిటేషన్ వ్యవస్థను ప్రక్షాళన చెయ్యుండ్రి. ఆస్పత్రి ఆవరణల ఎక్కడపడితే అక్కడ చెత్త వేసుడు మానేయుండ్రి. ఆ తర్వాత మా జోలికి రండ్రి! అంటూ ఎలుకలన్నీ మూకుమ్మడిగా గొంతు కదిపాయి! -
రైతు మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు
చంఢీగడ్: వ్యవసాయ చట్టాల రద్దు కోసం చేస్తున్న ఉద్యమంలో పాల్గొన్న రైతు గుండెపోటుతో మరణించగా.. అతడి మృతదేహాన్ని ఎలుకలు పీక్కు తిన్నాయి. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచిన శవాన్ని ఎలుకలు కొరికి తినడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీనిపై కుటుంబసభ్యులతోపాటు రైతు సంఘాల నాయకులు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటన హరియాణా రాష్ట్రం సోనిపట్ జిల్లాలో చోటుచేసుకుంది. సోనిపట్ జిల్లాలోని బయాన్‌పూర్ గ్రామానికి చెందిన రైతు రాజేందర్ (72). దేశవ్యాప్తంగా సాగుతున్న రైతు ఉద్యమంలో పాల్గొంటున్నాడు. అయితే బుధవారం ఆయన గుండెపోటుకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందాడు. దీంతో సానిపట్లోని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో రాజేందర్ మృతదేహం భద్రపర్చారు. గురువారం వచ్చిచూసేసరికి మృతదేహంపై గాట్లు.. గాయాలు ఉన్నాయి. దీనిపై కుటుంబసభ్యులు ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎలుకలు మృతదేహాన్ని కొరకడంతో గాట్లు పడ్డాయని వైద్యాధికారులు గుర్తించారు. అయితే ఆస్పత్రిలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వైద్యాధికారులు తెలిపారు. హరియాణా బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణదీదీప్ సూర్జేవాలా స్పందించారు. ఈ ఘటనపై ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. 73 साल में ऐसा दर्दनाक मंजर शायद कभी ना देखा हो ! शहीद किसान के शव को चूहे कुतर जाएँ और भाजपा सरकारें तमाशबीन बनी रहें। शर्म से डूब क्यों नही मार गए भाजपाई !#FarmersProtests pic.twitter.com/7jE9yaNYfz — Randeep Singh Surjewala (@rssurjewala) February 19, 2021 -
ఎలుక నా కష్టాన్ని భగ్నం చేసింది: కామినేని
సాంబమూర్తినగర్ (కాకినాడ): ఒక్క ఎలుక తన కష్టాన్ని భగ్నం చేసిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. గుంటూరు ఆస్పత్రిలో ఎలుకల దాడిలో పసికందు మృతిచెందిన విషాదాన్ని గుర్తు చేస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. శనివారం తూర్పు గోదావరి కాకినాడలో జిల్లా రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (రామ్‌కోసా) సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను మోకాలి ఆపరేషన్ కాకినాడలో చేయించుకోవాలని అనుకున్నానని, తనపై పడ్డ మచ్చను తొలగించుకునేందుకు గుంటూరు ఆస్పత్రిలోనే చేయించుకుంటానని చెప్పారు. -
ధర్మాసుపత్రిలో పందికొక్కులు కరిచేశాయ్
♦ మహిళ కాలికి గాయం ♦ అనంతపురం జిల్లా గుంతకల్లులో ఘటన గుంతకల్లు: గుంటూరు ఆసుపత్రిలో ఇటీవలే మూషికాల దాడిలో ఓ పసిగుడ్డు బలైంది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరినీ కదిలించింది. పాలకుల్లో ఇసుమంతైనా చలనం రాలేదు. ప్రభుత్వ ఆసుపత్రులు శునకాలు, పందికొక్కులు, ఎలుకలు, పాములకు నిలయంగా మారుతున్నా, రోగులపై దాడులు చేస్తున్నా వారికి చీమకుట్టినట్లయినా లేదు. గుంటూరు ఘటనను మరిచిపోకముందే అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళను పందికొక్కు కరిచి, గాయపర్చింది. వజ్రకరూరు మండలం పందికుంట గ్రామానికి చెందిన లక్ష్మీ రెండు రోజుల క్రితం కాన్పు కోసం గుంతకల్లు ప్రభుత్వాస్పత్రిలో చేరింది. శనివారం ఉదయం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. లక్ష్మీకి సహాయకురాలుగా ఆమె తల్లి ఎర్రమ్మ (55) వచ్చింది. ఆసుపత్రిలోని కాన్పుల వార్డులో లక్ష్మీ పక్కనే నిద్రించింది. తెల్లవారుజామున 1-2 గంటల మధ్య పాప ఏడ్చింది. దీంతో ఎర్రమ్మ లేచి పాపను ఊయలలో వేసి నిద్రపుచ్చింది. తనూ నిద్రపోయింది. కొద్దిసేపటికి పందికొక్కులు కాన్పుల వార్డులోకి ప్రవేశించాయి. ఎర్రమ్మ కాలును ఓ పందికొక్కు కరిచింది. ఉలిక్కిపడి లేచిన ఆమె బిగ్గరగా కేకలు పెట్టింది. కాలిపై పందికొక్కు పంటిగాట్లు కన్పించాయి. తీవ్ర రక్తస్రావమైంది. వార్డులోని వారంతా నిద్ర లేచారు. పందికొక్కులను తరిమారు. అవి మరుగుదొడ్లలోని బొరియల్లోకి వెళ్లిపోయాయి. గాయపడిన ఎర్రమ్మకు ఆస్పత్రిలోని నర్సులు వైద్యం చేసి కాలుకు కట్టుకట్టారు. -
మహిళ వేళ్లు కొరికేశాయి..
-
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మళ్లీ ఎలుకలు
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు మళ్లీ స్వైర విహారం చేశాయి. ఎముకల వార్డులో చికిత్స పొందుతున్న ఓ మహిళ చేతి వేళ్లను ఎలుకలు కొరికాయి. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. గతనెలలో పసికందును ఎలుకలు తినేసిన సంఘటన మరిచి పోకముందే శుక్రవారం పాము కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే ఈ రోజు ఎలుకలు మహిళ చేతి వేళ్లను తినేశాయి. దాంతో ఆమెను అత్యవసర చికిత్సా విభాగానికి తరలించారు. రోశమ్మ(40) అనే మహిళ జీజీహెచ్‌లోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతోంది. శనివారం తెల్లవారుజామున ఆమెపై ఎలుకల గుంపు దాడి చేశాయి. అది గమనించిన రోగి తరపు వారు వైద్యులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే వారు అత్యవసర చికిత్సా విభాగానికి తరలించి ఆమెకు వైద్యం చేశారు. ఈ సంఘటనతో వార్డులోని రోగులు బెంబేలెత్తుతున్నారు. కాగా అధికారుల నిర్లక్ష్యంతో ఎలుకల దాడిలో పసికందు చనిపోయిన ఘటనతో కళ్లు తెరిచిన అధికారులు ఎలుకలు పట్టేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో సుమారు 400 ఎలుకలను పట్టుకున్నారు. అయినా ఎలుకలు వస్తుండటంతో పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు. -
పిల్లీ వచ్చే ఎలుకా భద్రం!
ఆస్పత్రుల్లో ఎలుకల నివారణకు పిల్లుల పెంపకం నివేదిక తయారు చేసిన వైద్యులు తిరుపతి కార్పొషన్: గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఘటన నేపథ్యంలో స్థానిక వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఎలుకలపై దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. వాటికి మందుపెట్టి చంపడం కంటే పిల్లులతో ఫుల్స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వానికి నివేదించనున్నారు. తిరుపతి రుయా ఆస్పత్రి, మెటర్నటీ, బర్డ్, స్విమ్స్, ఆయుర్వేధం ఆస్పత్రుల్లో దాదాపు కొన్ని వందల ఎలుకలు ఉన్నట్టు అధికారుల అంచనా. ఆయా ఆస్పత్రుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు, బాలిం తలు, ఇతర రోగులు వైద్యం పొందుతుంటారు. ఆయా వార్డుల్లోని రోగులపై ఎలుకలు ఎక్కడ దాడిచేస్తాయో తెలియని పరిస్థితి. గుంటూరు లాంటి ఘటనలు జరగకముందే ఎలుకలను నివారించాలని భావిస్తున్నారు. పిల్లలతో ఎదురయ్యే ఇబ్బందులను నివారించేందుకు కసరత్తు చేస్తున్నారు. పిల్లులు పెంచడమే మంచిదా? తిరుపతిలోని ఎలుకలను చంపేందుకు అనుమతివ్వాలంటూ గతంలో కార్పొరేషన్ అధికారులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎలుకలకు విషమిచ్చి చంపితే అవి డ్రైనేజీ పైపుల్లో, కాలువల్లో చనిపోతాయని, వాటి నుంచి ప్రాణాంతకమైన ప్లేగు వ్యాధి సోకే ప్రమాదముందని అప్పట్లో సున్నితంగా తిరస్కరించింది. ఈనేపథ్యంలో ఎలుకలను ఎలా చంపాలో తెలియని పరిస్థితి. వాటికి విషమిచ్చి చంపడంకంటే ఆస్పత్రుల్లోని వార్డుల్లో పిల్లులను పెంచడం ఉత్తమమని వైద్యాధికారులు భావిస్తున్నారు. -
పసికందుకు కన్నీటి వీడ్కోలు
కృష్ణలంక : ఎలుకలు దాడిలో మృతిచెందిన పసికందు మృతదేహాన్ని గురువారం నగరానికి తీసుకువచ్చారు. గుంటూరు జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యానికి బలైన ఆ శిశువుకు కడసారి వీడ్కోలు చెప్పేందుకు నగరవాసులు భారీగా కృష్ణలంకలోని ఆనందభవన్రోడ్డుకు చేరుకున్నారు. వివిధ రాజకీయపార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఆ శిశువు మృతదేహాన్ని సందర్శించి ఆ మాతృమూర్తి లక్ష్మిని ఓదార్చారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి గురువారం మధ్యాహ్నం విజయవాడకు తీసుకువచ్చారు. సాయంత్రం పసికందుకు భవానీపురం శ్మశానవాటికలో ఖననం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి కొలుసు పార్ధసారథి, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, వైఎస్సార్ సీపీ మైలవరం నియోజక వర్గ సమన్వయకర్త జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలనుకొండ శివాజీ, కార్పొరేటర్లు చందన సురేష్, గొరిపర్తి నరసింహారావు, చెన్నుపాటి గాంధీ, అడపా శేషు తదితరులు పసికందు తల్లిని పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ నిర్లక్ష్య వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పసికందు మృతి విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటిన గుంటూరు వెళ్లి సంఘటనపై డాక్టర్లతో మాట్లాడారు. సంఘటనకు కారణమైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చరిత్రలో లేని ఘోర సంఘటన అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు కె. పార్ధసారథి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లు చేసిన గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మరవలేని దారుణం జరగడం శోచనీయమన్నారు. బాలుడు మృతికి ప్రధాన బాద్యత ప్రభుత్వానిదేనని, జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా వారికి ఆస్పత్రిపై బాధ్యత పట్టదా? అని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఈ సంఘటకు ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. ప్రభుత్వాస్పత్రులను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు అన్నారు. వైద్యులు నిర్లక్ష్యంతో కాకుండా మానవత్వంతో విధులు నిర్వహించాలని సూచించారు. -
ఆస్పత్రులా... బలి పీఠాలా?
పేదల పాలిట ఖర్మాసుపత్రులుగా అపకీర్తి గడించిన సర్కారీ ఆస్పత్రుల రోగిష్టి వాలకం సామాన్య జనానికి తెలియనిదేమీ కాదు. సకల రుగ్మతలతో లుకలుకలాడుతున్న ఈ ఆస్పత్రుల్లో ఇప్పుడు మూషికాలు కూడా ప్రాణాలు తీస్తున్నాయని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జరిగిన తాజా ఘటన నిరూపిస్తున్నది. ఇన్నాళ్లూ వైద్యులు లేకనో, ప్రాణావసరమైన ఆక్సిజన్ వంటివి అందుబాటులో లేకనో, మందులు అందకో, రోగికి అవసరమయ్యే గ్రూపు రక్తం లభించకనో మరణాలు సంభవించేవి. నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న మన అవ్యవస్థను మరింత కళ్లకు కట్టేలా ఇప్పుడక్కడ ఎలుకలు కూడా కొరికి చంపేస్తున్నాయి! ఆ నవజాత శిశువు కళ్లు తెరిచి ఎన్నాళ్లో కాలేదు. అమ్మ ఒడిలోని వెచ్చదనం ఆ శిశువునింకా తాకలేదు. మూత్రనాళంలో వచ్చిన సమస్యకు మెరుగైన చికిత్స లభిస్తుందన్న ఆశతో అమ్మానాన్నలిద్దరూ ఆ బాబును అక్కడికి తీసుకెళ్లారు. రోగి పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షించడానికి తోడ్పడే ఐసీయూలోనే చేర్చారు. కానీ ప్రాణాలు కాపాడాల్సిన ఐసీయూ ఆ శిశువుకు నరకం చూపింది. సిబ్బంది మినహా బయటివారెవరినీ రానీయకుండా, ఎంతో జాగ్రత్తగా వైద్యం అందించాల్సిన ఆ ఐసీయూలో మూషికాలు యథేచ్ఛగా సంచరిస్తున్నా ఆస్పత్రి సూపరింటెండెంట్ మొదలుకొని వార్డు బాయ్ వరకూ ఎవరికీ పట్టలేదు. బాబుపై మూషికాలు దాడి చేయడాన్ని చూసిన బాలింత ఆర్తనాదాలు చేసినా ఎవరి చెవికీ సోకలేదు. మూషికాల దాడిలో చేతి వేళ్లు, కాలి వేళ్లు పూర్తిగా దెబ్బతిని...ఛాతిపైనా, బుగ్గపైనా గాయాలై నెత్తుటి ముద్దగా మిగిలిన ఆ శిశువు దాదాపు పది గంటలపాటు మృత్యు వుతో పోరాడి నిస్సహాయంగా కన్నుమూశాడు. అన్ని గంటలసేపూ సాధారణ సిబ్బందిగానీ, వైద్యులుగానీ అటుపక్క చూడలేదంటే, చిన్న ప్రయత్నమైనా చేయలేదంటే సర్కారీ ఆస్పత్రులు ఎంతగా బండబారిపోయాయో, అక్కడ పనిచేసేవారిలో మానవాంశ ఎంతగా హరించుకుపోయిందో అర్థమవుతుంది. ఏ సంఘటన జరిగినా ముక్తసరిగా మాట్లాడటం లేదా మౌనంవహించడంతో కాలక్షేపం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ హృదయ విదారక ఉదంతంపై స్పందించారు. ‘ప్రభుత్వం ఎంత చేసినా’ ఒక్క తప్పిదంతో జనంలో నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఎంత చేసింది ఈ ప్రభుత్వం? ఈ పదిహేను నెలల్లో జరిగిన తప్పిదాలు ఎన్ని ఒకట్లు? తప్పు చేస్తే కఠిన చర్యలుంటాయన్న కనీస స్పృహనైనా కలిగించగలిగిందా? తహసీల్దార్ వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన దురంతంలో బాధ్యుడైన అస్మదీయుడికి ఇంతవరకూ ఏం కాలేదు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్యా సంస్థలోకి అడుగుపెట్టిన రిషితేశ్వరిని తోడేళ్ల మంద చుట్టుముట్టి ప్రాణం హరిస్తే, అందులో ప్రిన్సిపాల్ బాధ్యత కొట్టొచ్చినట్టు కనిపించినా ఇంతవరకూ అతను అరెస్టు కాలేదు. నారాయణ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు సంభవించినా చర్యలు లేవు. ఇవన్నీ కళ్లముందు కనిపిస్తుంటే ఎవరికైనా ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? గుంటూరు ఘటనలో చంద్రబాబు కేవలం సిబ్బంది నిర్లక్ష్యాన్ని మాత్రమే చూస్తున్నారు. ఆ నిర్లక్ష్యంలో పరోక్షంగా తమ బాధ్యత ఉందన్న సంగతిని కప్పెడుతున్నారు. తాను ఎప్పటికప్పుడు ఆస్పత్రులను తనిఖీ చేస్తూనే ఉన్నానని ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ చెబుతున్నారు. అలా చెప్పారు గనుక ఆయన తప్పూ లేదన్న మాట! జరిగిన ఘోరానికి ఏవో చర్యలున్నట్టు కనబడాలి గనుక పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించే ఆర్ఎంఓ, శానిటరీ ఇన్స్పెక్టర్, హెడ్ నర్స్, స్టాఫ్ నర్స్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌నూ, మరో ఉన్నత స్థాయి అధికారిని బదిలీ చేశారు. బాధిత కుటుంబానికి పరిహారం అందజేశారు. ఈ చర్యలన్నీ తీసుకోవాల్సిందేగానీ ఇవి మాత్రమే సరిపోవని సీఎం గుర్తించడంలేదు. ఇది ఒక్క గుంటూరు ఆస్పత్రికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. ఏపీలో శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు వరకూ అన్ని ఆస్పత్రులూ ఇలాగే అఘోరిస్తున్నాయని సమాచారం అందుతున్నది. కొన్నిచోట్ల సగం సిబ్బందైనా లేకుండానే...అవసరమైన పరికరాలు, యంత్రాలు, పడకలు అందుబాటులో లేకుండానే ఆస్పత్రులు నడుస్తున్నాయి. మరికొన్నిచోట్ల పేరుకు వైద్యులున్నా పని సాగటం లేదు. 1,100 పడకలున్న ఆస్పత్రులు మొదలుకొని 100 పడకలున్న ఆస్పత్రుల వరకూ అన్నీ సమస్యలతోనే సావాసం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎలుకలు, పందికొక్కులు, పాములు, తేళ్లు ఉంటున్నాయని ఫిర్యాదులే. గుంటూరు ఘటన ప్రముఖంగా మీడియాలో వచ్చింది గనుక తాను సిగ్గుతో తలవంచుకుంటున్నానని మంత్రి కామినేని అన్నారు. కానీ ఆయన తలెత్తి చూస్తే... పట్టించుకోదల్చుకుంటే ప్రభుత్వాస్పత్రులన్నీ కొద్దో గొప్పో తేడాతో ఇలాగే ఉన్నాయని అర్థమవుతుంది. అప్పుడు కేవలం సిబ్బందిని మాత్రమే తప్పుబట్టి ప్రయోజనం లేదని, తమలో కూడా లోపం ఉన్నదని ఆయనకు తెలిసే అవకాశం ఉంటుంది. ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసే బాధ్యతనుంచి ప్రభుత్వాలు క్రమేపీ తప్పుకుంటున్నాయి. ఈమధ్యే నీతి ఆయోగ్ సీఈఓ సింధుశ్రీ ఖుల్లార్ ప్రజారోగ్య వ్యవస్థలో బీమా ఆధారిత సేవలను అందజేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ఇందులో ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఉచిత వైద్యం, ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఉచిత మందులు వగైరాలకు కాలం చెల్లిందని హితవు చెప్పారు. విధాన నిర్ణేతలు, పాలకులు ఇలా ఉంటే ఇక ప్రభుత్వాసుపత్రులు కోలుకోవడం ఎలా సాధ్యమవుతుంది? ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడే ప్రభుత్వాసు పత్రుల్లో యూజర్ చార్జీల విధానానికి శ్రీకారం చుట్టి చంద్రబాబు ఈ విషయంలో చాలా ముందుకెళ్లారు. కనుక రోగానికి మూలం ఎక్కడున్నదో... ప్రభుత్వాస్ప త్రులు ఎలుకలకు, పందికొక్కులకు, పందులకు ఎందుకు నిలయాలవుతున్నాయో సులభంగానే బోధపడుతుంది. నిర్లక్ష్యం, నిర్దయ వంటివి కట్టగట్టుకుని ప్రభుత్వా స్పత్రుల్లోనే ఎందుకు తిష్టవేశాయో అర్థమవుతుంది. పేద రోగుల పాలిట బలిపీఠాలవుతున్న ప్రభుత్వాసుపత్రులు సరిగా సాగాలంటే పాలకుల మెదళ్లకు ముందుగా చికిత్స చేయాలి. వారి ఆలోచనల్ని సరిచేయాలి. జనం మేల్కొని ఆ పని చేసేంత వరకూ దవఖానాలు బాగుపడవు గాక పడవు. -
ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)లో ఎలుకలు దాడి చేయగా శిశువు మృతిచెందిన ఘటనపై విపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్రంగా స్పందించాయి. ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల నేతలు ఆస్పత్రికి చేరుకుని జరిగిన ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీశారు. శిశువు మృతిపై కలత చెందిన స్థానికులు కూడా గురువారం వేలాదిగా జీజీహెచ్‌కు చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ, సీపీఐ నేతలు, కార్యకర్తలు జీజీహెచ్ మిలీనియం బ్లాక్ వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ఆస్పత్రిని సందర్శించిన మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు, పి. నారాయణ, హెల్త్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, కలెక్టర్ కాంతిలాల్ దండే ఆసుపత్రి అధికారులతో గంటపాటు సమావేశమయ్యారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధ శిశువు.. తల్లిదండ్రులు చావలి లక్ష్మి, నాగలను వారి వెంట తీసుకొచ్చారు. బాధితులకు న్యాయం చేయాలంటూ మంత్రులను డిమాండ్ చేశారు. మంత్రుల ఘెరావ్.. అనంతరం జీజీహెచ్ మిలీనియం బ్లాక్ ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆసుపత్రిలో సమావేశం ముగించుకుని బయటకు వస్తున్న మంత్రులను కదలనీయకుండా విపక్ష నేతలు అడ్డుకున్నారు. పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను బలవంతంగా పక్కకునెట్టి మంత్రుల వాహనాలను పంపివేశారు. అనంతరం మంత్రి కామినేని శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ ఆసుపత్రి పరిస్థితి తనకు తెలుసుననీ, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా పసికందులో మృతి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసలు దోషులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారికి అధికార టీడీపీ నేతలు అండగా ఉంటున్నారు. -
పదిరోజుల పసికందుపై ఎలుకల దాడి.
-
పదిరోజుల పసికందుపై ఎలుకల దాడి
గుంటూరు: గుంటూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందుపై ఎలుకలు దాడి చేసి వేళ్లను, ఎడమ కన్నును కొరుక్కుతిన్నాయి. దీంతో పది రోజుల ఆ చిన్నారి మృతిచెందాడు. ఇదేమని ప్రశ్నించగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని బాధితులు తెలిపారు. వివరాలు విజయవాడ కృష్ణలంకకు చెందిన చావలి నాగ, లక్ష్మి దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో రెండో కాన్పులో ఈ నెల 17వ తేదీన లక్ష్మి మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు అనారోగ్యంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్సకు వచ్చింది. అప్పటి నుంచి శిశువుకు పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. వారం రోజుల క్రితం శిశువుపై ఎలుకలు దాడి చేశాయి. దీనిపై తల్లిదండ్రులు వైద్యులకు ఫిర్యాదు చేశారు. అయినా సిబ్బంది, వైద్యులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే తాజా మంగళవారం రాత్రి శిశువు కాలి, చేతి వేళ్లతో పాటు ఎడమ కన్నును ఎలుకలు కొరికేశాయి. ముఖంపై తీవ్రంగా గాయపరిచాయి. బుధవారం ఉదయం గమనించిన నాగ, లక్ష్మి దంపతులు వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు చర్యలు తీసుకోలేదు. పెపైచ్చు...'నీకు ఇంకో కుమారుడు ఉన్నాడు కదా...ఎందుకు బాధపడుతున్నావని' సమాధానమిచ్చారు. కాగా, పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం ఆ పసికందు మరణించాడు. ఆసుపత్రి సిబ్బంది వైఖరి వల్లే తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆస్పత్రిలో ఎలుకల బెడద ఎక్కువగా ఉందని, గతంలో కూడా నలుగురు చిన్నారులు ఎలుగుల దాడిలో గాయపడ్డారని పేషంట్లు చెబుతున్నారు. అయితే సిబ్బంది మాత్రం పట్టించుకోలేదని వారు తెలిపారు.