తిరుమలలో శేషవాహనంపై ఊరేగనున్న శ్రీవారు | Srivari procession on Sesha Vahanam at tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో శేషవాహనంపై ఊరేగనున్న శ్రీవారు

Published Thu, Nov 7 2013 8:41 AM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM

Srivari procession on Sesha Vahanam at tirumala

నాగులచవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు తిరుమాడ వీధుల్లో శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా తిరుమలలో భక్తులు రద్దీ కాస్తా తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.

 

సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. తిరుచానురులో శ్రీ పద్మావతి దేవి అమ్మవారు ఉత్సవాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తిరుమలలో శ్రీవారికి జరిగే విధంగానే ఆ ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement