అమ్మవారి సేవలో ఖడ్గం హీరోయిన్.. ! | Khadgam Movie Heroine Sangeetha Visit Padmavathi Temple In Tiruchanuru, Deets Inside - Sakshi
Sakshi News home page

Sangeetha: పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సినీనటి సంగీత!

Published Fri, Dec 8 2023 2:22 PM | Last Updated on Fri, Dec 8 2023 3:58 PM

Khadgam Heroine Sangeetha Visit Padmavathi Temple In Tiruchanuru - Sakshi

సినీనటి సంగీత.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకే ఒక్క ఛాన్స్‌ అంటూ ఖడ్గం చిత్రంలో ఆమె చెప్పిన డైలాగ్‌ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంతోనే సంగీత హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, సంక్రాంతి వంటి చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైంది. చివరగా 2010లో కారా మజాకా చిత్రంలో కనిపించిన సంగీత ఆ తర్వాత నటనకు బ్రేక్‌ ఇచ్చింది. దాదాపు 10ఏళ్ల విరామం అనంతరం మహేశ్‌ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాదిలోనే మసూద చిత్రంతో పలకరించింది.

అయితే తాజాగా సినీనటి సంగీత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సంగీత గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లను చేశారు. అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా.. అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement