ఎస్‌ఐపై గల్లా అనుచరుల దాడి | four persons attcked to the si | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐపై గల్లా అనుచరుల దాడి

Published Thu, Apr 20 2017 4:03 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM

four persons attcked to the si

► నలుగురు యువకుల బరితెగింపు
► రాజీ కోసం తీవ్రంగా కృషిచేసిన సీఐ
► ఇన్‌స్పెక్టర్‌ తీరుపై రగిలిపోతున్న పోలీసులు
 
తిరుచానూరు: తిరుచానూరు ఎస్‌ఐపై బుధవారం రాత్రి గల్లా అరుణకుమారి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఎస్‌ఐ రామాంజనేయులు రాత్రి సింధూ జంక్షన్ వైపు వెళుతుండగా నలుగురు యువకులు ఓ ఆటో డ్రైవర్‌తో గొడవ పడుతుండ డాన్ని గమనించి వారిని వారించే యత్నం చేశారు. ఆ యువకులకు, ఎస్‌ఐకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఎస్‌ఐ ఓ యువకుడిపై చేయి చేసుకోవడంతో ఆ నలుగురు కలసి ఎస్‌ఐపై దాడిచేసి పారిపోయారు. వారు టీడీపీకి చెందిన సునీల్, అతని అనుచరులని అక్కడున్నవారు తెలిపారు. ఎస్‌ఐ స్టేషన్‌కు వచ్చి సీఐకి ఫిర్యాదు చేశారు.

దాడికి పాల్పడ్డ వారు అధికార పార్టీకి చెందినవారు కావడంతో ‘‘ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా చూడాలి. నువ్వు కొత్తగా వచ్చావు. అధికార పార్టీ నాయకులను చూసీ చూడనట్టు వ్యవహరించాలి’’ అని సీఐ సలహా ఇచ్చారు. దీంతో ఎస్‌ఐ మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. సాక్షాత్తూ ఎస్‌ఐపై దాడిచేస్తే కేసు నమోదు చేయకుండా రాజీ యత్నం చేయడంతో సీఐపై పోలీసులు  రగిలిపోతున్నారు. ఎస్పీ అయినా స్పందించాలని కోరుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement