sesha vahanam
-
రెండో రోజు బ్రహ్మోత్సవాల్లో శేషవాహనంపై స్వామి వారు ఊరేగింపు
-
శేషవాహనంపై బుగ్గరామలింగేశ్వరుడు
తాడిపత్రి టౌన్ : బుగ్గరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామి, అమ్మవార్లు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం నుంచి గా«ంధీకట్ట, పోలీస్స్టేషన్ సర్కిల్, సీబీ రోడ్డు, మెయిన్ బజారు మీదుగా ఉత్సవమూర్తులను ఊరేగించారు. భక్తులు స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం రాజరాజేశ్వరీదేవి, బుగ్గరామలింగేశ్వరుడిని ప్రత్యేక వాహనంలో పుర వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ రాజశేఖర్ నాయుడు, బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సభ్యులు రవిప్రసాద్, పరిశె చంద్రశేఖర్, శేషఫణి, ఆలయ ఆర్చకులు సహదేవశర్మ, శంకరశర్మ, భక్తులు పాల్గొన్నారు. -
తిరుమలలో శేషవాహనంపై ఊరేగనున్న శ్రీవారు
నాగులచవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు తిరుమాడ వీధుల్లో శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా తిరుమలలో భక్తులు రద్దీ కాస్తా తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. తిరుచానురులో శ్రీ పద్మావతి దేవి అమ్మవారు ఉత్సవాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తిరుమలలో శ్రీవారికి జరిగే విధంగానే ఆ ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపింది.