తిరుపతి : తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనం జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 8.00 గంటలకు కల్పవృక్ష వాహనంపై అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. అలాగే రాత్రి 8.00 గంటలకు హనుమంతు వాహనంపై తిరువీధుల్లో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. అలాగే మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకృష్ణాస్వామి ముఖమండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం 6.00 గంటలకు ఆస్థాన మండలంలో ఊంజల్ సేవ జరుగుతాయి. అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు నేడు నాలుగోరోజుకు చేరాయి.