శేషవాహనంపై బుగ్గరామలింగేశ్వరుడు | bugga ramalingeswarudu on sesha vahanam | Sakshi
Sakshi News home page

శేషవాహనంపై బుగ్గరామలింగేశ్వరుడు

Published Tue, Feb 21 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

శేషవాహనంపై బుగ్గరామలింగేశ్వరుడు

శేషవాహనంపై బుగ్గరామలింగేశ్వరుడు

తాడిపత్రి టౌన్‌ : బుగ్గరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామి, అమ్మవార్లు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం నుంచి గా«ంధీకట్ట, పోలీస్‌స్టేషన్‌ సర్కిల్, సీబీ రోడ్డు, మెయిన్‌ బజారు మీదుగా ఉత్సవమూర్తులను ఊరేగించారు. భక్తులు స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉదయం రాజరాజేశ్వరీదేవి, బుగ్గరామలింగేశ్వరుడిని ప్రత్యేక వాహనంలో పుర వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ రాజశేఖర్‌ నాయుడు, బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సభ్యులు రవిప్రసాద్, పరిశె చంద్రశేఖర్, శేషఫణి, ఆలయ ఆర్చకులు సహదేవశర్మ, శంకరశర్మ, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement