
సాక్షి, విశాఖపట్నం : నాగుల చవితి వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం నాగుల చవితి కావడంతో ప్రజలు సంప్రదాయ రీతిన ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సమేతంగా భక్తులు పట్టలో పాలు పోసి పూజలు నిర్వహిస్తున్నారు. విశాఖలో ప్రజటు నగరంలోని జూపార్క్, ఏయు గ్రౌండ్స్, పోర్టు స్టేడియం, మధవధార పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు భక్తులతో రద్ధీగా కనిపించాయి. భారతీయులు నాగ వంశీయులు అన్న భావంతో.. పంటలు పంటటు పండటంలో నాగులు చేసిన సహాయానికి కృతజ్ఞతగా నాగుల చవితి జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment