పెద్ద శేష వాహనంపై పద్మావతి అమ్మవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు అమ్మవారు పెద్దశేష వాహనంపై ఊరేగారు. తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. శ్రీరంగం నుంచి వచ్చిన శ్రీవైష్ణవులు అమ్మవారిని పల్లకిలో తీసుకెళుతున్నారు.
భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాల మధ్య పద్మావతి అమ్మవారు పెద్దశేష వాహనంపై ముందుకు సాగారు. కాగా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఉదయం, రాత్రి వేళల్లో అమ్మవారు వివిధ వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. తొలిరోజు శుక్రవారం రాత్రి అమ్మవారు చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.