తిరుచానూరు (చిత్తూరు జిల్లా) : సూర్యగ్రహణం కారణంగా చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయాన్ని మంగళవారం రాత్రి 9-30 గంటల నుండి బుధవారం ఉదయం 10 గంటల వరకూ మూసివేస్తారు. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.