sri padmavathi
-
Minister RK Roja Photos: తాను చదువుకున్న కాలేజీకి చీఫ్‌గెస్ట్‌గా రోజా.. భావోద్వేగంతో కన్నీళ్లు (ఫొటోలు)
-
పంచమి తీర్థానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
తిరుపతి పద్మావతిలో మరో గుండె మార్పిడి
తిరుపతి తుడా(తిరుపతి జిల్లా)/పెనమలూరు: తిరుపతిలోని శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ వైద్యులు మరోసారి గుండె మార్పిడి చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. ఆదివారం రాత్రి 39 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి చేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలో వైద్యులు అతడి ప్రాణాలను కాపాడారు. 39 ఏళ్ల యువకుడికి 49 ఏళ్ల వ్యక్తి గుండె ఏలూరు జిల్లా, దొండపూడికి చెందిన మత్తి సురేష్‌బాబు (49) ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని విజయవాడలోని క్యాపిటల్ ఆసుపత్రిలో చేర్చారు. బ్రెయిన్ డెడ్ కావడంతో, కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఈక్రమంలో ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన 39 ఏళ్ల యువకుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇందుకోసం అవయవదాన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ డైరెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి సీఎంఓకు సమాచారం అందించారు. అన్ని అనుమతులు రావడంతో యువకుడికి 49 ఏళ్ల వ్యక్తి గుండెను అమర్చారు. డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డితోపాటు డాక్టర్ గణపతిలతో కూడిన ఏడుగురు వైద్యులు, టెక్నీషియన్ల బృందం ఆదివారం దాదాపు 6 గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్స విజయవంతం చేశారు. మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం వైఎస్ జగన్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. గుండె తరలింపునకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించారు. చికిత్సకు అవసరమైన రూ.12 లక్షల నిధులను సీఎం రిలీఫ్ ఫండ్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా వెంటనే మంజూరు చేశారు. గుండె తరలింపునకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎంఓను ఆదేశించారు. విజయవాడ నుంచి తిరుపతి చేరుకున్న అనంతరం విమానాశ్రయం నుంచి గుండె తరలింపునకు అధికారులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేవలం 23 నిమిషాల్లో పద్మావతి కార్డియాక్ ఆసుపత్రికి గుండెను తరలించారు. దారిపొడవునా పోలీసులు ప్రొటోకాల్ పాటించి, కట్టుదిట్టమైన భద్రత ఇచ్చారు. నలుగురికి పునర్జన్మ ఏలూరు జిల్లా దొండపూడికి చెందిన మాతి సురేష్‌బాబు (49) ఈనెల ఆరో తేదీన భవనం పైనుంచి పడిపోవడంతో బలమైన గాయాలు అయ్యాయి. బ్రెయిన్ డెడ్ అవడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో కృష్ణాజిల్లా, పెనమూరులోని క్యాపిటల్ ఆస్పత్రి, జీవన్‌దాన్ స్వచ్ఛంద సేవాసంస్థ సహకారంతో కావాల్సిన ఏర్పాట్లు చేశారు. గుండెను శ్రీ పద్మావతి కార్డియాక్ ఆస్పత్రిలోని 39 ఏళ్ల వ్యక్తికి అమర్చారు. కాలేయం, మూత్రపిండం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి, మరో మూత్రపిండం విజయవాడలోని క్యాపిటల్ ఆస్పత్రికి తరలించడంతో సురేష్‌బాబు నలుగురికి పునర్జన్మ ఇచ్చినట్లయింది. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను, బంధువులను ఏపీ జీవన్‌దాన్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ కె.రాఘవేంద్రరావు, జీవన్‌దాన్ సంస్థ ప్రధాన వైద్యుడు డాక్టర్ కె.రాంబాబు ప్రత్యేకంగా అభినందించారు. -
చిన్నారికి పునర్జన్మ.. పద్మావతి హృదయాలయం అరుదైన చికిత్స
తిరుపతి (తుడా): ఏడాది బిడ్డకు గుండె మార్పిడి చేసి పునర్జన్మ ప్రసాదించింది తిరుపతిలోని టీటీడీ శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం (చిన్న పిల్లల గుండె ఆస్పత్రి). గత నెలలో 15 సంవత్సరాల బాలుడికి గుండె మార్పిడి చేసిన ఇక్కడి వైద్యులు నెల రోజుల వ్యవధిలోనే 13 నెలల పసిబిడ్డకు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన 13 నెలల పాప అనారోగ్యం బారిన పడగా.. తల్లిదండ్రులు విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో బిడ్డను చూపించారు. పాపకు గుండె మార్చాల్సి ఉందని, తిరుపతిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. మూడు నెలల క్రితం తల్లిదండ్రులు ఆ పాపను హృదయాలయంలో చేర్చగా.. పాపకు సరిపోయే గుండె కోసం వైద్యులు జీవన్‌దాన్‌లో రిజిస్టర్ చేశారు. అప్పటినుంచి ఆస్పత్రికి తీసుకుని వచ్చి అడ్మిట్ చేశారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు ఆ బిడ్డకు వైద్యం చేస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. కాగా, చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో రెండేళ్ల బాలుడికి బ్రెయిన్ డెడ్ అయినట్టు సమాచారం అందటంతో ఏపీ జీవన్‌దాన్ సంస్థ, చిన్నపిల్లల గుండె చికిత్సల నిపుణులు డాక్టర్ గణపతి బృందాన్ని డాక్టర్ శ్రీనాథరెడ్డి సమన్వయం చేయించారు. టీటీడీ సహకారంతో అంబులెన్స్, మరో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకుని వైద్య బృందం ఆదివారం రాత్రికే చెన్నై చేరుకుంది. గ్రీన్ చానల్ అవసరం లేకుండా 2గంటల 15 నిమిషాల్లో గుండెను తిరుపతిలోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు గుండె చేరుకోవడంతో డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్ గణపతి నేతృత్వంలోని బృందం గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత శస్త్రచికిత్స రూ.30 లక్షలు ఖర్చయ్యే గుండె మార్పిడి శస్త్ర చికిత్సను టీటీడీ ప్రాణదానం, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా పూర్తిగా ఉచితంగా చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారులకు పునర్జన్మ ప్రసాదిస్తున్న వైద్యుల బృందం కృషి అభినందనీయమని కొనియాడారు. 3 నెలల జార్ఖండ్ చిన్నారికి శస్త్ర చికిత్స జార్ఖండ్ రాజధాని రాంచీ ప్రాంతానికి చెందిన లుక్సార్ పరీ్వన్ (మూడు నెలలు)కు శ్రీపద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సాలయంలో ఇటీవల గుండె చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సోమవారం కోలుకున్న ఆ చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో చిన్నారి తల్లి పరీ్వన్ ఇటీవల వేలూరులోని సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ బిడ్డకు గుండె శస్త్ర చికిత్స అవసరమని నిర్ధారించి వైద్యులు తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ఆ పసికందును ఆస్పత్రిలో చేర్చుకున్న పద్మావతి వైద్యులు 15 రోజుల క్రితం గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేశారు. బిడ్డ కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఉండటంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదాభార్గవి సమక్షంలో సోమవారం డిశ్చార్జ్ చేశారు. తన బిడ్డకు పునర్జన్మనిచి్చన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటామని పర్వీన్ సంతోషం వ్యక్తం చేశారు. లక్షలతో కూడుకున్న వైద్యాన్ని ప్రధానమంత్రి ఆరోగ్య బీమా కార్డు ద్వారా పూర్తి ఉచితంగా అందించి తన కుటుంబాన్ని నిలబెట్టారని ఆనందం వ్యక్తం చేశారు. అవయవ దానానికి ముందుకు రావాలి ఆంధ్రప్రదేశ్ జీవన్‌దాన్ ద్వారా గుండె, కాలేయం, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. పలువురి ప్రాణాలను కాపాడగలుగుతున్నాం. ప్రతి ఒక్కరూ జీవన్‌దాన్ కింద రిజి్రస్టేషన్ చేసుకుని అవయవదానానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – డాక్టర్ కె.రాంబాబు, జీవన్‌దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ -
తిరుమలలో శేషవాహనంపై ఊరేగనున్న శ్రీవారు
నాగులచవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు తిరుమాడ వీధుల్లో శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా తిరుమలలో భక్తులు రద్దీ కాస్తా తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. తిరుచానురులో శ్రీ పద్మావతి దేవి అమ్మవారు ఉత్సవాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తిరుమలలో శ్రీవారికి జరిగే విధంగానే ఆ ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపింది.