nagula chavithi
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి వేడుకలు (ఫొటోలు)
-
Nagula Chavithi 2023 Photos: తెలుగు రాష్ట్రాల ఆలయాల్లో నాగుల చవితి పూజలు (ఫొటోలు)
-
పాము పాలు తాగదు మరీ పుట్టలో పోయడం ఎందుకు ?
నాగుల చవితి ఆశ్లేష , ఆరుద్ర , మూల , పూర్వాభాద్ర , పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది , పాకేది. నాగములో *‘న , అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు. కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఇక చవితికి పుట్టలో పాలు పోయడంలో అంతరార్థం ఏమిటి? ఆ 12 నాగులనే ఎందుకు పూజిస్తారు..? ఇక చవితి అంటే నాల్గవది అనగా ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితినాడు దేవాలయాలలో , గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి. ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును , పుట్టను , రాయిని , రప్పను , కొండను , కోనను , నదిని , పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. ని పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు , రెండు పాములు మెలికలు వేసుకొని రావి , వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు , వైవాహిక , దాంపత్య దోషాలు , గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం , కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయిఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ , పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట !. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా - సంహితల్లో , బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ , ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు , కర్కోటకుడు , వాసుకి , శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి. కద్రువ నాగ మాత , మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే - ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు , రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది. శ్రావణ మాసంలో ఎందుకు చేస్తాం అంటే.. వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం ‘నాగ పంచమి’ పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి , రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. కార్తీకంలో ఎందుకంటే..? పంటలు ఏపుగా పెరిగే కాలం కావడంతో ‘కార్తీక శుద్ధ చవితి’నాడు మనం ‘నాగుల చవితి’ని పర్వదినంగా ఆచరిస్తున్నాం. పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు !. పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు. ‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని , వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి , సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే , నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. పంట పొలాలకు శత్రువులు ఎలుకలు , వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే , మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా , విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఆధ్యాత్మిక యోగా పరంగా ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుపాము' అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. పుట్టలో పాలు పోయటంలో అంతరార్థం.. అందువల్ల నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది. నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం* పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం. ”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం , అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. ఆ 12 నాగులనే ఆరాధిస్తారు.. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి. నాగుల చవితి మంత్రం పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. అనంత వాసుకి శేష పద్మ కంబాల కర్కోటకం ఆశ్వతార ధృతరాష్ట్ర శంఖపాల కలియా తక్షక పింగళ ఈ ప్రపంచంలో పాములు, ఆకాశం , స్వర్గం , సూర్యకిరణాలు , సరస్సులు , బావులు చెరువులు నివసిస్తున్నాయి. ఈ రోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు. పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి . నడుము తొక్కితే నావాడు అనుకో పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో తోక తొక్కితే తోటి వాడు అనుకో నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి. ప్రకృతిని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము. పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము. మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత. బియ్యం , రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట. ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం. పుట్ట నుంmr మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు. ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని. (చదవండి: అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో షాకింగ్ ఘటన..చనిపోయిన ఆ మొసలి స్థానంలో..) -
నాగుల చవితి రోజున నాగుపాముకి బర్త్ డే విషెస్ చెప్పిన కుర్రాళ్లు..
-
తెలుగు రాష్ట్రాల్లో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు (ఫొటోలు)
-
నాగుల చవితికి పుట్టలో పాలు ఎందుకు పోస్తారో తెలుసా..? కారణం ఇదే..
Nagula Chavithi 2022: కార్తీక శుద్ధ చతుర్థికి నాగుల చవితి అని పేరు. ఈనాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని విశ్వాసం. మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి వున్న వెన్నెముకను ‘వెన్నుబాము’ అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో ‘పాము’ ఆకారంలో వుంటుందని యోగశాస్త్రం’ చెబుతోంది. చదవండి: World Stroke Day: సమయం లేదు మిత్రమా! ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ‘సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు ‘నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పాలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుందని, అదే పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని పండితులు చెప్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఘనంగా నాగుల చవితి
పులివెందుల టౌన్ : సల్లంగా చూడవయ్యా నాగరాజా అంటూ మహిళలు నాగుల చవితి పండుగను పురస్కరించుకుని సోమవారం తెల్లవారుజామునే పుణ్యస్నానాలు చేసి నోముల దారాలు, నువ్వులు, చలి పిండి తయారు చేసుకుని పుట్టల వద్దకు చేరుకున్నారు. అక్కడ పుట్టకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి నూలు దారంతో పుట్టకు చుట్టి నోము చీర నాగుల పుట్టవద్ద పెట్టి పూజలు చేశారు. అనంతరం ఉపవాస దీక్షలో ఉన్న మహిళలు కంకణాలు ధరించారు. నాగ పంచమి వరకు ఉపవాస దీక్షలు కొనసాగించి తర్వాత పుట్టలో పాలు, కొబ్బెర, బెల్లం వేసి ఉపవాస దీక్షలు విరమిస్తారు. పట్టణంలోని తూర్పు ఆంజనేయస్వామి, మిట్టమల్లేశ్వరస్వామి ఆలయంలోని నాగులకట్ట, కోతి సమాధి, బ్రాహ్మణపల్లెరోడ్డులోని నాగుల కట్ట, పార్నపల్లెరోడ్డు షిర్డిసాయిబాబా ఆలయంలోని నాగులపుట్ట, నాగుల కట్టల వద్ద ప్రత్యేక పూజలు చేసి నాగుల చవితిని ఘనంగా జరుపుకున్నారు. ఎర్రగుంట్ల : నాగులచవితి పండుగను మండల వ్యాప్తంగా మహిళలు వైభవంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచి మహిళలు ఉపవాసాలతో నాగుల కట్టకు , పుట్టల వద్దకు వెళ్లి ఉపవాస దీక్షలు చేపట్టారు. ముద్దనూరు : నాగుల చవితి పర్వదిన వేడుకలను సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వాడవాడలా నాగదేవతకు ప్రతీకగా భావించే పుట్టల వద్ద భక్తులు పూజలు చేశారు. నాగదేవతకు ప్రీతికరమైన పాలు, నువ్వుల పిండి, పెసరపప్పులను నైవేద్యంగా అర్పించారు. పలువురు భక్తులు మొక్కుబడులు చెల్లించి పూజలు నిర్వహించారు. కమలాపురం : కమలాపురం పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో నాగుల చవితి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. సోమవారం కమలాపురం, గంగవరం, సంబటూరు, కోగటం, పందిళ్లపల్లె, పెద్దచెప్పలి, చిన్నచెప్పలి తదితర గ్రామాల్లో మహిళలు తెల్లవారు జాము నుంచే తలస్నానాలాచరించి సమీపంలోని పుట్టవద్దకు చేరుకున్నారు. పుట్టలో పాలు పోసి 101 దారం పోగులు చుట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నువ్వుల పిండి, బియ్యం పిండి తదితర ప్రసాదాన్ని పంచి పెట్టారు. వల్లూరు : మండలంలోని పలు గ్రామాలలో భక్తులు సోమవారం నాగుల చవితి పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయాన్నే తల స్నానాలు చేసి నాగులకు, పుట్టలకు ఉపవాస దీక్షలను చేపట్టారు. సలి పిండి, నువ్వుల పిండి, పెసర బేడలు, బియ్యం, కొబ్బెర, బెల్లంను నాగులు, పుట్టలకు సమర్పించారు. అనంతరం వాటిని ప్రసాదాలుగా పంచి పెట్టారు. భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు జమ్మలమడుగు రూరల్: నాగులచవితి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం వేకువజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కుటుంబ సభ్యులతో నాగులపుట్ట వద్దకు తరలివచ్చారు. పుట్టలో పాలు వేసి, పిండి పదార్థాలను పుట్ట వద్ద ఉంచి పూజలను నిర్వహించారు. -
భక్తిశ్రద్ధలతో నాగులచవితి (ఫొటోలు)
-
Sravana Masam: శ్రావణం శుభకరం.. ముఖ్యమైన తేదీలివే!
అనంతపురం కల్చరల్: ఈనెల 28న వచ్చే అమావాస్య రాకతో ఆషాఢమాసం ముగిసి శుక్రవారం నుంచి నోములు, వ్రతాలకు నెలవైన శ్రావణం మాసం రానుంది. శుభకార్యాలు మళ్లీ మొదలు కానుండడంతో మాసమంతటా ప్రతి ఇంటా శ్రావణ శోభతో అలరారే పండుగలు, సామూహిక వ్రతాలు సందడి చేయనున్నాయి. శ్రావణంలో భక్తిశ్రద్ధలతో ఆచరించే ప్రతి పండుగ వెనుక ఆధ్యాత్మిక కోణమే కాకుండా సామాజిక, వైజ్ఞానిక అంశాలెన్నో దాగున్నాయని పెద్దలు చెబుతారు. మానవ సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన శ్రావణ మాసం ఈనెల 29 నుంచి వచ్చే నెల 27 వరకు ఉంటుంది. ఇప్పటికే శ్రావణమాస పూజల కోసం జిల్లా వ్యాప్తంగా ఆలయాలు ప్రత్యేకంగా ముస్తాబవుతున్నాయి. ఈనెల తప్పితే మళ్లీ డిసెంబరు వరకు శుభముహూర్తాలు లేకపోవడంతో ఫంక్షన్ హాల్స్, కల్యాణమండపాలు బిజీగా మారనున్నాయి. మహిళలకు ప్రీతికరం శ్రావణ నోములు, వ్రతాలు భక్తితోనోచుకుంటే దీర్ఘ సుమంగళిగా ఉంటామన్న విశ్వాసముండడంతో మహిళలు ఈ మాసాన్ని అత్యంత ప్రీతికరంగా భావిస్తారు. పౌర్ణమి చంద్రుడు శ్రవణా నక్షత్రం మీద సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణం అని పేరొచ్చింది. అఖిలాంఢకోటి బ్రహ్మాండ నాయకుడైన వేంకటేశ్వరస్వామి ఇదే నక్షత్రంలో జన్మించినందున శ్రీవారి ఆలయాల్లో విశేష పూజలు జరుగుతాయి, ఆయన సతీమణి లక్ష్మీదేవి, సోదరి గౌరికి ఇదే మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ క్రమంలో పలు ఆలయాల్లో సామూహిక వ్రతాలు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రావణంలో వచ్చే మంగళవారాలతో పాటూ శుక్రవారాలు, శనివారాలు ఆలయాలు ప్రత్యేక పూజలు, భక్తులతో కిటకిటలాడుతాయి. (చదవండి: 'మామ్పవర్ 360’.. కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన మహిళలను తిరిగి..) శ్రావణంలో వచ్చే పండుగలివే.. శ్రావణ మాసమంతటా పండుగల సందడితోనే సాగుతుంది. వచ్చే నెల 1న రానున్న నాగుల చవితితో పర్వదినాలు ఆరంభమవుతాయి. మరుసటి రోజుననే గరుడ పంచమిని జరుపుకుంటారు. 5న వరమాలక్ష్మీ వ్రతం, 12న రక్షాబంధనం (రాఖీ పౌర్ణిమ), 18, 19 తేదీల్లో వచ్చే శ్రీకృష్ణజన్మాష్టమితో పాటూ బలరామ జయంతి, హయగ్రీవ జయంతి, రాధాష్టమి పండుగలు వరుసగా ఆనందాలను తెచ్చేవే. మాసం చివరిరోజున కూడా పొలాల అమావాస్యను జరుపుకోవడం ఆనవాయితీ. వ్రతాలకు శ్రావణమాసాన్ని ఎంచుకోవడంలో ఆరోగ్యపరమైన కారణాలున్నాయని, ప్రత్యేక పూజలకు సన్నాహాలు చేస్తున్నట్లు వేదపండితులు చెబుతున్నారు. (చదవండి: ఈ మొక్కలు పెంచితే ఎంత డేంజరో తెలుసా?) -
నోట్లో డీజిల్ పోసుకుని ఫైర్ చేస్తుండగా రివర్స్ ఫైర్
-
Fire Accident: నోటిలో డీజిల్ పోసుకొని ఫైర్ చేస్తుండగా ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని యలమంచిలిలో నేలవేషాల కార్యక్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. యలమంచిలి మున్సిపాలిటీలో నాగుల చవితి సందర్బంగా నేలవేషాల కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో సంతోష్ అనే వ్యక్తి నోటిలో డీజిల్ పోసుకొని ఫైర్ చేస్తుండగా.. అది కాస్త రివర్స్ కావటంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలగులోకి వచ్చింది. సంతోష్‌కు గాయాలు కావటంలో అతన్ని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఘనంగా నాగుల చవితి వేడుకలు
సాక్షి, విశాఖపట్నం : నాగుల చవితి వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం నాగుల చవితి కావడంతో ప్రజలు సంప్రదాయ రీతిన ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సమేతంగా భక్తులు పట్టలో పాలు పోసి పూజలు నిర్వహిస్తున్నారు. విశాఖలో ప్రజటు నగరంలోని జూపార్క్, ఏయు గ్రౌండ్స్, పోర్టు స్టేడియం, మధవధార పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు భక్తులతో రద్ధీగా కనిపించాయి. భారతీయులు నాగ వంశీయులు అన్న భావంతో.. పంటలు పంటటు పండటంలో నాగులు చేసిన సహాయానికి కృతజ్ఞతగా నాగుల చవితి జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. -
తిరుమలలో ఈ నెల విశేష పర్వదినాలు
సాక్షి, తిరుమల : అక్టోబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు సంతరించుకున్నాయి. ఇటీవల నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. కాగా సోమవారంతో బ్రహ్మోత్సవాలు ముగిసిన నేపథ్యంలో ఆక్టోబర్ మాసంలో వచ్చే విశేష పర్వదినాలతో తిరుమల మరోసారి ముస్తాబవుతోంది. వాటి వివరాలు.. తేది విశిష్టత అక్టోబరు 13 పౌర్ణమి గరుడసేవ అక్టోబరు 21 శ్రీ తిరుమలనంబి ఉత్సవారంభం అక్టోబరు 26 నరకచతుర్దశి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవ ఆరంభం అక్టోబరు 27 దీపావళి ఆస్థానం, కేదారగౌరి వత్రము అక్టోబరు 30 శ్రీ తిరుమలనంబి శాత్తుమొర అక్టోబరు 31 నాగుల చవితి -
పాలు పోయొద్దు .. ప్రాణాలు తీయొద్దు
నాగుల చవితి పండుగ రోజు పాముకు పాలు పోయాలని అందరూ అనుకుంటారు. అలా చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. కానీ ఆ పాలే పాములకు విషమవుతోంది. సర్పాల చావుకు కారణమవుతోంది. కారణం.. పాములు సరీస్పపాలు. అవి పాలు తాగవు.. గుడ్లు తినవు. ఇవేమీతెలియక ప్రజలు భక్తి భావంతో పాములకు పాలు, గుడ్లు ఆహారంగా ఇస్తుండడంతో... అవి సర్పాల జీర్ణవ్యవస్థకు భిన్నమైనవి కావడంతో మృత్యువాతపడుతున్నాయి. పండుగ నేపథ్యంలో స్నేక్ లవర్స్ ‘పాలు పోయొద్దు.. ప్రాణాలు తీయొద్దు’ నినాదంతో అవగాహన కల్పిస్తున్నారు. సాక్షి సిటీబ్యూరో: ఇంటిల్లిపాదికి సంపూర్ణ ఆరోగ్యం, నిండు నూరేళ్ల జీవితాన్ని ప్రసాదించాలని మహిళలు నాగదేవతకు పూజలు చేస్తారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని అత్యంత భక్తి ప్రపత్తులతో వేడుకుంటారు. శుభప్రదమైన జీవితం కోసం పాములకు పాలు పోస్తారు. కానీ ఆ పాలే వాటి పాలిట విషంగా మారుతున్నాయి. ఆధ్యాత్మికత ఉట్టిపడే నాగచవితి పాముల పాలిట శాపంగా పరిణమిస్తోందని, పాములకు పాలు పోస్తే మంచి జరుగుతుందనే అపోహ కారణంగా నగరంలో ఏటా వందలాది పామలు మృత్యువాత పడుతున్నాయని స్నేక్‌లవర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాములు, పక్షులు, తదితర వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యం కోసం కృషి చేస్తోన్న గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టూ ఎనిమిల్స్ (జీహెచ్‌ఎస్‌పీఎస్‌ఏ), పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ (పీఎఫ్ఏ) తదితర సంస్థలు ‘ పాలు పోయొద్దు పాముల ప్రాణాలు తీయొద్దు’ అనే లక్ష్యంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. జీవవైవిధ్యాన్ని కాపాడాలని పిలుపునిస్తున్నాయి. బుట్టతో ఉపాధి బాట... ప్రకృతి పట్ల ఆరాధన, చుట్టూ ఉన్న జీవజాలం పట్ల దయ కలిగి ఉండడాన్ని మించిన మానవత్వం మరోటి ఉండదు. అందుకే ప్రకృతితో పాట అనేక రకాల జంతువులు, పక్షులు కూడా మనుషులకు పూజ్యనీయమయ్యాయి. ఇది నాణేనికి ఒకవైపు అయితే మరోవైపు, కొన్ని రకాల పూజలు, ఇతర కార్యక్రమాలతో శుభం జరుగుతుందనే ప్రజల నమ్మకం కొందరు వ్యక్తులకు ఉపాధిగా మారుతోంది. నాగచవితి రోజు పాముకు పాలు పోస్తే ఇంట్లో అంతా మంచే జరుగుతుందనే ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకొనేందుకు పాములను పట్టేవారు రంగంలోకి దిగుతున్నారు. నాగచవితికి రెండు నెలల ముందు నుంచే నగరం శివారు ప్రాంతాల నుంచి వివిధ రకాల పాములను సేకరిస్తున్నారు. వాటి సహజమైన జీవనవిధానానికి భిన్నంగా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. తాళ్లతో పాముల తలను గట్టిగా బంధించి కోరలు కత్తిరిస్తారు. అనంతరం విషపు గ్రంధులను తొలగిస్తున్నారు. ఇలా ఏటా 200 నుంచి 300 లకు పైగా పాములను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు స్వచ్చంద సంస్థల అంచనా. అనంతరం వాటిని బుట్టల్లో బంధించి చీకటి గదిలో ఉంచుతారు. వీటికి నీళ్లు, ఆహారం లేకుండా రోజుల తరబడి బుట్ట్టల్లో బంధిస్తున్నారని జీహెచ్‌ఎస్‌పీఎస్‌ఏ కో–ఆర్డినేటర్ సౌధర్మ భండారీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా బంధించిన పాములు నాగపంచమి నాటికి పూర్తిగా జీవచ్ఛవాలుగా మారిపోతాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూంటాయి. అలాంటి పాములను బుట్టల్లో వేసుకొని ఇల్లిల్లూ తిరుగుతారు. ఇంటికి వచ్చిన పాములకు మహిళలు పాలు ఇస్తారు. ఇందుకుగాను వారు రూ. 1000 నుంచి రూ.2500 వరకు డిమాండ్ చేస్తున్నట్లు అంచనా. కొందరు భక్తులు తమ శక్తి మేరకు రూ.500 సమర్పించినా తీసుకుంటారు. అయితే అప్పటి వరకు ఎలాంటి ఆహారం లేకుండా ఆకలితో ఉన్న పాములు ఈ పాలను తాగేందుకు ప్రయత్నిస్తాయి. కానీ పాలు వాటికి ఆహారం కాకపోవడంతో ఒకటి రెండు రోజుల్లోనే అది మృత్యువాత పడుతున్నాయి. ‘‘ పాములకు పాలు పోస్తే శుభం కలుగుతుందనే ప్రజల నమ్మకం, పాములు పట్టేవాళ్లకు ఉపాధి మార్గంగా మారింది. ఈ క్రమంలో ఏటా కొన్ని వందల పాములు మృత్యువాత పడుతున్నాయి. ఇది జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమిస్తోంది.’’ అని సౌధర్మ ఆవేదన వ్యక్తం చేశారు. అపోహలు వద్దు... ♦ పాములు సరీసృపాలు. అవి పాలు తాగవు. గుడ్లు ఆరగించవు. బాగా ఆకలిగా ఉన్నప్పుడు భక్తులు ఈ ఆహారాన్ని ఇస్తున్నారు. అయితే ఇవి వాటి జీర్ణవ్యవస్థకు భిన్నమైనవి. ♦ పాముల ప్రధానమైన ఆహారం ఎలకలు. పొలాల్లో. చేలల్లో, అడవుల్లో లభించే ఎలకలు, కప్పలు, ఇతర ప్రాణులను ఆహారంగా తీసుకుంటాయి. ♦ పక్షులు గూళ్లు పెట్టుకున్నట్లుగా పాములు ప్రత్యేకంగా పుట్టల్లో ఉంటాయనేది కూడా అపోహేనంటున్నారు నిపుణులు. ♦ పాముల పడగలో మణి ఉంటుంది. దానిని ధరిస్తే సంపద, అదృష్టం కలిసి వస్తాయనేది పూర్తిగా అపోహ. పాములు పాట్టేవాళ్లే వాటికి జెమ్స్‌ను అతికించి విక్రయిస్తూ రూ.వేలల్లో సొమ్ము చేసుకుంటున్నారు. కానీ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇది నేరం. సమాచారం ఇవ్వండి... పాములు ఎలాంటి స్థితిలో కనిపించినా వాటికి ప్రాణహాని తలపెట్టవద్దు. పాములను బయటికి తరలించేందుకు అటవీశాఖ టోల్ ఫ్రీ నెంబర్ 18004255364 నెంబర్‌కు సంప్రదించవచ్చు. అలాగే జీహెచ్‌ఎస్‌పీఎస్‌ఏ కో ఆర్డినేటర్ సౌధర్మకు ఫోన్ : 8886743881 నెంబర్‌కు సమాచారం ఇవ్వవచ్చు. -
పాములకు పాలుపోస్తే ఖబర్దార్!
సాక్షి, హైదరాబాద్ : పాములకు పాలు పోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. పాములు పాలు తాగుతాయన్నది మూఢ నమ్మకమని, పాములను పట్టుకుని హింసించవద్దని సూచించింది. ఎవరైనా పాములను పట్టుకుని ఆడిస్తే... వెంటనే అటవీశాఖకు, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. వన్యప్రాణి చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా దీనిపై ప్రసార మాద్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా నాగుల చవితి, పంచమి సందర్భంగా భక్తులు పుట్టలో పాలు పోయడం ఆచారంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే పర్యావరణ సమతుల్యతలో పాములు కూడా భాగమే అని, పాములను పట్టి ఆడించడం కూడా వన్యప్రాణి చట్టప్రకారం నేరం అని అటవీశాఖ స్పష్టం చేసింది. వచ్చే నెల 5వ తేదీన పంచమి సందర్భంగా పాములకు పాలు పోయడంపై... సోమవారం అరణ్య భవనంలో జరిగిన అటవీశాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో ఓ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాములకు పాలు పోయడం, పాములను ఆడించడం, బలవంతంగా పాములను హింసించడంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. మరోవైపు ప్రజల మనోభావాలను దెబ్బతీయరాని, వారిపై బలవంతపు నిర్ణయాలు రుద్దడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
నాగుల చవితికి పుట్టలో పాలు ఎందుకు పోస్తారు?
కార్తీక శుద్ధ చతుర్థికి నాగుల చవితి అని పేరు. ఈనాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని విశ్వాసం. మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి వున్న వెన్నెముకను ‘వెన్నుబాము’ అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో ‘పాము’ ఆకారంలో వుంటుందని యోగశాస్త్రం’ చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ‘సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు ‘నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పాలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుందని, అదే పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని పండితులు చెప్తారు. -
భక్తిశ్రద్ధలతో నాగుల చవితి
-
భక్తిశ్రద్ధలతో నాగుల చవితి
సాక్షినెట్‌వర్క్ : నాగుల చవితి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం ఉదయం నుంచే ఆయా ప్రాంతాల్లోని నాగుల కట్టలు, పుట్టల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున పాలను పోశారు. -
చవితి సందడి
-
ఆలయాల్లో నాగుల చవితి పూజలు
-
పాము Vs పాలు
-
నాగమ్మా... కరుణించవమ్మా!
శ్రీశైలం(కర్నూలు): నాగులచవితిని పురస్కరించుకుని శ్రీశైల భ్రమరాంభమల్లికార్జున ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద మంగళవారం ఘనంగా నాగులచవితి వేడుకలను నిర్వహించారు. నాగులకట్ట వద్ద ఉన్న పుట్టకు పూజలు చేసి నాగమ్మా...కరుణించవమ్మా అంటూ వేడుకుంటూ అక్కడి నాగప్రతిమలకు పాలతో అభిషేకాలను చేశారు. ఉపవాసదీక్షను తీసుకుని పుట్టలో పాలు పోసి పత్తితో చేసిన వస్త్రంలాంటి యజ్ఞోపవీతాన్ని నాగ ప్రతిమలకు అలంకరించి ప్రత్యేకపూజలను శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు. అనంతరం నువ్వులపిండి, చలిమిడి, వడపప్పులను నివేదనగా సమర్పించారు. నాగులచవితిన ఆలయప్రాంగణంలోని పుట్టలకు, నాగప్రతిమలకు పూజలు చేయడం ఆనవాయితీ. చవితి తరువాత మరుసటి రోజు వచ్చే నాగపంచమికి కూడా విశిష్టత ఉందని వేదపండితులు తెలిపారు. నాగపంచమి రోజున ఇంట్లోనే బంగారు, వెండి లేదా మట్టితో చేసిన నాగప్రతిమకు పంచామృతాలతో, జాజి,సంపెంగలాంటి సువాసన పూలతో పూజించడం వలన సర్పదోషాలు నశిస్తాయని, గర్భదోషాలు నివారించబడుతాయని, కళ్లకు చెవులకు సంబంధించిన వ్యాధులు రావని పేర్కొన్నారు. నేడు శ్రావణశుద్ధ నాగపంచమి జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రంలో బుధవారం శ్రావణశుద్ధ నాగపంచమి సందర్భంగా శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలోని నాగులకట్ట నాగపంచమి వేడుకలను నిర్వహించుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నాగపంచమిని ఎలా చేయాలి పురాణవచనాన్ని బట్టి శ్రావణశుద్ధ పంచమినాడు ఇంటి ద్వారానికి రెండు వైపులా ఆవుపేడతో సర్పాలను వేసి విధి విధానంగా లేత గరిక, దర్భ, గంధ పుష్పాక్షతలు, పెరుగు, మొదలైన వాటితో నాగేంద్రుని అర్చించి బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేయాలని వేదపండితులు తెలిపారు. ఇలా చేసిన వారికి సర్పభయం ఉండదని, సంతానం లేనివారికి పుత్రపౌత్రాభిరస్తు అని నాగేంద్రుడు దీవిస్తాడని వారు పేర్కొన్నారు. -
భక్తి శ్రద్ధలతో నాగుల చవితి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గురువారం నాగులచవితిని కుటుంబ సమేతంగా మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రధానంగా గ్రామాల్లో నాగేంద్రుడి పుట్టల్లో పాలుపోసిన భక్తులు కోడిగుడ్లను కూడా వదిలి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. -
అత్తవారింటికెళ్తూ...అనంత లోకాలకు
చీపురుపల్లి రూరల్/తెర్లాం, న్యూస్‌లైన్: పండగంటిపూట భార్యాబిడ్డలతో అత్తవారింట ఆనందంగా గడుపుదామనుకుని ఎన్నో ఆశలతో బయలు దేరిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహన ప్రమాదంలో అనంత లోకాలకు చేరుకున్నాడు. గురువారం జరిగిన ఈ దుర్ఘటన పలువురిని కలిచివేచింది. తెర్లాం మండల పరిధిలోని డి.గదబవలసకు చెందిన జావాన రమేష్(28) చీపురుపల్లి మండలం పేరిపిలో అత్తవారింటికి తన సమీప బంధువు శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలోని గెడ్డపువలస గ్రామానికి చెందిన బూరాడ వెంకటరమణతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. వారు ప్రయాణిస్తున్న వాహనం చీపురుపల్లి-సుభద్రాపురం ప్రధాన రహదారిలో యలకలపేట కూడ లి వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో వాహనం వెనుక కూర్చున్న రమేష్ మర్మావయవాలపై బలమైన దెబ్బ తగలడంతో సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు. వాహనం నడుపుతున్న వెంకటరమణకు ఎడమకాలు విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని 108కు స్థానికులు సమాచారం అందించగా వెంకటరమణను మెరుగైన చికిత్సకోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. రమేష్‌కు రెండున్నరేళ్ల క్రితం పేరిపికి చెందిన లక్ష్మితో వివాహమైంది. వారికి 6నెలల వయస్సుగల చిన్నారి ఢిల్లీశ్వరి ఉంది. ఇంటర్మీడియెట్ చదువుకున్న రమేష్ ఉపాధి కోసం వైజాగ్‌లో పనులు చేసుకుంటూ కాలంవెళ్లదీస్తున్నాడు. నాగులచవితి పూజలు నిర్వహించేందుకు బుధవారం రాత్రి గదబవలసకు వచ్చాడు. గురువారం ఉద యం నాగులచవితి పూజలు ముగించుకుని రెండో పూట అత్తవారింటికి బయలు దేరివెళ్లాడు. ఇంతలో ఈ ఘోరం జరిగిందని మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు జావాన రామారావు, అప్పలస్వామిలు తెలిపారు. చేతికందికొచ్చిన కొడుకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో అతని భార్య, బిడ్డతోపాటు తమను ఆదుకునే నాథుడు లేడని రమేష్ తల్లిదండ్రులు సూర్యనారాయణ, అప్పలనర్సమ్మలు రోదిస్తున్నారు. నలుగురితో కలివిడిగా ఉంటూ ఇలా వాహన ప్రమాదంలో మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
తిరుమలలో శేషవాహనంపై ఊరేగనున్న శ్రీవారు
నాగులచవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు తిరుమాడ వీధుల్లో శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా తిరుమలలో భక్తులు రద్దీ కాస్తా తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. తిరుచానురులో శ్రీ పద్మావతి దేవి అమ్మవారు ఉత్సవాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తిరుమలలో శ్రీవారికి జరిగే విధంగానే ఆ ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపింది.